ఆయుర్వేదము నందు గల అష్టమస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 3 .
ఈ పోస్టు నందు మీకు నాడుల పేర్లు మరియు వాటి స్థానముల గురించి వివరిస్తాను .
నాభికందము నందు ఉండు నాడి "సుషుమ్న"
ఇది బ్రహ్మరంధ్రము వరకు వ్యాపించివుండును. మానవుని స్థూల సూక్ష్మ నాడులు అన్నియు కలిసి 3 1/2 కోట్లు ఇవి అన్నియు మొదట నాభిమర్మమునందు నుండి 10 నాడులు పైకి , 10 నాడులు కిందకి , 4 నాడులు అడ్డముగా బయలుదేరి శరీరము అంతయు మితిమీరిన సంఖ్యగలవై వ్యాపించి ఉండును.
సుషమ్న నాడి యందే జీవుని నివాసము . ఈ సుషమ్న నాడి యందలి జీవునకు " ఇళ " , " పింగళ"
నాడులచే తృప్తి కలుగును. వీటికి సరస్సులు అనే పేరు కలదు . శరీరము నందలి త్రిదోషములు ఎట్లు ప్రధానములో అట్లే ఈ నాడులు కూడా ప్రధానమైనవి .
సుషమ్న , ఇళ , పింగళ వేణి బంధము వలే కలిసి మెలిసి లలాటము నందు త్రివేణి సంగమం పేరుతో కలిసి ఉండును. మన ఉచ్చ్వాస , నిచ్ఛ్వాసమునకు "హంసయసి " అని పేరు కలదు . నాడి యందలి హంసగతిని బట్టి మనము త్రిదోషముల హెచ్చు తగ్గులను గమనించవలెను .
సుషమ్న నాడి వెన్నపూస నుండి మెడ మార్గమున బ్రహ్మరంధ్రము చేరును . వెన్నపూసను బ్రహ్మదండం అని పిలుస్తారు . అందులో ఉండు సుషమ్న నాడిని బ్రహ్మనాడి అందురు. బ్రహ్మనాడి యందు ఉన్న జీవుడు షట్చక్రముల యందు తిరుగుతున్న ఇళ , పింగళ నాడులతో తృప్తిపొందుచుండును.
ఇళ నాడి నాభి కుర్మము నుండి హృదయము వద్దకి వచ్చి మెడమార్గముగా ఎడమ ముక్కు రంధ్రము వద్దకి వచ్చును. అదేవిధముగా పింగళ నాడి కుడిముక్కు రంధ్రమును ఆశ్రయించి ఉండును.
మన నాడి వ్యవస్థ గురించి చెప్పాలంటే ఒక పెద్ద గ్రంథమే రాయవచ్చు . నాకు తెలిసినంత వరకు అత్యంత ముఖ్యమైన విషయాలను మీకు తెలియచేశాను . మరింత విలువైన సమాచారం మీకు నేను రాసిన గ్రంథముల యందు లభ్యం అగును.
తరవాతి పోస్టు నందు అష్టమస్థాన పరీక్ష యందలి మిగతావిషయాల గురించి వివరిస్తాను .
గమనిక -
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి