11-38,39-గీతా మకరందము
విశ్వరూపసందర్శనయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
త్వమాదిదేవః పురుషః పురాణ
స్త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ |
వేత్తాఽసి వేద్యం చ పరం చ ధామ
త్వయా తతం విశ్వమనన్తరూప ||
తా:- అనంతరూపుడగు ఓ కృష్ణా! నీవు ఆదిదేవుడు, సనాతనపురుషుడు, ఈ ప్రపంచమునకు శ్రేష్ఠమైన ఆధారమున్ను, సమస్తమును తెలిసికొనినవాడును, తెలియదగినవాడును, సర్వోత్తమస్థానమును అయియున్నావు. నీచేతనే ఈ ప్రపంచమంతయును వ్యాపింపబడియున్నది.
ప్ర:- పరమాత్మ ఇంకను ఎట్టి లక్షణములు కలవాడు?
ఉ:- (1) ఆదిదేవుడు (2) ప్రాచీనపురుషుడు (3) ప్రపంచమునకు ఆధారభూతుడు (4) సమస్తము తెలిసినవాడు (5) తెలియదగినవాడు (6) సర్వోత్తమస్థానము (7) ప్రపంచమంతటను వ్యాపించియున్నవాడు (8) అనంతరూపుడు.
-------------------------------------
॥ ఓం - గీతా మకరందము [11-39]॥
వాయుర్యమోఽగ్నిర్వరుణశ్శశాఙ్కః
ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ |
నమో నమస్తేఽస్తు సహస్రకృత్వః
పునశ్చ భూయోఽపి నమో నమస్తే ||
తా:- వాయువును, యముడును, అగ్నియు, వరుణుడును, చంద్రుడును, బ్రహ్మదేవుడును, బ్రహ్మదేవునకు తండ్రియును మీరే అయియున్నారు. మీకనేకవేల నమస్కారములు ! మఱల మఱల మీకు నమస్కారము.
వ్యాఖ్య:- అర్జునునకు భగవానునియెడల కలిగిన అట్టి అపరిమితభక్తి సాధకునకు అత్యంతావశ్యకమైయున్నది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి