25, అక్టోబర్ 2021, సోమవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*474వ నామ మంత్రము* 25.10.2021


*ఓం యశస్విన్యై నమః*


అఖండమైన కీర్తిగలిగి భాసిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *యశస్వినీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం యశస్విన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు భక్తులు ఆ తల్లి కరుణచే వారి వారి వ్యాపారవృత్తి రంగములలో రాణిస్తూ, కీర్తిప్రతిష్టలను పొందినవారగుదురు.


అమ్మవారు సిద్ధులకు ఈశ్వరి. పంచదశి మంత్రము వంటి మంత్రములకు సిద్ధవిద్యాస్వరూపిణి. మంత్రసిద్ధిపొందిన సిద్ధులకు, సనకసనందనాదులకు తల్లివంటిదై *సిద్ధమాతా* యని అనబడుచూ గొప్ప కీర్తిని గలిగియున్నదగుటచే *యశస్వినీ* యని అనబడుచున్నది.


సహస్రారంలో ఉండే దేవతపేరు యశస్విని. అమ్మవారు యశస్వినీస్వరూపిణియగుటచే *యశస్వినీ* యను నామ ప్రసిద్ధినందినది.


భండాసురాది రాక్షససంహారంలో శక్తిసేనలను ఉపయోగించుకొని, విశేషమైన రణతంత్ర వ్యూహ ప్రతిభాపాటవములతో దేవకార్యములను చక్కబెట్టి *దేవకార్యసముద్యతా* యని యశస్సును పొందినదగుటచే, అమ్మవారు *యశస్వినీ* యని అనబడినది.


సహస్రారంలో ఉండే దేవత పేరు యశస్విని. అమ్మవారు యశస్వినీ స్వరూపిణియై *యశస్వినీ* యను నామంతో కీర్తింపబడుచున్నది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం యశస్విన్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: