25, జూన్ 2021, శుక్రవారం

రోలు-రోకలు వివరణ

 రోలు-రోకలు వివరణ 

మనం మిక్స్, గ్రైండర్, వెట్ గ్రైండరుకి అలవాటు పడి పూర్వపు వంట ఇంటి సాధనలనే మరచి పోతున్నాము. అందుకే ఇది వ్రాస్తున్నాము. పూర్వము పూర్తిగా మానవ శ్రమ మీదనే అన్ని పనులు చేసుకునే వారు. కొన్ని ఇండ్లలో కరంటు ఉండేది కూడా కాదు. 

రోలు గుండ్రంగా వున్న రాతి దిమ్మకు ఒక గుంతలాగా తొలచి చేసింది. దానికి తోడు ఒక గుండ్రటి సొరకాయ ఆకారంలో చేసిన రాయిని పొత్రము అంటారు. కాగా ఒక కర్ర తుంగని అడుగు అర్ధ గోళాకారంలో చెక్కిన దానిని రోకలి అని రోకలి బండ అని అంటారు. రోలులో వేయించిన ఆకుకూరలు వేసి రోకలితో నురుతారు ఆ విధంగా పచ్చడి చేస్తారు.  అటువంటి పచ్చడిని రోటి పచ్చడి, బండ పచ్చడి అనికూడా అంటారు.  ఒక్క సారి వెనకటి విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోండి. ఇక ధాన్యాన్ని దంచే రోకలి ఈ రోకలి 5 అడుగుల పొడవు వున్న మాను మొద్దు కాకపొతే దీనికి అడుగున ఒక ఇనుప రింగు తోడికి ఉంటుంది. దీనిని ధాన్యం దంచటానికి, ఎండు మిరప కాయలని దంచటానికి వాడతారు. 

రోలు పొత్రంతో ఇడ్లిల పిండి, అట్ల పిండి, వడియాల పిండి మొదలైన పిండ్లు రుబ్బటానికి వాడతారు. 

మిత్రుల ప్రేరణతో ఈ వివరణ ఇస్తున్నాను. 



కామెంట్‌లు లేవు: