25, మార్చి 2025, మంగళవారం

ఫాల్గున కృష్ణ ఏకాదశీ -

 *_𝕝𝕝 ॐ 𝕝𝕝 25/03/2025 - ఫాల్గున కృష్ణ ఏకాదశీ - పాపవిమోచని ఏకాదశీ 𝕝𝕝 卐 𝕝𝕝_*

*≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈*


ఫాల్గున బహుళ ఏకాదశిని “పాప విమోచని ఏకాదశి” లేక “సౌమ్య ఏకాదశి” అని అంటారు.


పాపవిమోచని ఏకాదశి అంటే పాపాలను తొలగించే ఏకాదశి అని అర్ధం. దీని వెనక ఒక కథ ఉంది. అదేమిటంటే…


కుబేరునికి చైత్ర రథమనే పేరుగల ఒక వనం ఉండేది. ఆ వనంలో గంధర్వ కన్యలు, కిన్నరులతో విహరించేవాడు. అక్కడ ఎల్లప్పుడూ వసంత ఋతువు నిలయంగా ఉండేది. ఆ వనంలో రక రకాల పుష్పాలు పుష్పించి మనోహరంగా కనిపిస్తూ ఉండేవి. ఋషీశ్వరులు తపస్సు చేస్తూ ఉండేవారు. ఇంద్రుడు కూడా స్వయంగా చైత్ర, వైశాఖ మాసాల్లో దేవతా సమూహంతో కలిసి ఈ వనంలోకి విచ్చేసి క్రీడిస్తూ ఉండేవారు. ఆ వనం ఇంద్రునికి క్రీడాస్థలంగా ఉండేది. 


అక్కడికి దగ్గరలో చ్యవన మహర్షి పుత్రుడు మేధావి అనే పేరుగల ఒక ఋషీశ్వరుడు తపస్సులో లీనమై ఉన్నాడు. ఇంద్రుడి ఆదేశిస్తే మంజుఘోష అనే అప్సరస తన నాట్యంతో ఈయనకు విఘ్నం కలిగించిందంట. 


మంజుఘోష తన తపస్సుకి విఘ్నం కలిగించిందన్న ఆగ్రహంతో ఆమెకు రాక్షస రూపం కలుగు గాక అని మేధావి శపించారట. ఆమె రాక్షసి అయిపోయిందట. ఆయన తిరిగి తపస్సులో మునిగి పోయాడట. ఆమె ఆయనకోసం ఎదురుచూస్తూ కూర్చుందట. ఆయన తపస్సు పూర్తయ్యాక ఆమె ప్రార్ధిస్తే మేధావి అనుగ్రహించి ఫాల్గున మాసంలో కృష్ణ పక్షంలో ఏకాదశి తిధినాడు ఉపవాసం చేసి శ్రీమన్నారాయణమూర్తిని అర్చిస్తే రాక్షసరూపం పోయి తిరిగి నీ అప్సరస రూపం పొందుతావు అని శాపాంతాన్ని అనుగ్రహించారట.


మంజుఘోష ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించి తన పూర్వ రూపాన్ని పొందిందిట. కనక చేసిన పాపాలు ఏవైనా వుంటే వాటిని తొలగించే ఏకాదశిని పాపవిమోచని ఏకాదశి అని అన్నారు. పాపమను అంకుశమువలె మన మనస్సును నియంత్రిచేది కనక పాపాంకుశ ఏకాదశి అనేది ఏర్పడింది. ఈ రోజు ఏకాదశి వ్రతం పాటిస్తే తప్పక ఫలితం లభిస్తుంది అని పెద్దలు అంటారు.


*_𝕝𝕝 ॐ 𝕝𝕝 జై శ్రీమన్నారాయణ 𝕝𝕝 卐 𝕝𝕝_*


*_𝕝𝕝 ॐ 𝕝𝕝 శ్రీమన్నారాయణాయ చరణౌ శరణం ప్రపద్యే 𝕝𝕝 卐 𝕝𝕝_*


*_𝕝𝕝 లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 𝕝𝕝_*


🚩 *_శుభమస్తు_* 🚩

కామెంట్‌లు లేవు: