28, మే 2023, ఆదివారం

తెలివితేటలకు ఉండే శక్తి

 *"తెలివితేటలు"*


శరీర బలం ఉన్నవాని కంటే తెలివితేటలు ఉన్నవాడు బలవంతుడు. పర్వతమంత ఆకారంలో ఉండే ఏనుగును సైతం మావటివాడు అవలీలగా లొంగదీసి దాని మీదకు ఎక్కగలడు. 


కండలు తిరిగి, శరీరం దృఢంగా ఉండి బలవంతులైనవారు చాలామంది ఉంటారు. అలాగే బాగా చదువుకుని తెలివితేటలు సంపాదించుకున్న నీతి మంతులు కూడా ఉంటారు. అయితే వీరి శరీరం దృఢంగా ఉండక పోవచ్చు. 


కానీ వారికున్న తెలివితేటలతో దేహ బలం ఉన్నవారి కంటే బలవంతులుగా ఉంటారు. ఏనుగు కొండంత ఉంటుంది. జంతువులన్నిటిలోకీ శరీరబలం ఉన్నది ఏనుగు మాత్రమే. మరే ప్రాణికీ అంత బలం లేదు. 


మావటివాడు ఏనుగు పరిమాణంలో పదోవంతు కూడా ఉండడు. అయినప్పటికీ కొండంత ఉన్న ఏనుగును మావటి తన దగ్గరుండే అంకుశంతో లొంగదీసుకుని దాని మీద ఎక్కి కూర్చోగలుగుతున్నాడు. దీనికి కారణం అతనికి ఉన్న తెలివితేటలు. 


తెలివితేటలకు ఉండే శక్తి అమేయమైనది.

కామెంట్‌లు లేవు: