🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*శ్రీ ఆదిశంకరాచార్య విరచితం*
*శివానందలహరి – శ్లోకం – 64 *
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*వక్షస్తాడనమన్తకస్య కఠినాపస్మారసంమర్దనం*
*భూభృత్పర్యటనం నమస్సురశిరఃకోటీరసంఘర్షణమ్ ।*
*కర్మేదం మృదులస్య తావకపదద్వన్ద్వస్య గౌరీపతే*
*మచ్చేతోమణిపాదుకావిహరణం శంభో సదాఙ్గీకురు ॥64॥*
గతశ్లోకములలో భక్తి అనగా మనస్సు శివపాదపద్మములను వదలక పట్టుకొనుట అన్న శంకరులు, ఆ పాదపద్మములు తన మనస్సులో ఉంచమని శంభుని కోరుకుంటున్నారు.
పార్వతీవల్లభా! యమునిఱొమ్ము తన్నవలెను. అతికఠోర అపస్మార అసురుని అణగదొక్కవలెను. కొండమీద తిరుగవలెను. నీకు నమస్కరించుచున్న దేవతల కిరీటముల రాపిడి ఓర్చుకోవలెను. నీ పాదములు అతి కోమలములు (అవి ఈ కఠినకార్యములు ఎలా చెయ్యగలవు ? ). శంభో! ఎల్లప్పుడూ నా చిత్తమనే మణిపాదుకలను నీపాదములకు తొడిగికొని విహరించుటకు అంగీకరింపుము.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్రీ ధర్మశాస్త సేవాసమితి 🐆 విజయవాడ 🏹 7799797799
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి