17, ఆగస్టు 2021, మంగళవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 .*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*971వ నామ మంత్రము* 17.8.2021


*ఓం సువాసిన్యర్చన ప్రీతాయై నమః*


సువాసినలయొక్క అర్చనలచే సంతసమొందు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సువాసిన్యర్చన ప్రీతా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం సువాసిన్యర్చనప్రీతాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి కరుణచే శాంతిసౌఖ్యములకు, భోగభాగ్యములకు, ధనధాన్యములకు లోటులేకుండా ఉండును.


సువాసిని అనగా ఐదవ తనము గల స్త్రీ లేదా ముత్తైదువ. పసుపుకుంకుమలు, గాజులు, మట్టెలు, మంగళసూత్రములు, నల్లపూసలు అను సౌభాగ్యాభరణములను ధరించు స్త్రీలు. అటువంటి సువాసినులను శ్రీచక్రార్చనచేసిన తరువాత అర్చించుట మన హైందవ సాంప్రదాయము. పరమేశ్వరి సువాసినీ (ముత్తైదువ) స్త్రీల అర్చనలను ఇష్టపడునది గనుక *సువాసిన్యర్చనప్రీతా* యని అనబడినది. సువాసినీ స్త్రీలనగా సాక్షాత్తు పరమేశ్వరీ స్వరూపము. అందుకే ముత్తైదువులను సాక్షాత్తు అమ్మవారిగా భావించి అర్చించడం ఒక సాంప్రదాయము.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సువాసిన్యర్చనప్రీతాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: