కార్తీక మాసము ముగియనున్నది !
మరొక్కసారి ఆ దామోదరుని లీలలు మనసారా ధ్యానించుకుందాము !🙏🙏
🌹🌹
*భక్తికె వశమౌ నీతడు ,*
*భక్తిని పోషించి పెంచు పరమాత్ముం డే-*
*శక్తికి బందీ గాడను-*
*రక్తిగ శరణాగతులకె రాశిగనందున్ !*
🌹🙏🌹
ఈ దామోదరుడు మనకు అందెడి మార్గము ఒక్కటే భక్తి , శరణాగతి !🙏🙏
ఆ బుద్ధి మనలో కలగాలన్నా ఆతని కృపయే కారణమైయున్నది !🙏🙏
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
*( పట్టగలమా నిన్ను ?? కట్టగలమా నిన్ను ?? )*
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
( దామోదరలీలలు , 🙏విన్నా చదివినా మోక్ష సాధనకు కావలసిన అంతరార్ధము గ్రహించగలమని పెద్దలు గురువులు చెప్పియున్నారు .🙏🙏
అట్టి దామోదర లీలలు నా భావములు గా కందములలో 🙏🙏)
🌹🌹🙏🌹🌹👇
*పట్టుకునందక కృష్ణుడు ,*
*బెట్టెను గోకులమునందు , బిరబిర పరుగుల్ !*
*పట్టెద నెటులైన ననుచు ,*
*గట్టిగ మనమున యశోద , గండుగ దలచెన్ !*
🌹🌹
*పట్టుకు జిక్కని వానిన్ ,*
*బట్టితినని దల్చి తల్లి , పరవశమాయెన్ !*
*బట్టువడె తనకు తానే ,*
*పట్టుట శక్యంబుగాదు , పరమేశ్వరునిన్ !!*
🌹🌹
*పట్టిన వానినటులనే ,*
*గట్టెదనని తాడు దెచ్చె గబగబ ; వానిన్-*
*గట్టుటకున్ సాధ్య పడక ,*
*గుట్టగ దెచ్చినవి యన్ని ,కురచలె యాయెన్ !*
🌹🌹
*కట్టెదనన్న యశోదను ,*
*కట్టించుకొనగ నిలిచిన , కన్నయ నెటులన్*
*గట్టునొ ? యని కాంతామణు-*
*లట్టే గనులార్పక నదె , యరమర నుండెన్ !!*
🌹🌹
*కట్టగ వశమౌనా యీ-*
*దిట్టను ? పాశములు బట్టి ,దిరుగుచు నుండన్ ?*
*గట్టించుకొనును నతడే*
*నెట్టన పాశముగ భక్తి , నిలుపగ వలయున్ !!*
🌹🌹🙏🙏🌹🌹
( పద్యరీతి -- కందము )🙏
✍️ *---వేణుగోపాల్ యెల్లేపెద్ది*🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి