16, జనవరి 2026, శుక్రవారం

ముదనష్టం

 *"ముదనష్టం": తెలుగు జాతీయాలు:*


ఉట్రవుడియంగా వచ్చిపడ్డ ఆస్తిగాని సొమ్ము గాని ముదనష్టమని వ్యవహరిస్తారు.

వివరణ: ఎవరెవరో దూర బంధువులు కన్నుమూస్తే వారసత్వంగా వారి ఆస్తిపాస్తులు సంక్రమిస్తే అవి ముదనష్టపు ఆస్తులంటారు. అసలు శబ్దం 'మృతనష్ట' మనేది. మృతులు (చనిపోయినవారు) నష్టపోగా మనకు లాభంగా దొరికింది మృతనష్టమని, మనకు అలా వచ్చిపడింది కష్టార్జితంకాదు కాబట్టి దానికి గౌరవం లేదు. దాన్ని నిలుపుకోవటం కూడా కష్టమే.. దాని విలువ ఎంతో, ఎంత శ్రమఫలితమో మనకు అనుభవపూర్వకంగా తెలియదు కాబట్టి. అది అనుకోకుండా వచ్చింది. కాబట్టి అదిపోయినా కష్టఫలితం పోయినంతగా ఎవరూ దుఃఖించరు. కాబట్టి దానిమీద గౌరవభావం ఉండదు. ఒక విధంగా అది నీచ సంపాదన కింద లెక్క. అందుకే సదరు ఆస్తినేగాక దానితోబాటు సంక్రమించే బుద్ధులను కూడా నీచంగా హీనంగా పరిగణించి 'ముదనష్టపుబుద్ధి, ముదనష్టపువాడు' వగైరా తిట్లను కూడా తెలుగువారు సిద్ధంచేసి వాడుకలో ప్రవేశపెట్టారు. చివరకు ఈ మాటకు నీచం, హీనం, దీనం, తప్పుడు - వగైరా అర్థాలు వ్యవహారంలో నిలిచాయి.

కామెంట్‌లు లేవు: