9, ఫిబ్రవరి 2025, ఆదివారం

పోతనగారి అక్షరచిత్రం!

 పోతనగారి అక్షరచిత్రం!


అటగాంచెన్ గరిణీవిభుండు

నవఫుల్లాంభోజకల్హారమున్,

నటదిందీవరవారమున్ గమఠమీనగ్రాహ

దుర్వారమున్

వటహింతాల రసాలసాలసుమనోవల్లీ

కుటీతీరమున్

చటులోధ్ధూత మరాళచక్రబక

సంచారంబుఁ గాసారమున్.

 -పోతనకవీంద్రుడు-గజేంద్రమోక్షము.

     దప్పిఁగొన్నగజేంద్రుడు నిజపరివారముతో  నీటివసతికై అడవిలో వెదకుచు తుదకొక చక్కని

సరోవరమును గాంచినాడు.

           

ఇదీ అసలు విషయము.


దీనిని మనకళ్ళకు గట్టింప మనోహరమైన వర్ణచిత్రమును చిత్రించుచున్నాడు.పోతన.

    

ఈపద్యమున నించుక నతిశయోక్తిని

జోడించి సరోవర స్వరూపమును స్వభావోక్తి సుందరముగా తీర్చిదిద్దినాడు.

కవులు స్వర్ణకారులు (సు+వర్ణ-వర్ణమనగా అక్షరము)వారిలో లోపనితనమెరిగిన సువర్ణచిత్రకారుడు పోతన.

      అటగాంచెన్కరణీవిభుండు,అను పద్యమును క్రియాపద,సహిత కర్తృపదముతో

ప్రారంభించి పిదపవరువసగా విశేషణములనుజోడించుచు,చినరకు

కాసారమున్ అని విషయమును ముగించినాడు.

   ఈవర్ణనమున కాసార భౌతిక సుందర

స్వరూప సందర్శనమును గావించినతీరు మెచ్చదగియున్నది.

      1నవఫుల్లాంభోజకల్హారము,-అప్పుడేవికసించిన పద్మములు ,ఎఱ్ఱకలువలు కలది.

2నటదిందీవరవారమున్-విరిసిన ఆజలజములపై ముసరుతున్నతుమ్మెదలబారులు.

3కమఠమీనగ్రాహదుర్వారమున్-తాబేళ్ళు,సొఱచేపలు,మొసళ్ళు మొదలగువానినలన ప్రవేసింపనలవిగానిది .

4 వట హింతాలతమాలతాల సుమనోవల్లీ కుటీతీరమున్-మఱ్ఱి,మద్దీ,మామిడీ,తాపించములు, మొన్నగువృక్షములకు పెనవేసికొనిన పూలతీవెల పొదలుకలిగినది.

5.చటులుధ్ధూత మరాళ చక్ర బక సంచారంబు-చయ్సన నొక్కపెట్టున

నెగురుచున్న,హంస, చక్రవాక,బకాది పక్షిసముదాయముగలది.

  

 దిదృక్షారతులకు ముందుగా గానవచ్చునది పద్మశోభ.పిదప తుమ్మెదలరొద,తరువాత ఆలోచింపజేయునది దాని ప్రవేశార్హత.

ఆపైదానిపరిసరములయందము.

చినరిగా పక్షుల అలజడి.


         ఈతీరున సుమనో మనోహరముగా  వర్ణనలను నిర్వహించుట అపురూపము.

ఈసుందర దృశ్యమును బమ్మెరవారు ఆలోచనాలోచనాలతో

తొలుతతాముదర్శించి పిదపభావుకులైన పాఠకులకు ప్రదర్శనమొనరించినారు.🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: