*మృత్యు భయం ఎవరికి ఉండదు ...???*
మనిషి అన్నింటిని ఒప్పుకొంటాడు, కానీ ఒక్క మృత్యువు అంటే భయపడతాడు,
నేను దేనికి ఒరవను, భయపడను అన్న వాడు కూడా మృత్యువు అంటే ఆమడ దూరం పరుగెడతాడు...
మరి ఎవరికి ఈ మృత్యువు అంటే భయముండదు???, పురాణాలను చదివిన వారికా, పూజలు సల్పే వారికా, సేవలు చేసే వారికా, భజనలు నిర్వహించే వారికా???,
_*ఒకసారి రామావతార సంఘటన చూద్దాం*_
శ్రీ రామ పట్టాభిషేకం సందర్భంగా, అయోధ్యా నగర మంతయూ, వివిధ అలంకరణ లతో, అశేష జన సందోహంతో కళకళలాడింది. ...
'మనువు' ధరించి న కిరీటం ధరించడం, సూర్యవంశ పురాజుల సాంప్రదాయం.
ఆ సాంప్రదాయ మును ననుసరించి, వశిష్ఠుడు, వామదేవుడు,జాబాలి ముగ్గురూ కూడి రాముని శిరస్సుపై ఆ కిరీటమునుంచారు...
అనేకమంది రాజులు, రారాజు లు, సామంతులును, ఋషులు, ఈ మహోత్సవంలో పాల్గొన్నారు.
సింహ ద్వారము వద్ద, పెద్ద పెద్ద అక్షరాలతో,
*" సత్యధర్మాభియుక్తానాం నాస్తిమృత్యుభయం"* అని వ్రాయబడిన బోర్డు కనిపించింది.
_అనగా .... సత్యధర్మాలతో జీవితం గడిపే వారికి, మృత్యు భయం లేదని అర్ధము...._
_ఎందుకంటే - సత్యధర్మాలను పాటించే వారికి మరే జన్మ ఉండదు. *జన్మించారు అంటేనే కదా, మరణముండేది!*_
*_🌸శుభమస్తు🌸_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి