16, జనవరి 2026, శుక్రవారం

సమాజ ధర్మము*

 *సంస్థలు - సమాజ ధర్మము*




భగవంతుడు మనిషితో బాటు జీవులన్నిటికి శరీరము ఇచ్చినప్పటికీ, ఇతర జీవులకు లేని *వివేకము* అను గొప్ప గుణమును *మనుష్యులకు మాత్రమే* ఇచ్చాడు. 


ఏ విషయంలోనైనా *విజయం* సాధించాలంటే, మొదట చేసే ఆ పనిని *అభిమానించాలి, ప్రేమించాలి*. దీక్షగా *పరుల కోసం* చేసే పని చిన్నదైనా, పెద్దదైనా అది చేసే వారిలోని అంతః శక్తిని మేల్కొల్పుతుంది. కాని, చేసే వారిలో *నిజాయితి* ఉండాలి. 


మనం గొప్ప వాళ్ళం కాకపోయినా, మనం చేసే పనులు గొప్పవైతే అవే మనను సమాజంలో *గొప్పవాడిగా* నిలబెడతాయి. 


చిన్న సూక్తి పరిశీలిద్దాము..

*పురుషకార్య మనువర్తతే దైవమ్* అంటే దైవం పురుష ప్రయత్నాన్ని అనుసరించి ఉంటుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే విషయమేదయినా (మంచి) పురుష ప్రయత్ననం చేస్తే *దైవం కూడా దానంతట అదే* తోడ్పడతుంది. కాని, చేసేవారు *నిజాయితీగా* ఉండాలి. 


సహాయ, సహకార, సాంస్కృతిక సంస్థలన్ని *సాంఘిక, సామాజిక, నిర్మాణాత్మక, ఆధ్యాత్మిక, వేదాంతం లాంటి విశేశాంశములకు సన్నిహితంగా ఉండాలి* . తార్కిక, రాజకీయ అంశములకు దూరంగా ఉండాలి.


*పరివర్తనలేని* సమాజము ఎలా ఉంటుందంటే బ్రతికి ఉన్నన్ని రోజులు *అవసరానికి మించిన* ధన, ధాన్య, సంపదలకై పెనుగులాట, *ఆయువు తీరినాక* ఆరడుగులకై వెతుకులాట. 


*నిజాయితి అనేది వ్యక్తులు తమకు తాముగా మల్చుకున్న ఒక విలువైన, అమూల్యమైన అలవాటు*. బాధ్యతలను చిన్న చూపు చూసే వాళ్ళ వద్ద, బాధ్యతలను విస్మరించే వాళ్ళ వద్ద *నిజాయితిని* ఆశించలేము. 


మనం మంచి పనులు చేద్దాము. మనకు *అవకాశాలు, శక్తి లేనప్పుడు*, మంచి పనులు చేసే వాళ్ళను అభినందిద్దాము, అనుసరిద్దాము. 


పెద్దలు చెప్పిన మాట 

*స్తోత్రం కస్యన తుష్టయే*

పొగడ్త ఎవ్వరిని సంతోష పెట్టదు, అంటే దేవుళ్లతో సహా అందరిని సంతోష పెడ్తుంది. 


*మనస్సుకు హత్తుకునే రచనలు, సమాజము మెచ్చే కార్యాలుంటాయి*. మంచి పనులు చేసిన వారిని అభినందించుట, మెచ్చుకునుట, ప్రోత్సహించుట అనగా *భగవంతుడు మనుష్యులకిచ్చిన మాటను పునీతము చేసుకునుటయే* . ప్రశంస తోటివారికి సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది. *మనలో లేని గొప్పతనం అవతలి వారిలో ఉందని నిరాశ చెందగూడదు*. ప్రతి ఒక్కరిలో ఉండే సంస్కారము, సౌమ్యత మేళవించిన భావప్రకటనల వలన సమాజమే రంజిస్తుంది.


*నేను ఒక్కడిని ఏమిచేయగలనను నిరాశ వద్దు. సంస్థలలో చేరుదాము, సంయుక్తంగా సమాజానికి సేవ చేద్దాము*


సమాజ సేవ, ధర్మ కార్యాల లాంటి మంచి కర్మలు సదా మంచి ఫలితాలనే ఇస్తాయి. *ఆ పుణ్య కర్మల ఫలితాలు ఎల్లప్పుడూ మనిషిని వెన్నంటి ఉంటాయి, శుభాలను అందిస్తూనే ఉంటాయి*.


ధన్యవాదములు.

కామెంట్‌లు లేవు: