🙏🙏🙏ఇచ్చాశక్తి -- జ్ఞానశక్తి -- క్రియా శక్తి వ్యాసం🙏
"ఇచ్చాశక్తి - జ్ఞానశక్తి --క్రియా శక్తి స్వరూపిణి "
అని లలితా సహస్రంలో వాగ్దేవతలు చెప్పారు..
యంత్రమనగా ఆరాధించే దేవత యొక్క శక్తి స్వరూపము.ఆ దేవతాశక్తి ఆ యంత్ర రూపంలో నిక్షిప్తమవుతుంది. మన పెద్దలు ఈ శక్తిని గుర్తించి, మూడు రకాలుగా భావించారు.అవి
1) ఇచ్ఛాశక్తి
2) జ్ఞానశక్తి
3) క్రియాశక్తి.
ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే 'ఇచ్ఛ' (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎలా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ ఆలోచనాజ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరుపుటయే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు.
. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ మూడు శక్తుల కలయికే.
ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రం లోని త్రికోణంలో మూడు బిందువులలో ఉండే దేవతలు వీరే..
మన మహర్షులు ఈ మూడు శక్తులు కలిసిన శక్తినే ‘ప్రకృతి’ అని, ‘పరాశక్తి’ అని, ‘అవ్యక్తం’, ‘శుద్ధమాయ’ అని అంటారు. అంటే యావత్తు ప్రపంచానికి (సృష్టికి) జన్మనిచ్చినది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక పరాశక్తే అని తెలుస్తున్నది. కాబట్టి ఆ పరాశక్తే ఈ జగత్తుకు మాత అని శాస్త్రాలు నిర్ణయించాయి. త్రిమూర్తులకు, దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తు లన్నింటినీ ఆ జగన్మాత అయిన పరాశక్తి, వారికి అందిస్తోంది
సదాశివశక్తుల యొక్క ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనునవి మనోవాక్కాయ కర్మములు. ఇవి పార్వతి, సరస్వతి, లక్ష్మి అను మూర్తిత్రయములు. వేరువేరుగా పిలవబడుచున్న ఏకత్వ లక్షణముల గల శక్తి మాత్రమే. ఈ మూడు శక్తి రూపములు ‘శారదా తిలకము’ నందు – ‘బిందు పుమాన్ శివః ప్రోక్తః స్వర్గః శక్తిర్నిశాకరః’ – ఏది శక్తితో కూడా యున్నదో అది సృష్టి రచనా శక్తి కలిగియున్నదని చెపుతోంది..
ప్రపంచంలో ఉన్న చైతన్యం వెనుక శక్తి నిబిడీకృతమై వుంటుంది. అంటే భౌతికమైనది మాత్రమే కాదు, మానసిక చలనం కూడా కదలికే. అందుకే చైతన్యశక్తి- ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా మూడు రకాలుగా ఉటుందని మన పురాణాలు పేర్కొన్నాయి.
ఏదైనా పని జరగాలంటే ముందు ఆ పని చేయాలనే కోరిక (ఇచ్ఛ) పుట్టాలి. అదే ఇచ్ఛాశక్తి. కోరిక కలిగాక ఆ పని ఎలా చేయాలో జ్ఞానం కలగాలి. అదే జ్ఞానశక్తి. ఇచ్ఛ, జ్ఞానం రెండూ కలిగిన తరువాత పని జరగాలి. అదే క్రియాశక్తి.
ఈ ప్రపంచం మొత్తం ఒక కుండగా భావిస్తే దీన్ని సృష్టించేది సృష్టికర్త. ఆయన ‘సృష్టి’ స్పందనను పొందాలంటే ఈ మూడు శక్తుల కలయిక తప్పనిసరి. అంటే సృష్టి మొత్తం కూడా ఈ మూడు శక్తుల విపరిణామం. మనకు కనిపించేదంతా క్రియాశక్తి రూపాంతరం. దీనివెనుక జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తులున్నాయి. ఈ మూడూ కలిసిన సంపూర్ణశక్తే పరాశక్తి. ఈ జగత్తు మొత్తానికి పరాశక్తియే తల్లి అని శాస్త్రాలు నిర్ణయించాయి. సాక్షాత్తు జన్మనిచ్చేది తల్లి. తండ్రికాదు. అందుకే శక్తిని జగన్మాతగా దర్శించారు మన మహర్షులు.
అందువల్లనే శంకరాచార్యులవారు ”శివశ్శ్యక్త్యాయుక్తోయది భవతి శక్త: ప్రభవితుం”’ అనే శ్లోకంలో ఆ శక్తిని హరిహర బ్రహ్మాదులంతా ఆరాధన చేస్తున్నారు అని చెప్పారు.
బ్రహ్మలో ఆ పరాశక్తి సృష్టిని కలిగిస్తోంది. విష్ణువులో అదే పరాశక్తి స్థితిని కలిగిస్తోంది. రుద్రుడిలో అదే పరాశక్తి సంహారాన్ని కలిగిస్తోంది. అందుకే, ఆ ముగ్గురూ కూడా ఆ శక్తిమాతనే ఆరాధిస్తున్నారు. అందుకే మనం కూడా ఆ తల్లినే ఆరాధిస్తున్నాము. అయితే, మనం శుద్ధ స్వరూపంలో శక్తిమాతను దర్శించలేము. ఊహించనైనా లేము. అందుకోసమే శక్తిమాత తన మొదటి రూపంగా శ్రీచక్రాన్ని నిర్మించింది. ఆ తర్వాత వివిధ దేవీరూపాలను స్వీకరించి మన ఉపాసనకు సౌలభ్యం కల్పించింది. శ్రీచక్రముతో సకల చరాచర జగ త్తునకు నామరూపములకు, పదార్థములకు సమన్వయం కలుగుతున్నది.
పరాశక్తికి శ్రీచక్రానికి ఏమాత్రం భేదం లేదు. శ్రీదేవియే శ్రీచక్రము. శ్రీమాత. శ్రీవిద్య. శ్రీచక్రములు వేరువేరు కాదని, ఈ మూడూ ఒకే పరబ్రహ్మ స్వరూపమని శ్రీలలితా సహస్రనామ స్తోత్రము తెలియచేస్తోంది.
శివుని త్రిశూలం మూడు శక్తులకు ప్రతీక.అల్లాగే సుబ్రహ్మణ్య స్వామి (జ్ఞాన శక్తి). భూమి మీద పుట్టిన భార్య వల్లీదేవి (ఇచ్ఛా శక్తి) మరియు అతని దైవిక( దేవతా సంబంధమైన) భార్య దేవసేన (క్రియా శక్తి)తో కలిసి జ్ఞానాన్ని (సుబ్రహ్మణ్య స్వామి ) సృష్టించడానికి ఇచ్చా మరియు క్రియల కలయికను సూచిస్తారు.ఇది సుబ్రహ్మణ్య తత్త్వముగా చెప్పబడింది.
కృష్ణుడు (జ్ఞాన శక్తి) కృష్ణుని యొక్క ప్రేమ స్వరూపిణి అయిన రాధా దేవి (ఇచ్ఛా శక్తి), మరియు ఆయన భార్య, రుక్మిణి దేవి (క్రియా శక్తి)అని కృష్ణ తత్త్వముగా చెప్పబడింది. తత్వశాస్త్రంలో, ఇడా నాడి (ఇచ్ఛా శక్తి) మరియు పింగళ నాడి (క్రియా శక్తి) సమతుల్యతలో ఉన్నప్పుడు సుష్మ నాడి (జ్ఞాన శక్తి)లోకి శక్తిని ప్రవహించటానికి అనుమతిస్తాయి
సారాంశం మళ్ళీ చెబుతున్నాను
దేవతాశక్తి యంత్ర రూపంలో నిక్షిప్తమవుతుంది. మన పెద్దలు ఈ శక్తిని గుర్తించి, మూడు రకాలుగా భావించారు.
అవి 1) ఇచ్ఛాశక్తి, 2) జ్ఞానశక్తి 3) క్రియాశక్తి. ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే ‘ఇచ్ఛ’ (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎట్లా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ, ఆలోచనాజ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరపడమే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ మూడు శక్తుల కలయిక వల్లనే
సాధ్యం.
శ్రీచక్రంలో బిందువు ఇచ్చాశక్తి, త్రికోణం జ్ఞానశక్తి
మిగిలిన చక్రాలు క్రియాశక్తి అని గ్రహించాలి.
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి