11, అక్టోబర్ 2020, ఆదివారం

మూకపంచశతి

  *ఆర్యాశతకము*🌷

మూకపంచశతి

🌹20.

శ్లోకం


శ్వేతా మన్థరహసితే


శాతా మధ్యేచ వాఙ్మనో౽తీతా౹


శీతా లోచనపాతేస్ఫీతా


కుచసీమ్ని శాశ్వతీమాతా౹౹


🌺భావం:


  స్వచ్ఛమైన తెల్లనిమందహాసము ,చల్లని కరుణా కటాక్షము,సన్నని నడుము ,ఉన్నతమైన వక్షఃస్ధలముతో కాంచీక్షేత్రమున కొలువు తీరిన ఆ కామాక్షీమాత వాఙ్మనోతీతమైనది. వాక్కు తో వర్ణించుటకు గాని మనస్సులో ఊహించుటకు గానీ శక్యము గాని చైతన్య స్వరూపము .ఆమెనిత్య ,శాశ్వతురాలుఅయి ఉన్నది.ప్రళయకాలమున కూడా సాక్షిగా ఉండు మహాప్రళయసాక్షిణి ఆ పరాత్పరియే !🙏


     🌼 ఆ తల్లి అనుగ్రహమునకై ప్రార్ధించుచున్నాను.


🔱 అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ. 🔱


   🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹


సశేషం....


🙏🙏🙏 


ధర్మము-సంస్కృతి

కామెంట్‌లు లేవు: