11, అక్టోబర్ 2020, ఆదివారం

గురుశుశ్రూషయా

 సేకరణ 👇


గురుశుశ్రూషయా విద్యా పుష్కలేన ధనేన వా !

అథవా విద్యయా విద్యా చతుర్థీ నోపలభ్యతే !!


తా!!: గురువులకు సేవచేయడం (శుశ్రూష) ద్వారా లభించేది, పుష్కలంగా ధనం ఖర్చుపెట్టడం ద్వారా సంపాదించేది, ఒక విద్యనిచ్చి మరో విద్య నేర్చుకోవడం ద్వారా పొందేదని జ్ఞానాన్ని ఆర్జించే మార్గాలు, పద్ధతులు మూడు. అలా కాకుండా విద్యను సంపాదించగల నాలుగవ ఉపాయం లేదు.


వ్యాఖ్య: "జ్ఞానార్జనకు వినయం, సమర్పణం, వినిమయం" అనే మూడు మార్గాలు మాత్రమే. పూర్వం రాజులైన గురుకులంలోచేరి గురువుకు సేవలుచేసి విద్యను నేర్చుకునేవారు. ఆరోజుల్లో గురువులంటే అంత భక్తి. గురుదక్షిణ కూడా ఇచ్చేవారు. రెండవది ధనాన్ని సమర్పించి, విద్య నేర్చుకోవడం. ఈరోజుల్లో విద్య స్కూల్ ఫీజు, కాలేజీ ఫీజు విద్యార్థులు చెల్లించి చదువుకోవడం. ఒకప్పుడు (50 సం!!ల క్రితం) అందరూ చాలా తక్కువ ఫీజులతో వీధి బడులలో చదువుకొని - ఆసక్తి ఉన్నవారు, తెలివైనవారు ఉన్నత స్థాయికి వెళ్లేవారు. కొందరు కష్టపడి పైకివచ్చేవారు. నేడు చదువుకునే వారితోపాటు చదువు కొనుక్కునేవారు పెరిగి, విద్య అతిపెద్ద వ్యాపారంగా మారింది. చదువు కొనుక్కుని బయటకువచ్చి, హాస్పిటల్స్, విద్యాసంస్థలు లాంటివి పెట్టడంవల్ల, సేవా దృక్పధంపోయి పూర్తిగా వ్యాపారసంస్థలుగ పనిచేస్తూ ప్రజలనుండి అధిక సొమ్ము వసూలు చేయడమేకాక వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. మూడవది 'వినిమయమార్గం' పంచుకుని నేర్చుకునే పద్ధతి. విద్యా, వైజ్ఞానిక సమావేశాలలో పాల్గొని వారి వారి అనుభవాలను నిజాయితీగా 'వినిమయం' చేసుకునే విధానం. పరస్పర భావ వినిమయం పద్ధతి ద్వారా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం.

కామెంట్‌లు లేవు: