21, ఫిబ్రవరి 2025, శుక్రవారం

మంత్రశక్తి

 మంత్రశక్తి గురించి వివరణ - మంత్రసిద్ధి .


       మన ప్రాచీన భారతీయ వేదాలలో మరియు అనేక రహస్య గ్రంథాలు అన్ని మంత్రాలతో కూడుకుని ఉన్నాయి . ఈరోజు మీకు మన ప్రాచీన మంత్రశాస్త్రం గురించి మీకు వివరిస్తాను. 


              ఈ సకల చరాచర సృష్టి మూడింటిపైనా అధారపడి ఉంటుంది. అవే  తంత్రం , మంత్రం , యంత్రం. చాలా మంది మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని వెటకారంగా ప్రశ్నిస్తూ ఉంటారు . సరైన మంత్రవేత్త ఉంటే చింతకాయలు రాల్చడమే కాదు తన మంత్రశక్తితో చింతచెట్టునే సృష్టించగలడు. ఇప్పుడు నేను మీకు వివరిస్తున్న ఈ మంత్రశాస్త్రం గురించి పూర్తిగా అర్థం అవ్వాలి అంటే మిగిలిన తంత్ర , యంత్రశాస్త్రం గురించి కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది. మొదటగా తంత్రశాస్త్రం గురించి చెబుతాను.


                  తంత్రశాస్త్రం అనగా ఉన్నది లేనట్టు , లేనిది ఉన్నట్టు చూపించగల కనికట్టు విద్యలు అన్నియు ఈ విభాగములోనికే వస్తాయి. అంతే కాదు గ్రహసంబంధ దోషాలకు కూడా ఈ తంత్రశాస్త్రము నందు సులభ మార్గాలు ఉంటాయి . ఉదాహరణకు మీకు రాహుగ్రహ దోషం ఉన్నది అనుకొండి మంత్రశాస్త్రము నందు దోషనివారణార్థం జపాలు , హోమాలు ఉంటాయి. అదే తంత్రశాస్త్రవేత్త మాత్రం coffeebyte చాకోలెట్లు పంచమని చెప్తాడు. రాహుగ్రహానికి సంబంధించిన బ్రౌన్ రంగుతో ఆ చాకోలెట్స్ ఉంటాయి. అదేవిధముగా శనికి బొగ్గులు , ఎండుమిర్చి , ఇనుప మేకులు , సారాయి కలిపి పారే నీటిలో విడిచిపెట్టి వెనుకకి తిరిగి చూడకుండా రమ్మని చెబుతాడు. ఇలా సులభ మార్గాలు ఎన్నో తంత్రశాస్త్రము నందు ఉన్నాయి. క్రమేణా తంత్రశాస్త్రం తెలిసినవారు అతితక్కువ మంది ఉన్నారు . ప్రస్తుతం అస్సాం లోని గౌహతి , రాజస్థాన్ లోని మౌంట్ అబు పర్వతాల ప్రాంతాలలో మిగిలి ఉంది. 


                యంత్రం గురించి చెప్పాలి అంటే ఒక బలమైన శక్తిని రాగి రేకుపై  కొన్ని గడులను లిఖించి జపాలు , హొమాలు గావించి ఆ గడుల యందు ఆ శక్తిని నిలుపుతారు. ఆ యంత్రం యొక్క బలమును బట్టి ఆ శక్తి ఆ ప్రదేశాన్ని ఆవరించుకొని ఉంటుంది. నిత్యం జరిగే పూజలు , అభిషేకాల వలన ఆ యంత్రము మరింత బలోపేతం అవుతుంది. ఈ యంత్రాన్ని స్థాపించే సమయమున జపాలు , హోమాలు చేసి ఆ శక్తిని ఆ యంత్రానికి ధారపోస్తారు. ఈ ప్రక్రియ చాలా నియమనిష్టలతో కూడుకుని సద్బ్రాహ్మణుల ఆధ్వర్యంలో జరిపిస్తారు.


                మంత్రం గురించి మీకు ఒక ఉదాహరణ చెప్తాను . ఒక గదిలో ఒక యాభైమంది వ్యక్తులు ఉన్నారనుకోండి. ఆ యాభైమందిలో ఇంటిపేరుతో సహా ఒక వ్యక్తిని మనం పిలిస్తే అతనుమాత్రమే పలుకుతాడు. అదేవిధముగా ఈ సకల చరాచర సృష్టిలో కోటానుకోట్ల అదృశ్యశక్తులు ఉంటాయి. ప్రతిశక్తికి ఒక ప్రత్యేకమైన నామం ఉంటుంది. ఆ నామాన్ని ఒక నిర్దిష్టమైన సంఖ్యలో జపిస్తున్నప్పుడు ఆ శక్తి ఉత్తేజితం అవుతుంది. ఆ నామమే "మంత్రం" . ఈ మంత్రశాస్త్రం అన్నది క్లిష్టమైనది. పూర్తిగా మనస్సును లగ్నం చేయగలిగిన వారు మాత్రమే నేర్చుకోగలరు.


            మంత్రశాస్త్రం అనగా ఒకటి కాదు. ఈ శాస్త్రంలో అనేక బేధాలు కలవు. అవి 

 పురుషవిద్య , శ్రీవిద్య , కామవిద్య, గోరవిద్య అను నాలుగు విధములు అగు ఉపాసనలు కలవు.  మంత్రశాస్త్రం నేర్చుకున్నటువంటి వ్యక్తి తన శక్తిని ధర్మసంబంధమైన కార్యాలకొరకు మాత్రమే ఉపయోగించవలెను . ధర్మవిరుద్ధములు అగు కార్యక్రమాలకు ఉపయోగించరాదు .


          మంత్రోపాసన చేయు వ్యక్తి పైన చెప్పినట్టుగా సృష్టి యందు సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్యశక్తిని ఆవాహము చేసి అనగా పిలిచి తన స్వాధీనము చేసుకుని ఆ శక్తిని బీజాక్షరాలలో ప్రవేశపెట్టి తద్వారా మంత్రసిద్ది పొందుతున్నాడు. ఈ విధానం గొప్ప యోగులకు మాత్రమే సాధ్యం . అలాగే ఎటువంటి యోగశక్తి లేనివారు కూడా ఈ మంత్రశక్తి సాధించవచ్చు. దీనికొక ఉపాయం కలదు. మంత్రసిద్ధి సాధించిన యోగి అనుగ్రహముతో అతని ఉపదేశముతో కూడా ఈ మంత్రసిద్ధిని పొందవచ్చు.  దీనిని "శక్తిపాతం" అని మంత్రశాస్త్రంలో పిలుస్తారు . కొంతమంది యోగులు తమ బొటనవేలిని రెండు కనుబొమ్మల మధ్యభాగము నందు ఉంచి కూడా శక్తిని మనశరీరము నందు ప్రసరింపచేస్తారు. ఇలా శక్తిపాతం చేయునప్పుడు సాధకునకు యోగి కొన్ని నియమాలు తప్పక పెడతారు . అవి 


 *  సాధకుడు శుచిగా , శుభ్రముగా ఉన్నప్పుడు మాత్రమే యోగి అనుగ్రహించిన మంత్రమును ఉచ్చారణ చేయవలెను .


 *  పర్వదినముల యందు ముఖ్యముగా గ్రహణ సమయముల యందు , అమావాస్య మొదలగు తిథుల యందు గురువు యొక్క ఆజ్ఞని అనుసరించి కొన్నివేల పర్యాయములు మంత్రమును జపించవలెను.


 *  సిద్ధించిన మంత్రశక్తిని పరుల ఉపయోగార్థం ఉపయోగించునప్పుడు ప్రతిఫలం ఆశించకూడదు.


 *  ఆయోగ్యులకు మంత్రం తెలుపరాదు.


 *  భూతతృప్తి కొరకై కొన్ని అర్చనలు , దానాలు , దేవతారాధనలు , సంతర్పణలు మొదలైనవి చేయించుచుండవలెను.


          పైనచెప్పిన నియమములను పాటించుచున్నంత వరకు మంత్రము చక్కగా పనిచేయును . మంత్రశక్తి ఉపదేశకుని వాక్సుద్ధిని బట్టి ఉండును. వాక్సుద్ధి అనగా చెప్పినమాట తప్పక జరిగితీరును. వారు ఆశీర్వదించినను , శపించినను తప్పక జరిగితీరును.


              చరక , శుశ్రుతాది గ్రంథముల యందు త్రివిధ చికిత్సలలో "దైవవ్యపాశ్రయ చికిత్స" ఒకటిగా వివరించబడినది.  చరకసంహిత సూత్రస్థానము నందలి పదకొండోవ అధ్యాయము నందు బలి , మంత్రాది చికిత్సలు ఉదహరింపబడినవి. శుశ్రుతము నందు గ్రహచికిత్సల యందు మరియు శస్త్రచికిత్స చేయుటకు పూర్వం కొన్ని రక్షోమంత్రాలు తెలుపబడి ఉన్నాయి. ప్రాచీనకాలం నందు మంత్రవేత్తలకు ఆయుర్వేదం పైన పట్టు ఉండేది. అదేవిధముగా ఆయుర్వేద వైద్యులు కూడా మంత్రశాస్త్రం , జ్యోతిష్యం పైన పట్టు ఉండేది. ఇప్పటి కాలములో కూడా ఆయుర్వేద వైద్యం తెలిసిన వారు , వైద్యం చేయువారు కొంత అయిన మంత్ర, జ్యోతిష్య శాస్త్రాలపై అవగాహన ఏర్పరుచుకొనవలెను. ఇలా తెలుసుకోవాలి అనుకునేవారు  భాస్కర రాయులు విరచితం అయిన లలితా సహస్రనామ భాష్యము , వరివస్యా రహస్యము , కామకళా రహస్యము వంటి గ్రంథాలు చదువుట ఉత్తమము.


 

  గమనిక  -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు  550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass  pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

కామెంట్‌లు లేవు: