కౌపీనము —— ప్రాశస్థ్యం KOWPEENAMU___PRASHASTYAM.
____________________________
“కౌపీనధారీ ఖలు భాగ్యవంతా’ .
____________________________
కౌపీనధారులు అనగా యుగయుగాలలో అనాదిగా ఋషి సంప్రదాయంలో వస్తున్న సదాచారము. యోగులు , మునులు, ఋషులు, తపస్సులు, యతులు, ఉపద్రష్టులు, లాంటి మహానుభావులంతా ఈ కౌపీనము యొక్క విశిష్టత తెలుసుకొని. జపతపాదులు ఆచరించేవారు.
ఆ ఋషి సంప్రదాయంలో వస్తున్న మనం ఆ కౌపీనము యెక్క విలువను తెలుసుకొని నడుచుకోవాలి.
ఈ కౌపీనాదారుల యొక్క భావము సదా వేదాంత విషయములనే స్మరించుచు , బిక్షాటనతో వచ్చినదానితో తృప్తి చెంది , శోకము లేని అంతకరణచే , చెట్టు నీడనే ఆశ్రయించుకొని , రెండు చేతులనే భోజనపాత్ర గా చేసుకొని, ధనధాన్యాదుల యెడల విముఖత చూపిస్తు, జితేంద్రియులై ఆత్మానందమును పొంది, అహర్నిశములు బ్రహ్మానందమును పొందుతూ, ఈ స్థూల దేహాత్మ భావమును తొలగించుకొని బయట లోపల, సర్వాంతర్యామి అయిన ఆ పరాత్పరున్ని వీక్షించుచూ, పవిత్రమైన ఓంకారమును సదా స్మరించుచు, (ఓం క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం ..) సదా గతాగతిలో వుండి, అహం బ్రహ్మాస్మీ యై ఆ సదాశివుణ్ణి స్మరించుచు నలుదిశలు తిరిగి , ఆ పరాత్పరునియొక్క లీలలు చవిచూస్తూ లోక కళ్యాణార్థమయి కృషిచేసేవారు.
అలాంటి విలువైన కౌపీనధారులు మీరు , జప తపాదులలో సరియైన పద్దతులలో జపాలు చేస్తూ కౌపీనమునకు వున్న విలువను కాపాడాలని కోరుకుంటున్నాము.
ఇది తన ఆకారానికి సరిపడు గుడ్డను తీసుకొని నీకు ఉపదేశం ఇచ్చు సందర్భములో చెప్పబడిన తీరుగా ధరించి జపమాచరించాలి.అంతేకాకుండా, scientifical గా జపసంధర్భము గా ఉష్ణము అధికముగా ఉత్పత్తి అయ్యి, ఆ ఊష్ణమే విధ్యుత్తు గా మారి మన శరీరములోని వీర్యకణాలను భస్మముచేసి ఓజస్సు గాను, ఆ ఓజస్సును తేజస్సుగాను మార్చడానికి ఉపయోగ పడుతుంది. ఈ మహాత్తరమైన ప్రక్రియ కౌపీన ధారణ ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది .
కౌపీనము నడుముకు చుట్టి ఎడమ తొడసంధి (mid ingunal point) వద్ధ ” బ్రహ్మముడి ” వెయ్యాలి. ఈ ముడి సరిగ్గా టెస్టిస్( testis) లో నుంచి వీర్యము పెన్నీసుకు వెళ్ళే నాళము మీద వచ్చేటట్టుగా వెయ్యాలి . జపములో పుట్టిన ఉష్ణము వల్ల వీర్యము బొట్టు బొట్టు గా నాళ్ళము ద్వారా వెల్లుచు అది భస్మము చేయబడుతుంది. ఈ విధముగా కట్టడములో హెర్నియా వ్యాధిని కూడా అరికట్టవచ్చు. రెండవ గుడ్డను బిగుతుగా వెనుకకు తీసుకొనవలెను. దీనినే కౌపీనము , బ్రహ్మముడి అందురు.
వేదాన్త వాక్యేషు సదా రమన్తో
బిక్షాన్న మాత్రేన చ తుష్ఠిమన్త :
అశోక మన్త: కరణే చరన్త :
కౌపీన వన్త ఖలు భాగ్యవన్త :
భావము : సదా వేదాంత వాక్యములను స్మరించుచు , బిక్షాటన వలన లభించినదానితో. తృప్తి చెందేవారు, శోకము లేని అంత: కరణముతో చరించే కోపీనాధారులు (అదృష్టవంతులు) చాలా భాగ్యవంతులు.
మూలం తరో కేవల మాశ్రయన్త:
ఫాణిద్వయం భోక్తు మమన్త్ర యన్త:
కన్థామినా శ్రీ మపి కుత్సయన్త:
కౌపీనవన్త ఖలు భాగ్యవన్త:
భావము : చెట్టునీడయే ఆశ్రయంగా చేసుకో్ని, రెండు చేతులను భోజన పాత్రగా చేసుకో్ని ఐశ్వర్యమనిన విముఖతతో ఉండే కౌపీనధారులు చాలా భాగ్యవంతులు.
స్వానన్ధ భావే పరితుష్ఠమన్త:
సుశాన్త సర్వేన్ధ్రియ వ్రుత్తిమన్త:
అహర్నిశం బ్రహ్మసుఖే రమన్త:
కౌపీనవన్త ఖలు భాగ్యవన్త :
భావము : ఆత్మానందం పొందిన పరితృప్తులు, జితేంద్రియులు, అహర్నిశము బ్రహ్మానందమున క్రీడించే కౌపీనధారులు చాల భాగ్యవంతులు.
దే హాది భావం పరివర్తయన్త :
స్వాత్మాన మాత్మ న్యవలోకయన్త:
నాన్తం న మద్యం న బహి: స్మరన్త :
కౌపీనవన్త ఖలు భాగ్యవన్త:
భావము : దేహాత్మ భావము తొలగించువారు, ఆత్మను వీక్షించు వారు, బయట, లోపల, మధ్య గల వస్తువుల ధ్యాస లేని కౌపీనాదారులు చాలా భాగ్యవంతులు.
బ్రహ్మక్షరం పావన ముచ్చరన్తో
బ్రహా హం స్మీతి విభావ యన్త:
(పంచాక్షరం పావన ముచ్చరన్తో పతిం పశూనాం వ్రుది భావయన్త:)
భీక్షాశినో దిక్షు పరిభ్ర మన్త:
కౌపీన వన్త ఖలు భాగ్యవన్త:
భావము: పవిత్రమైన ఒంకార శబ్దమును ఉచ్చరించేవారు , అహం బ్రహ్మాస్మీ , అని భోదించువారు, పశుపతి నాధుణ్ణి సదా శివుణ్ణి ధ్యాన్నించేవారు, బిక్షాన్నము తినుచు నలు దిశలు చరించే కౌపీనాధరులు అగు యతులే చాలా భాగ్యవంతులు.
ఇప్పుడు మీరు కౌపీనము విలువలు ఎంతో ఉత్త మమైనవని తెలిసి ఉంటుంది ఇది జప తీవ్రతతో అంతర్ముఖుడైనప్పుడు బ్రహ్మ ముడిని విప్పినప్పుడు అతని మనసు స్థూలనికి రాగలదని మన ఆశ్రమ గురువులు తెలిపినారు.
NOTE: ఈ విషయములన్ని ఆశ్రమ సాహిత్యములోను , మీ అనుభవాలలో మీ అందరికి తెలుసు . మాకు తెలిసినంత వరకు తెలుపుతున్నాము. ఇందులో ఏమైన పొరపాట్లు వున్నచో తెలుపుతారని మనవి చేయుచున్నాము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి