28, మే 2023, ఆదివారం

సాదాకా మేలుకో -2 పడగనీడలో

సాదాకా మేలుకో -2

 పడగనీడలో 

ఒక కప్పు ఎండలో అటు ఇటు తిరుగుతూ వున్నదట దానికి ఎక్కడ కూడా ఏమాత్రం నీడ దొరకటం లేదు కాళ్ళు కాలిపోతున్నాయి, శరీరం అంతా చెమటలతో మునిగిపోతుంది, నోరు ఎండిపోతున్నది, ఇంకనేను బ్రతకలేనేమో అని భావిస్తుండగా కొంత దూరంలో కొద్దిగా నీడ కనిపించింది.  బతుకు జీవుడా అని ఆ కప్పు ఆ నీడలో తన శరీరాన్ని దాచుకోవటానికి వేగంగా వెళ్ళింది.  అక్కడకు వెళ్ళగానే ప్రాణానికి కొంత ఊరట లభించింది. అమ్మయ్య నాకు ఈ నీడ చాలా హాయిగా వుంది అని అనుకొన్నది. కొంత ఊరట చెందినతరువాత నీళ్లు ఎక్కడైనా లభిస్తాయా అని అటు ఇటు చూడటం మొదలు పెట్టింది.  ఆ వెతుకులాటలో తన మీద ఉన్న నీడ అటు ఇటు కదలటం గమనించింది.  ఏమిటి ఈ నీడ ఇలా కదులుతున్నది అని ఒక్కసారి పైకి చూసింది.  పైకి చూసిన తన ఫై ప్రాణాలు పీకే పోయాయి ఎందుకంటె ఆ నీడ మరెవరిదో కాదు కప్పలను విందారగించే ఒక పెద్ద పాముది నా అదృష్టం కొద్ది దాని ద్రుష్టి నా మీద పడలేదు కానీ పడితే ఆ భావనతోటె ప్రాణం పోయినంత పామునైయింది. కప్పు రక్షింపబడ్డదా లేక భక్షింపపడ్డాదా అనేది పాఠకుల విజ్ఞతకే వదిలి వేస్తున్నాను.  

ఇక విషయానికి వస్తే సాధకులారా మీ సాధన నిత్యం కొనసాగించండి.  రోజు సాధనను నిర్విరామంగా చేస్తేనే కానీ మనకు ఈ జన్మలో మోక్షం లభించదు జాప్యం అస్సలు  చేయవలదు. మనం ఏ పనినైనా వాయిదా వేయవచ్చు కానీ దేవదేవుడైన పరమేశ్వరుని ధ్యానాన్ని అస్సలు వాయిదా వేయకూడదు.  మనకు లభించిన ఈ జన్మ కేవలం పడగనీడలో వున్న కప్ప జీవిత కాలమంతే మన వెనుక పెద్ద పడగ వున్నది దానిపేరు కాలుడు. అందుకే మన ఆదిశంకరులు చెప్పారు "నిత్యం సన్నిహితే మృత్యువు"  మానవ జీవనం కూడా పాము పడగక్రింద వున్న కప్పలాంటిదే ఆ పాము (మృత్యువు) ఏ క్షణంలో నయినా కాటు వేసీ ప్రాణాన్ని అపహరించగలదు.  కాబట్టి మనం ఎల్లప్పుడూ జాగరూకులం అయి ఉండాలి.

కాబట్టి సాధక నీ జీవితంలో ప్రతి నిముషం విలువైనదని తెలుసుకో నీ జీవితాన్ని పూర్తిగా జన్మ రావాహిత్యానికై అంటే మోక్షానికి మాత్రమే ఉపయోగించు.  మనం నిత్యం అనుభవించే సుఖాలు, భోగాలు నిత్యమైనవి కావు కేవలము తాత్కాలికమైనవి ఈ సంగతి ప్రతి సాధకుడు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. 

ఈ రోజుల్లో మనకు అనేకమంది తమ వాక్చాతుర్యంతో భక్తి మార్గాన్ని ప్రభోదిస్తున్నామని చెపుతున్నారు.  నిజానికి వారు వారి జీవితాలను యెంత మోతాదులో ఉద్దరించుకుంటున్నారు అన్నది ఒక ప్రశ్నర్ధకమే. ఎంతమంది దేహ వ్యామోహం లేకుండా వున్నారు. చాలా వరకు దేహవ్యామోహం  ఉన్నట్లు ప్రస్ఫుటంగా బాహ్యంగా కనిపిస్తూ ఆధ్యాత్మికతను బోధిస్తున్నారు. మరి తమను తామే ఉద్దరించుకోలేని స్థితిలో ఉంటే వారు మనలను ఎలా ఉద్ధరిస్తారు ఆలోచించండి. 

నిజమైన సాధకుడు దేహవ్యామోహాన్ని వదిలి ఉండి ఈ దేహం కేవలం మోక్షాన్ని పొందటానికి ఉపయోగ పడే ఒక సాధనగా మాత్రమే తలుస్తాడు. ఏ మాత్రము దూషణ, భూషణాదులకు లొంగడు, అరిషడ్వార్గాన్ని నియంత్రించుకొని ఉంటాడు, ఎప్పుడు మృదు భాషణలు చేస్తాడు, రాజసం అస్సలు ఉండదు, ధనాపేక్ష, కీర్తి కాండూతి ఉండదు. తన జీవితాన్ని ఎలా తరించుకోవాలని మాత్రమే ఆలోచిస్తాడు. అటువంటి సాధకుడు మాత్రమే సద్గురువుగా పేర్కొన వచ్చు. అటువంటి సద్గురువులు తారసపడితే వారి సాన్నిధ్యంలో మన సందేహ నివృత్తి చేసుకొని నిత్యం సాధన చేస్తే తప్పకుండ మోక్షం సిద్ధిస్తుంది. 

ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు 

భార్గవ శర్మ

 


కామెంట్‌లు లేవు: