25, మార్చి 2025, మంగళవారం

పూజను ముగించే ముందు*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

 *పూజను ముగించే ముందు*       

          *క్షమాయాచన*

     *శ్లోకాలు వాటి అర్థాలు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*శ్లోకం (1)*


*మంత్రహీనం క్రియాహీనం*

*భక్తిహీనం జనార్దన |*

*యత్పూజితం మయాదేవ*

*పరిపూర్ణం తదస్తుతే ||*


*భావము:~*


*ఓ పురుషోత్తమా! ఈ పూజ మంత్రహీనము, క్రియాహీనము, భక్తిహీనము. అట్టి ఈ పూజ నీ పరిపూర్ణ అనుగ్రహముచే పరిపూర్ణమగును గాక! అనగా నేను పఠించిన మంత్రాలలో, నా పూజావిధానంలో, నా భక్తిలో లోపాలు వుండివుండవచ్చు, ఆ లోపాలను మన్నించి వాటిని పరిపూర్ణముగా వున్నట్లు భావించమని భక్తుడు భగవంతుని కోరుతున్నాడు.*


*శ్లోకం (2)*


*యదక్షర పరభ్రష్టం*

*మాత్రాహీనంతు యద్భవేత్ |*

*తత్సర్వం క్షమ్యతాం దేవ*

*నారాయణ నమోస్తుతే ||*


*భావము:~*


*నే పలికిన పలుకులలో అక్షర దోషములున్న వాటిని క్షమించమని నారాయణమూర్తికి నమస్కరిస్తున్నాను.*


*శ్లోకం (3)*


*ఆవాహనం న జానామి*

*న జానామి విసర్జనం |*

*పూజావిధిం న జానామి*

*క్షమస్వ పరమేశ్వర ||*


*భావము:~*


*పూజ చేయునపుడు ఆహ్వానించుట తెలియదు. పూజ అనంతరము ఉద్వాసన చేయుట తెలియదు. పూజ పద్దతులు తెలియవు. అందుచేత ఓ పరమేశ్వర ! క్షమించమని ప్రార్ధిస్తున్నాను.*


*శ్లోకం (4)*


*కాయేనవాచా మనసేంద్రియైర్వా,*

*బుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్ |*

*కరోమి యద్యత్ సకలం పరస్మై,*

*నారాయణాయేతి సమర్పయామి||*


*భావము:~*


*మనో వాక్కాయ కర్మలచేగాని బుద్ధీంద్రియాదులచేగాని, ప్రాకృతిక స్వభావంచేగాని, నాచే ఆచరించబడే సమస్తమైన కర్మలనూ పరాత్పరుడైన శ్రీమన్నారాయణమూర్తికి సమర్పిస్తున్నాను.*


*శ్లోకం (5)*


*అన్యథా శరణం నాస్తి*

*త్వమేవ శరణం మమ।*

*తస్మాత్ కారుణ్యభావేన*

*క్షమస్వ పరమేశ్వర.॥*


*భావము:~*


*ఓ శివ శంభు, భ్రాంతికరమైన సంసారం నుండి నన్ను రక్షించడానికి నీవు తప్ప మరెవరూ లేరు, నీవు దయా సాగరమని తెలుసు కాబట్టి నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను.*


🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

కామెంట్‌లు లేవు: