ఆదిపర్వము – 46
సుభద్రార్జునుల వివాహం
అలా అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ఒకరోజు ద్వారకకు పయనమయ్యాడు.
అర్జునుడు ద్వారకు పోతూనే సుభద్ర గుర్తుకు వచ్చింది. ఆ లోకోత్తర సుందరి అని విన్నాడు. శ్రీ కృష్ణుని దయ ఉంటే సుభద్రను వివాహం చేసుకోవచ్చు అని అర్జునుడు అనుకున్నాడు. యాదవులకు సన్యాసులంటే ప్రీతి కనుక సన్యాసి వేషంలో ద్వారకకు వెళ్ళాడు. ద్వారకను సమీపించగానే శ్రీ కృష్ణునిని భక్తితో తలచుకున్నాడు. శ్రీ కృష్ణుడు అర్జునుని ఆగమనాన్ని తెలుసుకుని అర్జునిని వద్దకు వచ్చాడు. అర్జునిని మాటలలో అతనికి సుభద్ర మీద మనసున్నదని గ్రహించాడు. అర్జునిని ద్వారకకు తీసుకు వచ్చి రైవతకాద్రి గుహలో ఉంచాడు. ద్వారకకు వెళ్ళి యాదవులకు రైవతకోత్సవం చేయాలని ఆదేశించాడు. అందరూ రైవతకాద్రికి బయలు దేరారు. శ్రీ కృష్ణుడు భార్యలతోనూ సుభద్రతోనూ యాదవ ప్రముఖులైన అకృరుడు, ఉద్దవుడు, సాత్యకి, ఉగ్రసేనుడు మొదలైన వారు బయలుదేరారు. సుభద్రకు కూడా అర్జునిని మీద మనసు ఉంది. అర్జునుడు ఎలా ఉంటాడో సుభద్రకు తెలియదు. రైవతకాద్రికి ప్రదక్షిణం చేసే సమయంలో అర్జునుడు సుభద్రను చూసాడు. శ్రీకృష్ణుడు అర్జునినితో ” అర్జునా ! నీకు నా చెల్లెలు సుభద్ర మీద మనసుందని తెలుసు. దేవకీ వసుదేవులకు చెప్పి నీ కోరిక సఫలం చేస్తాను. బలరాముడు అర్జునిని నిజమైన
సన్యాసి అనుకుని నమస్కరించి అతని చాతుర్మాస వ్రతం పూత్రి అయ్యేవరకు ద్వారకలో ఉండమని చెప్పాడు. అర్జునుడు అంగీకరించాడు. బలరాముడు సుభద్రను అర్జునినికి సేవలు చేయడానికి నియమించాడు. శ్రీ కృష్ణుడు అర్జునుడు క్షేమంగా ఉన్నాడని ఇంద్ర ప్రస్థానికి సమాచారం పంపాడు. ఒక రోజు సుభద్ర అర్జునిని గురించి చెప్పమని అడిగింది. అర్జునుడు ఇక దాచి ప్రయోజనం లేదని అసలు విషయం చెప్పాడు. అర్జునుడు గాంధర్వ వివాహం చేసుకుంటానని అన్నాడు. సుభద్ర తన వాళ్ళకు ఈ వివాహం ఇష్టం కనుక వాళ్ళే ఈ వివాహం చేస్తారని చెప్పింది. శ్రీ కృష్ణుడు దేవకీ వసుదేవులను వివాహానికి ఒప్పించాడు. బలరాముని కొంత మంది యాదవులను అంతర ద్వీపానికి పంపించి తాను కూడా వారితో వెళ్ళి నట్లు వెళ్ళి వెనుకకు వచ్చాడు. శ్రీ కృష్ణుడు దేవేంద్రుని పిలిపించి అందరి సమక్షంలో సుభద్ర, అర్జునుల వివాహం వైభవంగా జరిపించాడు.
సుభద్రను తీసుకుని రథం మీద ప్రస్థానికి వెళ్ళమని చెప్పాడు. దేవేంద్రుడు కుమారునికి అనేక కానుకలు ఇచ్చాడు. శ్రీ కృష్ణుడు ఏమీ తెలియనట్లు అంతర ద్వీపానికి వెళ్ళాడు. సుభద్రా అర్జునుల వివాహ విషయం తెలియని ద్వార పాలకులు వారిని అడ్డగించారు. అర్జునుడు వారందరిని ఓడించాడు. యాదవులు బలరామునికి ఈ విషయం చెప్పారు. యాదవులు ఉద్రేకపడి అర్జునినితో యుద్ధం చేసి సుభద్రను తీసుకు వస్తామని అన్నారు. బలరాముడు శ్రీ కృష్ణునితో నీకు నిజంగా ఈ విషయం తెలియదా అన్నాడు. శ్రీ కృష్ణుడు తన మేన మరదలిని వివాహం చేసుకున్నాడు.
ఇందులో దోషం లేదు. అర్జునిని జయించడం దుస్సాధ్యమని మీకు తెలియనిదా అన్నాడు. బలరాముడు ఏమీ చేయలేక ఊరకున్నాడు. ఇంద్ర ప్రస్థానం వెళ్ళిన అర్జునుడు సుభద్రతో మనం ఇలా వెళితే ద్రౌపది పౌరుషంగా మాట్లాడ వచ్చు కనుక నీవు ముందుగా వెళ్ళి నీ అత్త గారు కుంతినీ ద్రౌపదిని చూసి వారి అనుగ్రహం సంపాదించు. తరువాత అర్జునుడు నగర ప్రవేశం చేసి పెద్దల దీవెనలు పొందాడు. బలరాముడు సుభద్ర, అర్జునలకు అనేక కానుకలు పంపాడు. సుభద్రకు అభిమన్యుడు జన్మించాడు. ద్రౌపదికి పాండవుల వలన ప్రతి వింధ్య్డుడు, శ్రుత సోముడు, శ్రుత కీర్తి, శతా నీకుడు, శ్రుత సేనుడు అను ఐదుగురు ఉప పాండవులు జన్మించారు. వారంతా ధౌమ్యుని వద్ద వేద వేదాంగాలు అర్జునిని వద్ద అస్త్ర, శస్త్రాలు నేర్చుకున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి