🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸
*శ్రీ రామచన్ద పరబ్రహ్మణే నమః*
*సీతారామాంజనేయ సంవాదము.*
*ప్రథమాధ్యాయము*
*భాగము - 9*
క.దివ్యము భవ్య మ్మగు మ
త్కావ్యము సంతతము మోక్షకాములచే శ్రో. తవ్యము వక్తవ్యము మం తవ్యము భావ్యమును గీర్తితవ్యముఁ గాదే.
తాత్పర్యము.
జగత్కల్యాణ కాంక్షతో రచియింపదలబెట్టిన
నా కావ్యం వినేవారికి వీనులవిందు, ఆనందమూర్తులకు ఆనందం,
భక్తజనులకు ఆ పరమాత్మ దివ్యానుగ్రహము, సర్వ శుభములు చేకూర్చ "నా" పరబ్రహ్మను ప్రార్థిస్తున్నాను.
శా. సత్తామాత్రుఁడు నిర్వి శేషుఁడు తమా; సర్వేంద్రియప్రాణహృ చిత్తాహంకృతిధీ ప్రకావకుఁడు స; చ్చిత్తోషకాయుండు ని ద్వత్తాపాంధతమః ప్రదీపమయుఁ డా; త్మస్వామి భాసిల్లె శ్రీ దత్తాత్రేయ గురుం డనంగజగదం; తర్యామియై మున్నిలన్.
తాత్పర్యము.
దత్తాత్రేయాదేశికానాం ప్రధమం పరికీర్తితః" అన్న వచనం ప్రకారం, శ్రీ దత్తులు గురువులకే గురువు విశ్వగురువు, లోక గురువు వారి కరుణను సదా నేను కోరుతున్నాను.
అలాగే "నిత్య, సత్య, శాశ్వతుడు, సదానందుడు, చిదానందుడు లోక కల్యాణ కారకుడు, భక్తానుగ్రహాభీష్టుడు,
తలచిన వారిని తలచిన క్షణమును కరుణించు కామ్యక ప్రదాత, సర్వగామి లోక రక్షణకై వెలసిన ఆ "అత్ర్యనసూయ పుత్రుడు - దత్తుడు, భక్తాభీష్టము లెల్ల నెరవేర్చుగాక!
*సేకరణ : సకల దేవత సమాచారం గ్రూపు.*
🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి