11, డిసెంబర్ 2023, సోమవారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||



)

విశ్వామిత్రుడికి వినిపించాయి. ఆకాశంలోకి దృష్టి సారించాడు. పడిపోతున్న త్రిశంకుడు కనిపించాడు.

చెయ్యి పైకెత్తి “తిష్ఠ” (ఆగు) అని అరిచాడు. అది తపస్సిద్ధుడి ఆజ్ఞ. త్రిశంకుడు ఆకాశంలో ఆగిపోయాడు.

పునశ్చుక్రోశ భూపాలో విశ్వామిత్రేతి చాపకృత్ |

పతామి రక్ష దుఃఖార్తం స్వర్గాచ్చలితమాశుగమ్ ॥

కౌశికుడు వెంటనే ఆచమించి యజ్ఞానికి కూర్చున్నాడు. వినూతనంగా మరొక స్వర్గలోకాన్ని

సృష్టించడానికి సంకల్పించాడు. అతడి ప్రయత్నాన్ని గమనించి దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు.

బ్రహ్మర్షీ! నువ్వు చేస్తున్న పని ఏమిటి? నీ కోపం ఎవరిమీద? దయచేసి ఈ ప్రయత్నం

విరమించు. ఇదిగో నేనున్నాను. నీకు ఏమి కావాలో ఆజ్ఞాపించు. వెంటనే చేస్తాను.

చేస్తావా ? అని విశ్వామిత్రుడు రెట్టించి, అయితే మర్యాదగా త్రిశంకుణ్ణి నీతో స్వర్గానికి

తీసుకువెళ్ళు అన్నాడు. దేవేంద్రుడు ఆలోచనలో పడ్డాడు. కౌశికుడి తపోబలం తెలిసినవాడు కనక సరే

అని అంగీకరించాడు. త్రిశంకుణ్ణి దివ్యదేహ దివ్యాంబర దివ్యభూషణ విరాజితుణ్ణిచేసి తన దివ్యవిమానంలో

సరసన కూర్చోబెట్టుకుని కౌశికుడి దగ్గర సెలవు తీసుకుని స్వర్గానికి తీసుకువెళ్ళాడు. విశ్వామిత్రుడి

మనస్సు శాంతించింది. తృప్తిగా నిట్టూర్చాడు.

.

ఈ విశేషాలు తెలుసుకుని హరిశ్చంద్రుడూ సంబరపడ్డాడు. ప్రసన్నచిత్తంతో రాజ్యం పరిపాలిస్తూ

రూపయౌవనచాతుర్యవంతయుక్తయైన భార్యతో క్రీడావినోదాలు అనుభవిస్తూ కాలం గడిపాడు. చాలా

ఏళ్ళు గడిచాయి. అన్నీ ఆనందదాయకంగానే ఉన్నాయి కానీ ఎంతకూ భార్యకడుపు పండలేదు. ఇదొక

పెద్ద దిగులు పట్టుకుంది. ఇక్ష్వాకువంశం తనతో అంతరించిపోతుందేమో అని బెంగపడ్డాడు. ఒక

శుభముహూర్తాన వసిష్ఠుల ఆశ్రమానికి వెళ్ళి పాదాభివందనం చేసి తన దిగులు వెల్లడించాడు

కామెంట్‌లు లేవు: