14, ఫిబ్రవరి 2026, శనివారం

పాపం తొల‌గిపోవాలంటే...*

 *ఏడు జ‌న్మ‌ల పాపం తొల‌గిపోవాలంటే...*  


ఏడు జ‌న్మ‌ల పాపం తొల‌గిపోవాలంటే ఆ ఒక్క పువ్వు చాలు. ఒకే ఒక పువ్వును ఆయ‌న ముందు ఉంచితే స‌మ‌స్త దోషాల‌న్నీ హ‌రిస్తాడ‌ట‌. కైలాస‌వాసుడికి ఎంతో ఇష్ట‌మైన పువ్వే ఉమ్మెత్త పువ్వు. ఆ పువ్వును శివుని ద‌గ్గ‌ర ఉంచి వేడుకుంటే భ‌క్తుల‌కు మోక్షం సిద్ధిస్తుంది. శివాలయాల్లో ఉమ్మెత్త పువ్వులతో అభిషేకం ప్రత్యేకంగా జరుగుతుంది. మాంగల్య భాగ్యం లభించాలంటే శివుడిని ఉమ్మెత్త పువ్వులతో అర్చించాలి. ఉమ్మెత్త పువ్వులతో తయారు చేసిన మాలను శివుడికి అర్చించడం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆ పూలతో శివయ్యను పూజించడం వల్ల దరిద్రం పోవడం మాత్రమే కాదు ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగి పోతాయి. ప్రదోష సమయంలో శివుడిని దేవతలు స్తుతిస్తారు ఆ సమయంలో శివునిని దర్శించుకుంటే శివుని అనుగ్రహంతో పాటు సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుంది. అప్పుడే దోషాలు తొలగిపోతాయి.. సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి.🕉️🚩🕉️

కామెంట్‌లు లేవు: