శు భో ద యం 🙏
మత్తకోకిల మనోహరరావాలు!!
నన్నెచోడుని కుమారసంభవమొక అద్భుత కావ్యం!వర్ణనా ప్రియుడైన నన్నెచోడుడు
మనోహరమైనవసంతశోభనువివరిస్తూ ,మత్తకోకిలను వర్ణించారు మక్తకోకిలలోనే
దానిసొగసులు చమత్కారాలు ఉపద్రష్టవారి మాటల్లో విందాం.
నమస్సులాచార్యా! 🕉🙏🌹అందంగా ఆకృతినొందిన అక్షరప్రసూనాలివి.
ఆసక్తి ఉన్న వేదిక మిత్రులకు ఓ రెండు ముక్కలు:
ఈ వృత్తాన్ని నన్నెచోడుడు తన కుమారసంభవములో *ముద్రాలంకారముతో* వాడిన సందర్భం ఒకటి గుర్తుకొస్తోంది: ఇదిగో ఆ పద్యము –
"మెత్త మెత్తన క్రాలు దీవు స-మీరణుండ, మనోభవుం
డెత్తకుండఁగ వేగకూడఁగ – నెత్తు, మెత్తక తక్కినన్
జత్తు సుమ్ము వసంతుచే నని – చాటునట్లు చెలంగె నా
మత్తకోకిల లారమిం గడు – మాసరంబగు నామనిన్"
అందమైన ఆమనివేళట! ఆ వేళ ఆ తోటలోనున్న మత్తకోకిలలు “ఓ సమీరమా! నీవేమో మెత్తమెత్తగా (మెల్లమెల్లగా) వీస్తున్నావు. మారుడు నీమీద దండయాత్ర చేయకముందే, నువ్వే త్వరగా వాడిమీద దండెత్తు, అలా చేయకపోతే వసంతుని చేత చస్తావు. జాగ్రత్త సుమా” అని హెచ్చరిక చేసినట్లుగా ధ్వనులు చేశాయిట.
సంస్కృతములో ఈ వృత్తములో వ్రాయబడిన పద్యాలలో ఒకటి బాగా ప్రసిద్ధి చెంది, మన నాలుకలమీద నిత్యం నాట్యం చేసే చంద్రశేఖరాష్టకం. అందులో ఒకటి:
"రత్నసాను శరాసనం రజతాద్రిశృంగ నికేతనం
శింజినీకృత పన్నగేశ్వర అచ్యుతానల సాయకం
క్షిప్ర దగ్ధ పురత్రయం త్రిదశాలయై రభివందితం
చంద్రశేఖర మాశ్రయే మమ కింకరిష్యతి వై యమ
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం"
అలాగే - మహానుభావుడు లీలాశుకుని శ్రీకృష్ణకర్ణామృతము నుండి మత్తకోకిల వృత్తంలో ఒక చక్కని ఉదాహరణ:
"పల్లవారుణ పాణిపంకజ – సంగి వేణురవాకులం
ఫుల్ల పాటల పాటలలీ పరి-వాది పాద సరోరుహం
ఉల్లసన్మధురాధరద్యుతి – మంజరీ సరసాననం
వల్లవీ కుచకుంభ కుంకుమ – పంకిలం ప్రభు మాశ్రయే"
ఈ అందమైన వృత్తం ఎందరు మహానుభావుల్ని ప్రభావితం చేసిందో!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి