11, అక్టోబర్ 2020, ఆదివారం

బయటికి వెళ్లి పోవాలి.

 మన శరీరంలోకి వెళ్లిన ఆహారం 24 గంటల్లో మలినంగా బయటికి వెళ్లి పోవాలి. 

లేకపోతే జబ్బులు.


మన శరీరంలోకి వెళ్ళిన నీరు 4 గంటల్లో బయటికి వెళ్లి పోవాలి. లేకపోతే జబ్బులు. 


మన శరీరంలోకి వెళ్లిన గాలి ఒక నిముషంలోగా బయటికి వెళ్లిపోవాలి. లేకపోతే మనం రోగ గ్రస్థులం అవుతాం.


మరి మనలోకి చేరిన కోపం, అసూయ, ద్వేషం, మోసం ఇలాంటి వన్నీ సంవత్సరాలుగా మనలోనే ఉంటే... 

ఏమౌతుందో తెలుసా... మనం నిత్య రోగ గ్రస్తులుగా అవుతాం.


కామాశ్చ, క్రోధశ్చ, లోబశ్చ దేహే తిష్ఠంతి తస్కరా:

జ్ఞాన రత్నప హారాయ తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త.

(కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, అనే ఆరుగురు శత్రువులు ఈ జ్ఞానమనే రత్నమును అపహరించడం కోసం నీ దేహమునే తిష్ట వేసి ఉన్నారు. జాగరూకుడవై ఉండు.)


*అందుకే ఋషులు అంటారు...* 

మనం రోజూ జీవిస్తున్నాం అని అనుకుంటున్న మూర్ఖులం... 

నిజానికి మనం రోజూ కొద్ది కొద్దిగా మరణిస్తున్నాం. 

మనకు వయసు పెరిగితే... ఆయుష్షు తగ్గినట్టా ? పెరిగినట్టా ? మనం ప్రతి రోజూ... నెగెటివ్ ఎనర్జీ లతో కొద్ది కొద్దిగా మరణిస్తున్నామన్న చేదు నిజాన్ని త్వరగా గ్రహించాలి.


మనలో చేరి బయటికి వెళ్లి పోకుండా తిష్ట వేసుకొని...  మన జీవితాల్ని మృత ప్రాయం చేస్తున్న కోపాన్ని, ఒత్తిడిని, ద్వేషాన్ని, బద్ధకాన్ని, అనారోగ్యాన్ని… ప్రతి రోజూ ధ్యానం, యోగ చెయ్యడం ద్వారా ప్రాణ శక్తిని ఎక్కువగా పొంది నెగెటివ్ ఎనర్జీ దూరం చెయ్యాలి.  

మన శరీరంలోకి అధిక మొత్తంలో ప్రాణ శక్తిని చేర్చే ఏకైక మార్గం  ధ్యానం, యోగాయే...


అందుకే భారతీయ ఋషులు ధ్యానం, యోగ మార్గాన్నే అనుసరించారు. రోజూ ధ్యానం, యోగ చెయ్యండి... 

ఆరోగ్యంగా జీవించండి.🙏🙏🙏


సేకరణ:: కందుకూరి చిన్న, పాణ్యం

కామెంట్‌లు లేవు: