విశ్వనాధ వితరణ గుణం!
" నకర్మణా నప్రజయా నధనేన
త్యాగేనైకేనానమృతత్వ మానసుః'-
(దానమొక్కిటే మానవునిఅమరునొనర్చుననితాత్పర్యం)
అన్నవేదవాక్యానికి చక్కని నిదర్శనం
విశ్వనాధజీవితం.తనకున్నా లేకువ్నా
గుప్తదానాలుచేయటం వారిస్వభావం.
లెక్చరర్ గాపనిచేస్తూ, పేదవిద్యార్ధులకు
ఫీజులువగైరాలు కట్టటం సరేసరి. తనపరిసరాలలో ఉండేవారిని అవసరానికి ఆదుకోవటం ఆయనకు అలవాటు. ఆఅలవాటు రానురాను బలపడిందేతప్ప ఏమాత్రం తగ్గలేదు.
ఉందా లేదా అనే ఆలోచనయేలేదు.చేతికి వచ్చింది వెంటనే యిచ్చెయ్యటమే!
చిటిపొట్టి దానాలను చెప్పుకోవలసినపనేలేదు.
వారి మహనీయమైన దాతృత్వానికి అద్దంపట్టిన రెండు సంఘటనలను మీముందుంచుతాను.
1 విశ్వనాథ కొంతకాలం కరీంనగర్ కాలేజీకి ప్రిన్సుపాలుగా పనిచేశారు.
ఆరోజులలో చొక్కారావుగారువగైరా
జగిత్యాలలో వారికి ఘన సన్మానం చేసి
10వేలరూపాయల పర్సుయిచ్చారు.
కవిసామ్రాట్ తిరుగుప్రయాణంలో ధర్మపురి లక్మీనరసింహస్వామి దర్శనానకి వచ్చారు.గుడిప్రాకారందాటి
ముఖమండపంవైపు అడుగులేశారు.అంతే మంత్రముగ్ధునివలె చేతులు జోడించి
అరమోడ్పుకనులతో శ్రధ్ధగా వినసాగారు. అక్కడ వేదవిదులైనబ్రాహ్మణులు సుస్వరంగా
వేదపారాయణచేస్తున్నారు.ఆపారాయణ పూర్తిఅయ్యేవరకూ పారవస్యంతో అక్కడే నిలబడి.
పారాయణ ముగియగానే తనజేబులో నున్న 10వేలరూపాయలకట్టను ఆబ్రాహ్మణుల ముందుంచి నిర్వికారంగా
వెనుదిరిగి కారెక్కారు.అచ్చెరువందటం చూచినవారి వంతైంది.
అదీ వారి దానశీలత!
2 ఇప్పుడు నేచెప్పబోయే రెండవది.ఇది
వారి ఔదార్యానికి,పరాకాష్ఠ. రామాయణకల్పవృక్ష తపః పలంగా వారికి జ్ఞానపీఠం అవార్డు దక్కింది.అవార్డుద్వారా.లక్షరూపాయలపారితోషికంగూడా లభించింది.
రోజులు గడుస్తున్నాయి.ఒకనాడు
అనుకోని అతిథియై తనచిన్ననాటి మిత్రుడు కొల్లిపర సూరయ్యగారి కుమారుడు విశ్వనాధయింటికి వచ్చాడు.అతిథిమర్యాదలు,కుశలప్రశ్నాదికాలు అయినవి. "నీవెందుకొచ్చావురా?"-అన్నారు విశ్వనాథ. ఆకుర్రాడు సిగ్గుపడుతూ, కొంచెసంకోచిస్తూ, ఒక కాగితం విశ్వనాథకు అందించాడు.అదిప్రోనోటు.
50వేలరూపాయలకు వ్రాయబడింది.అదిచూడగానే విశ్వనాథబిత్తరపోయారు. ఇదెందుకురా? అన్నారు.పాపం కుర్రాడు
భయపడుతూ, "బాబయ్యగారూ!మాచెల్లికి పెళ్ళిసంబంధంకుదిరింది. మిమ్మల్నడిగి అప్పుగా 50వేలు తెమ్మని నాన్నపంపాడు.ఇన్నాడు"-అంతే విశ్వనాథ భగ్గుమన్నారు.
"ఏరా!మీనాన్న ఏమనుకుంటున్నాడు?.నేనిక్కడ వడ్డీవ్యాపారంచేస్తున్నా ననుకుంటున్నాడా?ప్రో నోటుఅందుకా?
పోరా! పో! నాదగ్గరడబ్బులేదు.ఉన్నా ఇవ్వను. ఈమాట మీనాన్నతోచెప్పు.
ఇంక నడువ్!"-అంటూ అతిదారుణంగా
ఆపిల్లవాణ్ణి మందలించి పంపేశారు.
గుడ్లనీరు నించుతూ ఆపిల్లవాడు మెల్లగా అక్కడనుండి జారుకొన్నాడు.
మరికొంత సేపటి విశ్వనాధతేరుకున్నారు.చొక్కాతొడుకుకొని భుజంమీద ఉత్తరీయం అలంకరించుకొని చెక్ పుస్తకం జేబులో పెట్టుకొని తిన్నగా బ్యాంకుకి వెళ్ళి 50వేలు డ్రాచేసి చేతిసంచీలో పెట్టుకొని
జట్కాయెక్కి సరాసరి కొల్లిపర సూరయ్య యింటిముందుదిగారు.
అప్పటి కక్కడివాతావరణం
చాలావేడివేడిగా ఉంది.కొడుకుచెప్పినమాటలు విని సూరయ్య"బాబయ్యగారి కోపంతాటాకులమంటరా!అదిక్షణ కాలమే! నీకుతెలియదులే వారితత్వం.
వారిహృదయం వెన్నముద్దరా?పోనీలే మనకు ప్రాప్తంలేదు.నీవేమీబాధపడకు.
అంటూ వీధిఅరుగుమీదకూర్చుని కొడుకును సముదాయిస్తున్నారు.
అంతలో నవ్వుతూవిశ్వనాధ అక్కడప్రత్యక్షం!
బాబయ్యగారొచ్చారు,బాబయ్యగారొచ్చారని ఆడ మగ సంభ్రమపడుతూ వారికి స్వాగతం పలికారు.
విశ్వనాధపాదప్రక్షాళనంచేసి అరుగు మీద సూరయ్యగారికి దగ్గరగా జరిగి కూర్చుని సూరయ్యవీపునిమురుతూ కుశలాదికములడిగి, "ఎన్నో ఆడపిల్లరా?
ఆపెళ్ళికూతురు?ఏదీ ఇటురమ్మను"-
అన్నారు .పెళ్ళికూతురు వినయంగావచ్చి విశ్వనాధపాదాలకు నమస్కరించింది.కాబోయేపెళ్ళికూతుర్ని
పైకిలేపి ఆశీర్వదిస్తూ, చేతిసంచీలోని 50వేలరూపాయలు ఆపిల్లచేతిలో ఉంచి
జట్కాయెక్కారు.
" సూరయ్యా!నీకూ నాకూ మధ్యరుణమేమిటిరా?నీకూతురిపెళ్ళికిది నాచదివింపు.రుణపత్రంపంపావని కోపం వచ్చిన మాటనిజమే దాన్ని మరచిపో!"-అని నిర్లిప్తంగా యింటికి మరలారు.
ఇక అవార్డుశేషం 50 వేలతో తమస్వగ్రామంలోని శిధిలమౌతున్న శివాలయాన్ని జీర్ణోధ్ధారంగావించారు.
ఇంతకీ సూరయ్యగారెవరు?
వారికీ వీరికీ గలసంబంధం ఏమిటి అనిగదూ మీసందేహం.అయితేవినండి
సూరయ్యగారూవీరూ చిన్ననాటి స్నేహితులు .ఒకేగ్రామం.వీధిబడిలోకలిసి చదువుకున్నారు. నాడు
కలిమికివారసుడైన సూరయ్య తరువాత సంపదపోయి కష్టాలలోపడ్డాడు.అయినా చిన్ననాడు వారింటతాననుభవించిన సుఖభోగాలను విశ్వనాధమరువలేదు.సమయానికి స్నేహితుని ఆదుకొని స్నేహం విలువయేదో నిరూపించారు.
ఇదీ వారి వితరణ గుణం!!!
స్వస్తి!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి