2, జూన్ 2021, బుధవారం

శ్రీమద్భాగవతము

 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻 6.కాలసూత్రము: ఎర్రగా కాలునట్లు వేడెక్కిన ప్రదేశమునందు పరుగెత్తించుట. అనగా దుష్కర్మ వశమున ఎండలో తిరుగవలసి వచ్చుట; కాళ్ళు తల దేహము మండిపోవుచున్నట్లు అనిపించు వ్యాధులు. 


7.అసి పత్ర వనము: కత్తులే ఆకులుగా గల చెట్ల అడవి. దేహమునందు కత్తులతో పొడిచినట్లు నొప్పులు. 


8.సూకర ముఖము: అడవి పంది ముఖమని అర్థము. భయంకరమైన చిత్త భ్రమలు మున్నగు వ్యాధులతో కూడి ఉండును. 


9.అంధకూపము: చీకటి బావిలో పడత్రోయుట. అనగా పరిస్థితులు దిక్కుతోచకుండా చిక్కులలో పడుట. 


10.క్రిమి భోజనము:పురుగులకు ఆహారముగా పెట్టుట‌. ఇది అనేక విధములైన సూక్ష్మజీవుల వ్యాధులను తెలియజేయును. 


11.సందంశనము: కొన్ని జీవులు కలిసి పీకుచుండుట. వ్రణములు మున్నగువాని దుర్భర బాధలని అర్థము. 


12.తప్తోర్మి: అనగా కళపెళలాడుచున్న అలలు కలది. అట్టి అలల యందు దుష్కర్మలు చేసిన వానిని ముంచెత్తుదురు. పూర్వదుష్కర్మ ఫలితముగా అగ్ని ప్రమాదములు మున్నగు వానికి గురి అగుట..........✍ *మాస్టర్ ఇ.కె.* 


(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-136

కామెంట్‌లు లేవు: