31, మే 2026, ఆదివారం

విష్ణు సహస్రనామం* *..ఎలా వచ్చింది!!!*

  🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺


*విష్ణు సహస్రనామం* 

         *..ఎలా వచ్చింది!!!*


🍀🍀🍀🍀🍀🍀🍀🍀


భీష్మపితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు. 

కృష్ణుడు, ధర్మరాజుతో సహా, కాని ఎవరూ రాసుకోలేదు. 


మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం?


అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు ఆ వ్యక్తిని అక్కడున్న వారినందిరినీ ఉద్దేశించి, 

*"ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది?"* 

అని అడిగారు.


ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. 

మళ్ళీ స్వామివారు, 

*"విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?"* 

అని అడిగారు


ఒకరన్నారు, 

"భీష్ముడందించారన్నారు"


స్వామివారు, *"భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?"*


మళ్ళీ నిశబ్దం.


స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు. 

భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు.


అప్పుడు యుధిష్టురుడన్నాడు, 

*"ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా"* అని.


"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.


శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు.


"అదెలా" అని అందరూ అడిగారు.


శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే *సూత స్పటికం* వేసుకున్నాడు. 


ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. 

దీని ప్రత్యేకతేంటంటే... 

వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. 


సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు.


శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యాస మహర్షి వ్రాసిపెట్టాడు.


ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వార మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

 శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।

విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూధానం ||

హరిం నరహరరిం రామం గోవిందం దధివామనం ||


🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: