14, నవంబర్ 2024, గురువారం

కల నిజమనుకోకు

 శు  భో  ద యం🙏


కల నిజమనుకోకు !


అంతామిధ్య తలంచిచూచిన, నరుండట్లౌటెరింగిన్ సదా/

కాంతల్ పుత్రులు నర్ధముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ/

భ్రాంతింజెంది చరించుఁగాని,పరమార్ధంబైన నీయందు తా/

చింతాకంతయు చింతనిల్పడుగదా!శ్రీ కాళహస్తీశ్వరా!


కాళహస్తీశ్వర శతకం-ధూర్జటి మహాకవి;


లోకంలో మనం చూచేదంతా మిధ్యే.(లేనిదిఉన్నట్లు భ్రమ)

ఏదీ శాశ్వతంకాదు.అయినా అదేమిటో మానవుడు నిరంతరం మోహ సముద్రంలో మునిగితేలుతూ, నా

భార్య,పిల్లలు,శరీరము,సంపద,ఇవన్నీ శాశ్వత మైనవని భ్రమిస్తూ ఉంటాడు.ఈమాయకు అంతంలేదుకదా!

ఇలా గుంటే ముక్తి యెలామరి? అనిదీనిభావం.

విశేషాంశములు:- కల నిజంకాదు.కన్నులుతెరిస్తే కలమాయం.జీవితం కూడా అంతే.ఎప్పుడు దీనికి తెఱపడుతుందో చెప్పలేం.అయినా బ్పతికినంతకాలం ఇదిశాళ్వతమనుకోవటం అవివేకం.భార్యా,పిల్లలు,వగైరా జీవననాటకంలోని అవాంతపాత్రలు.వారిపట్ల మమకారమే మోహం.ఆమోహ క్షయమయ్యేంతవరకూ మోక్షంరాదు.బ్రతుకంతా అదేయావా?చింతాకంతైనా భగవచ్చింతనవలదా?

అని కవి ప్రశ్న.సమాధానము చెప్పవలసినది యెవరికి వారే!!!

                             స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷☝🏻🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: