17, ఆగస్టు 2021, మంగళవారం

సంస్కృత మహాభాగవతం

*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఎనుబది తొమ్మిదవ అధ్యాయము*


*భృగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించుట - మృతులైన బ్రాహ్మణ కుమారులను శ్రీకృష్ణుడు తీసికొనివచ్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*89.10 (పదియవ శ్లోకము)*


*అతీవ కోమలౌ తాత చరణౌ తే మహామునే|*


*ఇత్యుక్త్వా విప్రచరణౌ మర్దయన్ స్వేన పాణినా॥12060॥*


*89.11 (పదకొండవ శ్లోకము)*


*పునీహి సహ లోకం మాం లోకపాలాంశ్చ మద్గతాన్|*


*పాదోదకేన భవతస్తీర్థానాం తీర్థకారిణా॥12061॥*


*89.12 (పండ్రెండవ శ్లోకము)*


*అద్యాహం భగవంల్లక్ష్మ్యా ఆసమేకాంతభాజనమ్|*


*వత్స్యత్యురసి మే భూతిర్భవత్పాదహతాంహసః॥12062॥*


మహామునీ! 'నీ పాదములు మిగుల సున్నితమైనవి' అని పలికి, స్వయముగా (తన చేతులతో) ఆ మహర్షి పాదములను సేవించుచు ఇట్లనెను- "మహర్షీ! నీ పాదస్పర్శతో తీర్థములు అన్నియును పవిత్రములగును. అట్టి నీ పాదజలముతో, నన్ను, నా వైకుంఠలోకమును, నాలో చేరియున్న లోకపాలురను పునీతమొనర్ఫుము. ఇప్పుడు లక్ష్మీదేవికి నేను పరమాశ్రయుడను. నీ పాదస్పర్శతో నా పాపములన్నియును ప్రక్షాళితములైనవి. అట్టి నా వక్షస్థలమునందు లక్ష్మీదేవి నిత్యనపాయినియై వర్ధిల్లుచుండును".


*శ్రీశుక ఉవాచ*


*89.13 (పదమూడవ శ్లోకము)*


*ఏవం బ్రువాణే వైకుంఠే భృగుస్తన్మంద్రయా గిరా|*


*నిర్వృతస్తర్పితస్తూష్ణీం భక్త్యుత్కంఠోఽశ్రులోచనః॥12063॥*


*శ్రీశుకుడు పలికెను* శ్రీమహావిష్ణువు ఇట్లు గంభీర వచనములను మృదుమధురముగా పలుకగా భృగుమహర్షి పరమానందభరితుడయ్యెను. భక్తిపారవశ్యమున ఆయనయొక్క కంఠము మూగవోయెను. కన్నులలో ఆనందాశ్రువులు నిండెను.


*89.14 (పదునాలుగవ శ్లోకము)*


*పునశ్చ సత్రమావ్రజ్య మునీనాం బ్రహ్మవాదినామ్|*


*స్వానుభూతమశేషేణ రాజన్ భృగురవర్ణయత్॥12064॥*


పరీక్షిన్మహారాజా! పిదప ఆ మహాముని బ్రహ్మవేత్తలైన మునీశ్వరుల యాగసభకు విచ్చేసెను. త్రిమూర్తులతో తాను పొందిన అనుభవములను వారికి సాకల్యముగా వివరించెను.


*89.15 (పదిహేనవ శ్లోకము)*


*తన్నిశమ్యాథ మునయో విస్మితా ముక్తసంశయాః|*


*భూయాంసం శ్రద్దధుర్విష్ణుం యతః శాంతిర్యతోఽభయమ్॥12065॥*


*89.16 (పదహారవ శ్లోకము)*


*ధర్మః సాక్షాద్యతో జ్ఞానం వైరాగ్యం చ తదన్వితమ్|*


*ఐశ్వర్యం చాష్టధా యస్మాద్యశశ్చాత్మమలాపహమ్॥12060॥*


భృగుమహర్షియొక్క అనుభవవచనములను విన్నపిమ్మట అచటి మహామునులు అందఱును మిగుల ఆశ్చర్యమునకు లోనైరి. వారి సందేహములు పూర్తిగా తొలగిపోయెను. వైకుంఠపతియైన శ్రీమన్నారాయణుడు తనను సేవించిన వారికి శాంతిని, ముక్తిని ప్రసాదించుననియు, అందువలననే త్రిమూర్తులలో ఆ పరమపురుషుడే సర్వశ్రేష్ఠుడనియు వారు విశ్వసించిరి. ఆ పురుషోత్తముని ఉపాసించిన వారికి ధర్మనిరతి, బ్రహ్మజ్ఞానము, విషయసుఖములయెడ విరక్తి, అణిమాది అష్టవిధ ఐశ్వర్యములు, మనోమాలిన్యములను రూపుమాపునట్టి యశస్సు అబ్బును.


*89.17 (పదిహేడవ శ్లోకము)*


*మునీనాం న్యస్తదండానాం శాంతానాం సమచేతసామ్|*


*అకించనానాం సాధూనాం యమాహుః పరమాం గతిమ్॥12067॥*


సకలప్రాణులకును హితకారులు (భూతద్రోహరహితులు), శాంతచిత్తులు, సమస్తజీవులయెడ సమత్వబుద్ధి గలవారు, ప్రతిఫలాపేక్షారహితులు (పరోపకార పరాయణులు), సాధుస్వభావులు, ఐన మునీశ్వరులకు ఆ శ్రీహరియే పరమగతియని, వేదములు, శాస్త్రములు నొక్కి వక్కాణించుచున్నవి.


*89.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*సత్త్వం యస్య ప్రియా మూర్తిర్బ్రాహ్మణాస్త్విష్టదేవతాః|*


*భజంత్యనాశిషః శాంతా యం వా నిపుణబుద్ధయః॥12068॥*


ఆ సర్వేశ్వరుడు శుద్ధసత్త్వస్వరూపుడు. అతడు బ్రహ్మజ్ఞాన సంపన్నులగు బ్రాహ్మణులయెడ అత్యంత ప్రియభావమును కలిగియుండును (భక్తపరాధీనుడు). నిష్కామకర్మయోగులు, జితేంద్రియులు, ఆత్మానాత్మ వివేకసంపన్నులు ఆ దేవదేవుని భక్తిశ్రద్ధలతో సేవించుచుందురు.


*89.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*త్రివిధాకృతయస్తస్య రాక్షసా అసురాః సురాః|*


*గుణిన్యా మాయయా సృష్టాః సత్త్వం తత్తీర్థసాధనమ్॥12069॥*


ఆ శ్రీహరియొక్క త్రిగుణాత్మకమైన మాయయే - రాక్షసులు, అసురులు, దేవతలు అను మూడు వర్గములవారిని సృష్టించెను. శుద్ధసత్త్వమయమైన ఆ భగవన్మూర్తి ఎల్లరకును ఉపాసింపదగినది.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఎనుబది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: