173వ రోజు: (భాను వారము) 28-05-2023
మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:
చెలిమితోడ మెలగు స్నేహితుండుండిన
బాధలన్ని తొలగు పరువు పెరుగు
కష్ట సమయ మందు కాచువాడెహితుడు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.
స్నేహితులతో మంచిచెడులు, కష్టనష్టములు వ్యక్తపరచిన ఎడల మన మనస్సు తేలిక పడి తదుపరి చేయు పనులందు ఏకాగ్రత పెరుగును. అంతేగాక కష్టసమయమందు ఆదుకుని తగు సూచనలు సలహాలు అందించిన వాడు మాత్రమే అసలైన హితుడు (మిత్రుడు).
హితుడు = హితమును (మేలు) కోరు వాడు.
ఈ రోజు పదము.
ఏనుగు గున్న (Small Elephant): ఎత్తుగున్న, కలభము, కారుజము, గున్నేనుగు, దిక్కము, శిశునాగము, వాసంతము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి