11, అక్టోబర్ 2020, ఆదివారం

బ్రతకాలి

 నీకు నచ్చినట్లు *బ్రతకాలి* అంటే *ధైర్యం* కావాలి , 

ఎదుటి వారికి నచ్చినట్లు బ్రతకాలి అంటే 

*సర్దుకు* పోవాలి , అందరికి మీరు నచ్చాలి అంటే 

*నవ్వుతూ బ్రతకాలి*.


       మన చుట్టూ *మంచి చెడు కష్టం నష్టం ప్రేమ ద్వేషం* అన్నీ ఉంటాయి దేన్ని *వదిలేస్తాం* దేన్ని తీసుకుంటాం అన్న దాన్ని బట్టే మన *సంతోషం* ఆధారపడి ఉంటుంది .


     మనం ఒక మనిషిని *వందేళ్లు* గుర్తుంచుకోవడానికి వందేళ్లు మనం *బ్రతకాల్సిన* అవసరం లేదు 

ఒక్క *మంచి పని* చేస్తే చాలు. 


    మనం ఇతరుల్ని *నమ్మడం* చాలా *సులువు* నిన్ను నువ్వు నమ్ముకోవడమే

 *కొంచేం కష్టం* ఒక్కసారి నిన్ను నువ్వు నమ్మడం ప్రారంభించావా 

ఇక *నీకు ఎదురే* ఉండదు .


     *ఆపదకు* సంపద నచ్చదు 

*సంపదకు* బంధం నచ్చదు 

*బంధానికి* బాధ నచ్చదు *బాధకు* బ్రతుకు నచ్చదు *బ్రతుకుకు* చావు నచ్చదు        

 *చావుకు* పుట్టుక నచ్చదు 

*కానీ !* అన్ని అనుభవించాలి.

 *మన తల రాత* తప్పుకోనివ్వదు అంతమయ్యే దాకా అంతే.... *అనుభవించాల్సిందే*

కామెంట్‌లు లేవు: