*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*388వ నామ మంత్రము*17.8.2021
*ఓం నిత్యక్లిన్నాయై నమః*
సదా దయాస్వరూపురాలుగా విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిత్యక్లిన్నా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం నిత్యక్లిన్నాయై నమః* అని అత్యంత భక్తిశ్రద్నలతో స్మరించు భక్తులను ఆ తల్లి తన దయార్ధ్ర హృదయంతో సకలాభీష్టసిద్ధిని కలుగజేయును.
పరమేశ్వరి తిథినిత్యలలో మూడవ నిత్య అయిన నిత్యక్లిన్నా స్వరూపురాలు. శుక్ల పక్షమునందు తదియతిథి నాటి నిత్యాదేవత *నిత్యక్లిన్న* అలాగే బహుళపక్షంలో చతుర్దశి తిథినాటి నిత్యాదేవత *నిత్యక్లిన్న* అమ్మవారు అటువంటి నిత్యక్లిన్నా స్వరూపురాలు గసుక ఆ తల్లి *నిత్యక్లిన్న* యనిఅనబడినది.
చంద్రకళలను సూచించే తిథులకు - అమ్మవారి కళలకు సమన్వయం ఉన్నది. శుక్లపక్షమి చంద్రుడు, పాడ్యమి నుండి క్రమంగా ఒక్కొక్క కళ పెరుగుతూ పూర్ణిమ వరకు నిండు చంద్రుడౌతాడు. చంద్రునియొక్క పదహారు కళలు శ్రీవిద్యలో *నిత్య* లని అంటారు. రెండు పక్షాలలోని తిథులకు నిత్యలని సమన్వయం చేయడమైనది🌻🌻🌻
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻శుక్ల పక్షము
1. పాడ్యమి - కామేశ్వరి
2. విదియ - భగమాలిని
3. తదియ - *నిత్యక్లిన్నా*
4. చవితి - భేరుండా
5. పంచమి - వహ్నివాసినీ
6. షష్టి - మహావజ్రేశ్వరీ
7. సప్తమి - శివదూతీ
8. అష్టమి - త్వరతా
9. నవమి - కులసుందరీ
10. దశమి - నిత్యా
11. ఏకాదశి - నీలపతాకా
12. ద్వాదశి - విజయ
13. త్రయోదశి-సర్వమంగళా
14. చతుర్దశి - జ్వాలామాలిని
15. పూర్ణిమ - చిత్రా
కృష్ణ పక్షము
1. పాడ్యమి - చిత్రా
2. విదియ - జ్వాలామాలిని
3. తదియ - సర్వమంగళా
4. చవితి - విజయా
5. పంచమి - నీలపతాకా
6. షష్టి - నిత్యా
7. సప్తమి - కులసుందరీ
8. అష్టమి - త్వరితా
9. నవమి - శివదూతీ
10. దశమి - మహావజ్రేశ్వరి
11. ఏకాదశి - వహ్నివాసిని
12. ద్వాదశి - భేరుండా
13. త్రయోదశి-నిత్యక్లిన్నా
14. చతుర్దశి - భగమాలిని
15. అమావాస్య - కామేశ్వరీ
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే శుక్లపక్షము నందలి నిత్యాదేవతలు పాడ్యమి నుండి పౌర్ణమి వరకు అనులోమక్రమం అనగా పాడ్యమి నాడు కామేశ్వరి నుండి పౌర్ణమి నాడు చిత్రాగా గమనిస్తే, కృష్ణపక్షంలో విలోమము అనగా పౌర్ణమి నాటి నిత్యాదేవత చిత్ర కాగా కృష్ణపక్ష పాడ్యమికి కూడా నిత్యాదేవత చిత్రాతో ప్రారంభమై విలోమక్రమంలో అమావాస్యనాటికి నిత్యాదేవత కామేశ్వరి అవుతుంది. ఇది చంద్రకళల క్రమంలో ఏర్పడింది. కాని శుక్లపక్షమునందు, కృష్ణ పక్షము నందు *అష్టమి* నాటి నిత్యాదేవత *త్వరితా* అగును. అంటే *అష్టమీచంద్రవిభ్రాజదళకస్థల శోభితా* అను నామ మంత్రములో వశిన్యాది దేవతలు చెప్పిన అష్టమి చంద్రుడు శుక్లపక్షమైనా, కృష్ణపక్షమైనా ఒకే విధముగా ఉంటాడు అంటే అంతటి అష్టమి చంద్ర శోభతో జగన్మాత ఫాలభాగము శోభాయమానమై ఉన్నదని వశిన్యాది దేవతలు చెప్పారంటే అమ్మను వారు తిలకించియున్నారు గదా!🌹🌹🌹ఈ పదిహేను నిత్యలలో - శుక్లపక్షములో ఒక్కొక్క కళ పెరుగుతూ ఉంటుంది. కృష్ణపక్షములో ఒక్కొక్క కళ తగ్గుతూ ఉన్న మూలభూతమైన కళను మహానిత్యయని అందురు. దీనినే లలితకళ, ఆద్యకళ, చిత్కళ, సంవిత్కళ అని అంటారు. ఈ మహానిత్య లలితాంగిగా ఉన్నందున మిగతా కళలు నిత్యల యందు అంగభాగములుగా ఉండును.
జగన్మాత నిత్యము దయార్ద్రస్వరూపిణి. భోగమోక్షములను ప్రసాదించునది. అందుచే జగన్మాత *నిత్యక్లిన్నా* యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిత్యక్లిన్నాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి