15, జనవరి 2025, బుధవారం

పురాణ కథ...

 🙏పురాణ కథ....!!




🌹ఈ రోజున ప్రాచీనకాలంలో ముగ్గురు భూలోకానికి వచ్చి రెైతులను అనుగ్రహించారు. 🌹


*అందులో ఒక ఆయన ధన్వంతరి* 


*రెండవ ఆయన సాక్షాత్తూ బలరాముడు. ఈ బలరాముడు పూర్వం ఆదిశేషుడు. రెైతులు అంటే ఇష్టం కలగినవాడు ఆదిశేషుడు.* 


*మూడవ వారు శాకంభరి అనే పేరుతో అమ్మవారు*


 భూలోకానికి వస్తుంది. పూర్వం  దుర్గముడు అనేటువంటి పాపాత్ముడి కారణం వల్ల ప్రజలందరికి కరువు వచ్చింది. 


🌸కరువును తొలగించి, రకరకాల కూరగాయలతో అన్నం పెట్టి, వారిని అమ్మవారు రక్షించింది. అప్పటినుండి అమ్మవారిని శాకంభరి అని పిలిచారు. ఆ శాకంభరీ దేవి కనుమ నాడు భూమి మీదకు వస్తుంది. 


🌿ఈ విధంగా ఆయుర్వేద వైద్యుడైన  ధన్వంతరి, వ్యవసాయానికి సాయం చేసే ఆదిశేషుడు,


🌸విత్తనాలు మొదలైనటు వంటివి ఇచ్చే శాకంభరీదేవి ఈ ముగ్గురు కనుమ నాడు భూలోకమునకు వచ్చి ప్రజల్ని అనుగ్రహిస్తారు. 


🌿వారి అనుగ్రహం  పొందితే ఏటికేడాది మనకు పంటలు బాగా ఉంటాయి, తిండికి ఎప్పుడూ కటకట ఉండదు, తిండి సమృద్ధిగా లభిస్తుంది‌.


🙏ఆచరించవలసిన విధి విధానాలు – సత్ఫలితాలు🌹🙏


🌸 కనుమనాడు కూడా తెల్లవారుఝామున లేవాలి, స్నానం చేయాలి, ఈరోజు గో పూజ చేయాలి.

ఎద్దులను కూడా పూజించాలి. 


🌿గోపూజ ను మించిన పూజ మరొకటి లేదు. సమస్తదేవతలు గోవు లో ఉన్నారు. 


🌸 ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలగాలంటే కనుమనాడు మాషచక్రాలను అంటే మినుములతో తయారుచేసిన గారెలను భగవంతునికి నివేదన చేసి, 


🌿కాలభైరవునికి సమర్పించి, తాను తిని ఇతరులకు పెడితే మంచిదని శాస్త్రంచెబుతున్నది. వీలుంటే చెట్లను కూడా పూజించాలి. వృక్షాలను పూజిస్తే కుటుంబం పచ్చగా ఉంటుంది...

కామెంట్‌లు లేవు: