16, జనవరి 2026, శుక్రవారం

కనుమనాడు ప్రయాణం

 *"కనుమనాడు ప్రయాణం చేయకూడదంటారు. నిజమేనా?"*అను దానికి సమాధానం...


కనుమనాడు కాకి కూడా కదలదని సామెత. తెల్లవారి నిద్రలేస్తూనే ఆహారాన్ని అన్వేషించే అల్పజీవి కాకి. అటువంటి కాకికి కూడా కనుమనాడు తిండికి లోపం ఉండదు కాబట్టి, ఊరు వదిలి ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండదు.


కాకికి పితృపక్షి అని పేరు. ఆబ్ధీక సమయంలో పితృపిండాలను కాకి, గ్రద్ధలకు పెడతారు. లేదంటే నీటిలో విడిచిపెట్టి జలచరాలకు సమర్పిస్తారు. వాటిని సంతృప్తి పరిస్తే ఆ పుణ్యం పితృదేవతలకు చేరుతుందని మన వారి నమ్మకం


కనుమ ప్రత్యేకించి పెద్దలకు పెట్టుకునే పండుగ. ఆ రోజున తప్పనిసరిగా పితృదేవతలకు మన కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. అంటే ఇంటి వద్ద తప్పనిసరిగా ఉండాలి. అందుకే కనుమనాడు ప్రయాణం చేయవద్దన్నారు.

============================

కామెంట్‌లు లేవు: