15, జనవరి 2025, బుధవారం

బుధగ్రహస్తుతి

 🌹బుధవారం - బుధగ్రహస్తుతి🌹


//శార్దూలం//

తారాచంద్రకుమారకం మరకతేశ్రద్ధాన్వితం బుద్ధిదంl

సౌమ్యం సోమరిపుం సుపీతవసనం బాణాసనం సింహగమ్ll

రాజత్పుస్తకహస్తపద్మయుగళం విజ్ఞానవారాంనిధింl

శుక్రాదిత్యసఖం చ ముద్గముదితం వందేహమార్యం బుధమ్ll

~మల్లిభాగవతః...!


*భావం:-*

బృహస్పతిభార్యయైన తారాదేవికి చంద్రుని మూలాన జన్మించినవాడు, మరకతమణి పై మోజుగలవాడు,బుద్ధినొసగువాడు, సౌమ్యగుణోపేతుడు, చంద్రుణ్ణి ద్వేషించువాడు,పీతాంబరధారియై బాణాకారమండలోపాసీనుడు, సింహవాహనుండు,

ఇరుచేతులందు పుస్తకమును పట్టిన జ్ఞానసాగరుడు, రవిశుక్రులందు మైత్రిఁగలవాడు, ముద్గధాన్యము(పెసలు)పై ప్రీతిగలవాడు, వైశ్యుడూ ఐనట్టి బుధునికి ప్రణమిల్లుచున్నాను. 🙏

కామెంట్‌లు లేవు: