సౌందర్య లహరి శ్లోకము - 20
(శ్రీ శంకర భగవత్పాద విరచితము)
(శ్రీ లలితాంబికాయైనమః)
కిరన్తీమఙ్గేభ్యః కిరణ నికురుమ్బా మృతరసం
హృది త్వామాధత్తే హిమకర శిలామూర్తిమివయః,
స సర్పాణాం దర్పం శమయతి శకున్తాధిప ఇవ
జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార సిరయా !!
తల్లీ ! సర్వావయవాల నుంచి ప్రసరించే కిరణ సమూహం నుంచి జనించిన అమృత రసాన్ని
వర్షిస్తూన్న నిన్ను ఏ సాధకుడు చంద్ర కాంతమణి నిర్మిత దేహం గల ప్రతిమ మాదిరి హృదయం లో ప్రతిష్ఠించి ధ్యానిస్తూన్నాడో అతడు గరుత్మంతుడిలా సర్పాల దర్పాన్ని శమింప జేస్తున్నాడు. జ్వర తీవ్ర త చేత ఎంతో తాపంచెందే రోగులను అమృత
నాడియైన తన చల్లని చూపుచేత జ్వర బాధను తొలగించి సుఖాన్ని హాయిని కలిగిస్తున్నాడు.
.
ఓం మహామాయాయైనమః
ఓం మంత్రారాధ్యాయైనమః
ఓం మహాబలాయైనమః
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి