11, డిసెంబర్ 2023, సోమవారం

రంగు కాగితం

 *ఒక ముసలి ఆవిడ ప్రతి రోజు గుడి ముందు యాచిస్తూ (బిక్షం అడుగుతూ) ఉండేది .*


*ఒక రోజు, ఆ  గుడిలో నుంచి ఒక సాధువు ఆ ముసలి ఆవిడను ఇలా అడిగారు.*


 *మీరు మంచి కుటుంబానికి చెందినవారు, మీ కొడుకు చాలా మంచివాడు కదా !*

*మరి మీరు రోజు ఇక్కడ ఎందుకు నిలబడుతున్నారు ?*


*అప్పుడు ఆ ముసలావిడ ఇలా సమాధానం ఇచ్చింది.  బాబు, మీకు తెలుసు కదా ! నాకు ఉన్నది ఒకే ఒక్క కొడుకు. నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలు అయింది. నా కొడుకు 8 నెలల క్రితం ఉద్యోగం కోసం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.*

*వెళ్తూ వెళ్తూ నా ఖర్చుల కోసం కొంత డబ్బు ఇచ్చి వెళ్ళాడు .*

*ఆ డబ్బు మొత్తం నా అవసరాలకు అయిపోయింది .*

*నేను కూడా ముసలిదానిని అయిపోయాను . కష్టం చేసి డబ్బు సంపాదించలేను .*

*అందుకే గుడి ముందు ఇలా బిక్షం అడుగుతున్నాను .*


*అప్పుడు ఆ సాధువు ఇలా అడిగారు.*

*"మీ కోసం మీ కొడుకు డబ్బు పంపించడం లేదా? "* 


*ఆ ముసలావిడ ఇలా చెప్పింది. నా కొడుకు ప్రతి నెల నా కోసం ఒక రంగు కాగితం పంపిస్తాడు. నేను ఆ కాగితాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకుని నా కొడుకు జ్ఞాపకార్థం ఆ కాగితాన్ని గోడకు అంటిస్తాను.*


*సాధువు ఆమె ఇంటికి వెళ్లి చూడాలని నిర్ణయించుకుంటాడు .*


*మరుసటి రోజు సాధువు ఆమె ఇంటి లోపల వున్న గోడను చూసి ఆశ్చర్యపోతాడు .*

*ఆ గోడకు 8 చెక్ లు అతికించి వుంటాయి .*

*ఒక్కొక్క చెక్ విలువ ₹50,000 లు .*


*ఆ ముసలావిడకు చదువు రాదు .*

*అందుకే ఆమె దగ్గర ఎంత విలువైన సంపద వుందో ఆమెకు తెలియదు అని సాధువు అర్థం చేసుకొని ఆ ముసలావిడకు వాటి విలువ గురించి వివరిస్తారు .*


*ఫ్రెండ్స్, ఈ కథ మీకు విచిత్రంగా అనిపించవచ్చు .* 

*కానీ, మనం కూడా ఈ కథలో వున్న ముసలావిడ లాంటి వాళ్ళమే .*


*మనందరి దగ్గర కూడ భగవద్గీత గ్రంథం  ఉంది .*


*కాని, మనకు భగవద్గీత  ఎంత విలువైన సంపదో అర్థం అవ్వలేదు .*

*మనకు భగవద్గీత విలువ తెలిసి వుంటే మనం దానిని ప్రతి రోజు చదివి భగవద్గీత ప్రకారం జీవితం గడిపి వుండేవాళ్ళం .*


*మనం కూడా ఆ ముసలావిడ లాగానే భగవద్గీత ను అప్పుడప్పుడు ప్రేమతో ముద్దు పెట్టుకొని మన ఇంట్లో పైన అల్మారాలో భద్రంగా పెడుతున్నాం .*


*ఈ ప్రపంచం మొత్తం ఒక్క భారతదేశ ఆధ్యాత్మిక సంపదకు సెల్యూట్ చేస్తుంది. కానీ మనం మన సంసృతిని విడిచిపెట్టి విదేశీ ముసుగు బారిన పడుతున్నాం* 


*సనాతన ధర్మం భూమిపై  అవతరించిన కాలం నుండి కోట్ల మంది జీవితాలను మారుస్తున్న గ్రంథం భగవద్గీత .*


*చదవడానికి మరియు వినడానికి ఎంతో అందమైన శృతి మనోహరంగా ఉన్న గ్రంథం భగవద్గీత యథాతథం.*


*ఈ ఆధునిక సాంకేతిక కాలంలో సైంటిస్టులు కనుక్కుంటున్న ఎన్నో కొత్త కొత్త విషయాలను ఎన్నో  కోట్ల సంవత్సరాల క్రితమే తెలియజేసిన అద్భుతమైన సంపూర్ణ శాస్త్ర గ్రంథం భగవద్గీత  .*


*ఎన్నో వ్యాధులకు మందులు రామాయణ మహా భారత భగవద్గీతలలో ఉన్నాయి*


*దేవుడు లేడు అని నమ్మే ఎంతో మంది నాస్తికులను సైతం గొప్ప గొప్ప దైవ విధేయులుగా మారుస్తున్న గ్రంథం ఈ పవిత్ర భగవద్గీత యథాతథం.*


*గొప్ప గొప్ప సైంటిస్టులను సైతం హిందువులుగా (దైవ విధేయులుగా) మారుస్తున్న గ్రంథం భగవద్గీత యథాతథం .*


*ప్రపంచంలో కొన్ని కోట్లమంది హృదయాలలో కంఠస్థం చేయబడిన గ్రంథము భగవద్గీత  .*


*ఈ ప్రపంచంలో  ఎల్లప్పుడూ , అత్యధికంగా పఠించబడుతున్న  గ్రంథం భగవద్గీత యథాతథం.*


*ఇంకా ఎన్నో గొప్ప ఘనతలు కలిగివున్న గ్రంథం భగవద్గీత యథాతథం .*


*ఫ్రెండ్స్ ,*

 *డిసెంబర్ 23 గీతా జయంతి సందర్భంగా భగవద్గీతను మీరు చదవండి మీ పిల్లలతో చదివించండి మీ బందువులకు, మిత్రులకు వితరణ చేసి వారి జీవితాలను కూడా ఆనందమయం చేసుకోవడానికి మీరు సహకరించండి* 



*ఈ మెసేజ్ ని మీ ఫ్రెండ్స్ అందరికి పంపించి మన భారతదేశ హైందవ సనాతన ధర్మం గొప్పతనాన్ని అందరికి తెలియజేయండి*

కామెంట్‌లు లేవు: