16, జనవరి 2026, శుక్రవారం

అందరమొకటై చేయగ

 *2321*

*కం*

అందరమొకటై చేయగ

సుందరమై పండుగ యిల శోభిల్లునయా.

అందరునూ కలిసెడి యా

నందదినమె పండుగయగు ననయము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! అందరూ ఒకటి గా కలిసి నిర్వహించుకుంటే పండుగ ఈ లోకంలో అందంగా ప్రకాశిస్తుంది. అందరూ కలిసి ఉండే ఆనందకరమైన దినమే ఎల్లప్పుడూ పండుగ కాగలదు.

*సందేశం&సందర్భం*:-- ఈ రోజల్లో చాలా మంది ఎవరికి వారు గా ఒంటరిగా పండుగ లు నిర్వహించుకొనుచూ సరైన సంతృప్తి ని పొందటం లేదు., అలాగే పండుగ నాడైనా స్వజనులకు దగ్గరగా వచ్చుటలేదు,అలా పండుగ సంతోషాలను పరిపూర్ణముగా ఆస్వాదించడం లేదు. కనీసం మరో సందర్భంలో అయినా అందరూ కలిస్తే ఆ రోజు నే పండుగ నిర్వహించుకొనవచ్చుననేది సందేశం, ఎందుకంటే అందరూ కలిసి ఉండే ఏ రోజైననూ పండుగ రోజు వంటి దే కదా!!

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: