*మోక్ష మార్గాలు.. (మూడవ భాగం)*
*కర్మ మార్గము...*
కర్మ మార్గము అంటే యజ్ఞయాగాదులు, జపతపాలు, హోమాలు, వ్రతాలు, ఉపవాసాలు, దానధర్మాలు, నిత్య నైమిత్తిక కర్మలు, దానాలు ఇవన్నీ శాస్త్రబద్ధంగా జరపాలి. *కర్మ మార్గంలో ప్రయాణిద్దాము అనుకుంటే యజ్ఞాలు యాగాలు ఈ కాలంలో అసలు వీలు పడవు. అపార్ట్ మెంట్ల లో లిక్కి లిక్కి ఇండ్లలో మడులు ఆచారాలు వీలు కావు. షుగరు బి పీ లు పెట్టుకొని ఉపవాసాలు వీలు పడవు. దేవుడి పూజ లోనే పూలకు బదులు అక్షతాన్ సమర్పయామి అనే పరిస్థితి. అప్పుడు ఇక శాస్త్రాలలో చెప్పినట్టు గోదానాలు హిరణ్యం తో దక్షిణలు ఎక్కడిస్తాము. పంచాంగమూ తిధులూ చూసుకుంటూ రోజూ నియమాలతో నిష్టలతో కర్మ మార్గంలో ప్రయాణించడం ఇప్పుడు సాధ్యం కాదు.*
అర్థ కామాలను ధర్మానికి లోబడి అనుభ వించాలనీ, సాత్వికంగా నూ ధర్మ బద్ధం గాను జీవితం నడుపు కోవాలనీ, అన్నంతవరకు కర్మ మార్గం యొక్క ఉద్దేశ్యం మంచిదే. దాన్ని అమలు చేయడం మామూలుగానే కష్టం.
పైగా కర్మ మార్గము జనన మరణ బంధం నుంచి రక్షించలేదు. శుభ కర్మలకు పుణ్యము పాప కర్మలకు పాపము ఫలితంగా వస్తాయి. వాటిని అనుభవించడానికి మళ్లీ మళ్ళీ జన్మలు ఎత్తాలి. అలా ఎప్పటికీ ఆ జన్మల చక్రంలోతిరుగుతూ ఉండాలి. అంతం ఉండదు.
జన్మల చక్రం నుండి తప్పించుకో వాలంటే కర్మలను కర్తృత్వ భావన లేకుండా చెయ్యాలి. లేదా ఈశ్వ రార్పణం గా చెయ్యాలి. రెండూ కష్టమే. మన అవసరాల కోసం మన లాభాల కోసం పనులు చేసేటప్పుడు కూడా, చాలాసార్లు నిర్లక్ష్యం గానూ ఆలస్యంగానూ, తెలివి తక్కువగానూ పనులు చేస్తుంటాము. అట్లాంటిది కర్తృత్వ భావన లేకుండా ఈశ్వ రార్పణం గా పనులు చేద్దా మంటే పనులు చెయ్య దానికి పూనిక ఉత్సాహం ఉండవు. ఫలితం మనది కానప్పుడు ఏ పని అయినా కష్టపడి ఎందుకు చెయ్యాలి అనే ప్రశ్న వస్తుంది. కర్మ మార్గం గాడి తప్పు తుంది. నేను పనులు చేస్తున్నాను అనుకు న్నంత వరకూ ఆ జన్మల చక్రం నెత్తి మీద తిరుగుతూనే ఉంటుంది. ఇదే కర్మ మార్గంలో పెద్ద లోపము.
*పవని నాగ ప్రదీప్*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి