1, జనవరి 2025, బుధవారం

మేష రాశి నుండి మీన రాశి వరకు ఆంగ్ల సంవత్సర రాశిఫలాలు 2025*

 *మేష రాశి నుండి మీన రాశి వరకు ఆంగ్ల సంవత్సర రాశిఫలాలు 2025* 💐

🌼🌷🪷🌼🌷🪷🌼🌷🪷🌼🌷🪷🌼🌷🪷🌼                                 

 *ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు....*                                    

*ఆంగ్ల సంవత్సర రాశిఫలాలు - 2025*





*మేషరాశి:-*


ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు కలుగును. ఏలినాటి శనీశ్వర దోష ప్రభావము తృతీయ స్థానములో గురు ప్రభావం వలన సోదరులు, కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయము కలుగును. చేపట్టిన పనులలో కార్యా ఆటంకములు కష్టం మీద వివాహ ప్రయత్నములు ఫలించును. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు, చికాకులు అధికమగును. వ్యాపారస్తులకు ధన నష్టము తప్పదు. ఋణ బాధలు కొంత బాదించును. విద్యార్థులకు మరింత కష్టపడాలి. స్త్రీలకు సామాన్య ఫలితములు కలుగును. ఆదాయం కన్నా ఖర్చులు మరియు అప్పులు అధికమగును. విమర్శలు, అవమానాలు పెరుగును. గొడవలకు దూరంగా ఉండాలి. కోర్టు వ్యవహారాలు, సమస్యలు చికాకు కలిగించును. భక్తి కార్యక్రమాలలో పాల్గొందురు. అవసరానికి ఒక్కొక్క సమయంలో ధనము ఆలస్యము అయినను ఏదో ఒక రకంగా పొందుదురు. సంవత్సరం ద్వితీయార్థంలో కొంత శుభ ఫలితములు కలుగును. రాజకీయ రంగంలో ఉన్నవారికి కష్ట సమయం. సినీ, మీడియా రంగంలో ఉన్నవారికి ఆర్థిక సమస్యలు ఏర్పడును. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఏర్పడును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు తప్పవు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. కుటుంబ సంబంధాల్లో కొన్ని తగాదాలు రావచ్చు, మానసిక ఆందోళనలు కలుగును.


జనవరి :-ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. కుటుంబములో వివాదములు. సంతానం విషయంలో సమస్యలు. లాభము ఉన్నప్పటికీ ఖర్చులు మాత్రం అధికంగా ఉండును. ఉద్యోగస్తులకు ఊహించని స్థాన మార్పులు ఉంటాయి. మీ సలహాలు ఇతరులకు పని చేస్తాయి. కళాత్రమునకు అనారోగ్య సమస్యలు.


ఫిబ్రవరి :-ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. సన్నిహితుల సహాయం లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. స్వల్ప అనారోగ్య సూచనలు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు తప్పవు. దేవాలయ దర్శనం వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రమే. 


మార్చి :-ఈ మాసం కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అధిక ప్రయాణ సూచనలు. వృత్తి వ్యాపారాలలో కొంత అనుకూల ఫలితాలు. శత్రువుల నుండి కొంత ఒత్తిడి ఉన్న బయటకు రాగలుగుతారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. శుభకార్యములకు ఆటంకాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకొనుట మంచిది. 


ఏప్రిల్ :-ఈ మాసము అంత అనుకూలంగా లేదు. కుటుంబ పెద్దలు సలహాలు తీసుకొని ముందుకు సాగటం మంచిది. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయాలి. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో ఆ బడి పై దృష్టి సారించాలి.


మే :-ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు కలసి వచ్చును. ఆర్థిక వ్యవహారాల్లో కొంత మెరుగైన ఫలితాలు ఉన్నాయి. నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.


జూన్:- ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు కొంత కలిసి వస్తాయి. అతి కష్టం మీద గాని కొన్ని పనులు పూర్తికావు. వృత్తి వ్యాపారాలు కొంత సామాన్యంగా సాగుతాయి. విలువైన వస్తువులు కొంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి.


జూలై:-ఈ మాసం అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు ఊహించని ప్రమోషన్లు అధికారులు సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారస్తులకు నూతన వ్యాపార విషయాలలో జాగ్రత్త వహించాలి. బంధుమిత్రులతో మాటపట్టింపులుంటాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.


ఆగస్టు:- ఈ మాసం కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు. కీలక వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ధనపరంగా ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది.


సెప్టెంబర్ :-ఈ మాసంలో మిశ్రమ ఫలితాలుంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనయోగం ఉంది. కొన్ని విషయాలలో మానసిక ఆందోళనలు పెరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి.


అక్టోబర్ :-ఈ మాసం అనుకూలంగా ఉన్నది. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొన్ని పరిశ్రమల వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు వింటారు. పట్టిన పనులలో విజయం సాధిస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.


నవంబర్ :-ఈ మాసం అనుకూలంగా లేదు. ఖర్చులు చేదాడుతాయి. శత్రు సమస్యలు. జ్వరాది అనారోగ్య సమస్యలు. వ్యాపార పరంగా గందరగోళ పరిస్థితి. భాగస్వామ్య వ్యాపారాలలో కలహ సూచనలు.


డిసెంబర్ :-ఈ మాసం అంత అనుకూలంగా లేదు. స్త్రీ మూలక కలహములు వ్యాపారమూలకంగా ధన నష్టములు. కొన్ని వ్యవహారాలలో సోదర సహాయ సహకారాలు లభిస్తాయి. శత్రు సమస్యలు. ప్రయాణమునందు జాగ్రత్త అవసరం.


*పరిహారం:- శనీశ్వర స్వామికి తైలాభిషేకము నల్ల నువ్వులు 1 ¼ kg దానము. గురువారం 1 ¼ kg శనగలు దానం. గురువారం శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవాలి.*


*వృషభ రాశి :-*


ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ధనలాభము, ఉన్నత పదవులు కలుగును.నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగును. విమర్శలు ఉన్నప్పటికీ అదిగమించి ముందుకు సాగుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన గృహ లాభము, వస్తు లాభము కలుగును. విద్యార్థులకు శుభ ఫలితాలు ఉన్నవి. స్త్రీలకు విశేషమైన ధనలాభము, వస్తులాభము కలుగును. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నప్పటికీ తొందరగా ఉపశమనం పొందుతారు. విదేశీ ప్రయాణములు కలశసి వస్తాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. నూతన పరిచయాలు లాభిస్తాయి. వ్యాపారస్తులు విశేషమైన లాభాలు పొందుతారు. రాజకీయ నాయకులకు అనుకూలం. అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం కలసి వచ్చును. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. వ్యవసాయాలు విశేషంగా లాభదాయకంగా ఉండును. 


జనవరి :ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. నూతన పనులు ప్రారంభించుటకు అనుకూల సమయం. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహారించాలి. ఖర్చులు అధికం. కొన్ని వ్యవహారలలో మిత్రుల సహకారముంటుంది. దైవదర్శనములు చేస్తారు. శుభకార్యాలకు ప్రయత్నాలు కలసివస్తాయి.


ఫిబ్రవరి :ఈ మాసం అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగాలలో స్థానచలనం. సంతాన ఆరోగ్యపరంగా సమస్యలు. మాసం మధ్యలో ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. భాగస్వామ్య వ్యాపారస్తులతో సమస్యలుంటాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండాలి.


మార్చి :ఈ మాసం అనుకూలంగా లేదు. శుభకార్యములు మూలక ధన వ్యయం, వ్యాపారపరంగా ధననష్టములు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలహములు ఉంటాయి. ఇతరులతో జాగ్రత్త అవసరం. కోపం వలన సమస్యలు వస్తాయి.


ఏప్రిల్ :ఈ మాసం మిశ్రమముగా ఉన్నది. చేసే ప్రతి పనియందు కలసివచ్చును. విదేశీ ప్రయాణం ప్రయత్నములు ఫలించును. మాటవిషయంలో తొందరపాటు వివాద సూచనలున్నాయి. కొన్ని వ్యవహారములు స్వయంగా చూసుకొనుట మంచిది. కీళ్ళ నొప్పులు బాధిస్తాయి. 


మే :ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. సమాజంలో గౌరవ మర్యాదలుంటాయి. నూతన వ్యాపారములలో విశేష లాభాలు పొందుతారు. మానసిక ఆనందము విలువైన వస్త్రములు, ఆభరణములు కొనుగోలు చేస్తారు. స్త్రీమూలక ధన వ్యయం.నూతన రుణాలు చేస్తారు.


జూన్ :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాసం చివరన చేపట్టిన పనులు కలసిరావు. అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. 


జూలై :ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. చేపట్టిన పనులందు జాప్యం తప్పదు. దూర ప్రయాణాలయందు ఆటంకములు. ఇతరులతో ఆచితూచి మాట్లాడటం మంచిది. ధన వ్యవహారములు కలసివచ్చును. వృత్తి వ్యాపారాలలో ప్రత్యర్థుల వలన సమస్యలు వస్తాయి.


ఆగస్టు :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. చేపట్టిన పనియందు అధిక శ్రమ ఉన్నపటికీ పూర్తి చేస్తారు. నూతన వస్త్రలాభం. ఇరుగు పొరుగు వారి సహాయ సహకారములు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. మంచి సౌఖ్యముండును. గృహమున మార్పులు ఉంటాయి.


సెప్టెంబర్ :ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబముతో ఆనందముగా గడిపెదరు. పాత మిత్రులను కలుస్తారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ప్రయాణములలో స్వల్ప మార్పులు వస్తాయి. బందు మిత్రుల నుండి ఆహ్వానాలు ఆనంద పరుస్తాయి.


అక్టోబర్ :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. మిత్రుల నుండి శుభవార్త వింటారు. ధన సౌఖ్యం వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణములు కలసివస్తాయి. కొన్ని విషయాలలో ఆచి తూచి వ్యవహారించాలి. కోర్టు వ్యవహారాలు అంత అనుకూలంగా ఉండవు.


నవంబర్ :ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణములు వాయిదా పడుతాయి. ఉద్యోగ పరంగా గుర్తింపు తగ్గును. వ్యాపారస్తులకు సామాన్యం ఫలితాలుంటాయి. పెద్దలతో ఆచితూచి మాట్లాడాలి.


డిసెంబర్ :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. పనులు త్వరిత గతిన పూర్తి చేస్తారు. ధనము, గౌరవము పెరుగును. విందు వినోద కార్యక్రమములలో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు కలసివస్తాయి.


*పరిహారం:-ఈ రాశి వారు నిత్యం లక్ష్మి ఆరాధనా చెయ్యాలి. కనకదారాస్తోత్రం పారాయణం చెయ్యడం మంచిది.సంవత్సరం ప్రారంభంలో గురువారం రుద్రాభిషేకం శనగలు గురువారం దానంగా ఇవ్వాలి.*


*మిథున రాశి*


జన్మగురుని ప్రభావంచేత పనుల యందు ఆటంకములు, సమస్యలు పెరుగును. వృత్తి ఉద్యోగమున స్థానచలనములు, వ్యాపారమునందు ఒత్తిళ్ళు అధికము. ఆరోగ్య విషయాల మీద శ్రద్ధ వహించుట మంచిది. ఇష్ట దేవతరాధన చెయ్యడం మంచిది. ఇంట బయట కలహములు అధికమగును. రాహు కేతువుల ప్రభావంచేత కుటుంబమునందు కలహములు ఏర్పడును. సంవత్సరం ద్వితీయార్థంలో కొంత శుభ ఫలితములు కలుగును.


విద్యార్థులకు అధిక ఒత్తిడి తప్పదు . స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు. వ్యవసాయమున కష్టమునకు తగిన ఫలితం ఉండదు. వ్యాపారస్తులకు కొంత మిశ్రమ ఫలితాలు ఒత్తిడి పెరుగును. రుణభారము అధికమగును. నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలీ. కోర్టు కేసు వ్యవహారాలు చికాకులు కలిగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. జన్మ గురుని ప్రభావం వలన ఆరోగ్య విషయాల యందు కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలి. 


జనవరి:ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. మానసిక ఆందోళనలు, కొన్ని వ్యవహారముల నందు భయం. నూతన పరిచయల వలన లాభము. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రతి విషయంలో వ్యతిరేకత తప్పదు. మాసం చివరలో అనుకూలత. స్త్రీమూలక ధనవ్యయము.


ఫిబ్రవరి :ఈ మాసం మీకు మిశ్రమముగా ఉన్నది. బంధువర్గంతో వివాదములు ఉంటాయి. శుభకార్యాలు మూలక ధనవ్యయము. పాత మిత్రుల సహాయము వలన కొంత ఊరట. విదేశీ ప్రయాణ ప్రయత్నం లాభము. ఆర్థికముగా కొంత అనుకూలము.


మార్చి :ఈ మాసం అంత అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగించును. ఖర్చులు చేదాటుతాయి. మాసం చివరన శుభవార్తలు వింటారు. బందు మిత్ర సమాగం ఆనందం కలిగిస్తుంది. దేవాలయ దర్శనం చేస్తారు.


ఏప్రిల్ :ఈ మాసంలో అనుకూల ఫలితాలున్నాయి. కోర్టు వ్యవహారములు అనుకూలించును. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. సంఘములో పెద్దలతో పరిచయాలుంటాయి. నూతన గృహ ప్రయత్నములు కలసివస్తాయి. వ్యాపారస్తులకు లాభదాయకం ఉంటాయి. 


మే :ఈ మాసం అనుకూలంగా లేదు. జ్వరాది అనారోగ్య సమస్యలుంటాయి. కుటుంబ వివాదాలతో మానసిక ఆందోళనలు తప్పవు. భార్య వలన సౌఖ్యం గృహమున శుభ కార్యములు చేయుదురు. ఆలయ దర్శనం చేస్తారు. ఆకారణంగా వివాదాలు తప్పవు.


జూన్ :ఈ మాసం అనుకూలంగా లేదు. నూతన పరిచయాలు వలన సమస్యలు అతి కష్టం మీద కాని పనులు పూర్తికావు. వృత్తిపరంగా చిక్కులు ఉంటాయి. కోర్టు వ్యవహారములు వాయిదాలుపడతాయి. ఉద్యోగ స్థాన మార్పులు కలుగుతాయి.


జూలై :ఈ మాసం మిశ్రమ ఫలితములు ఉన్నవి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేస్తారు. కొన్ని పనులలో అపజయములుంటాయి. అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తి అగును. ఇతరులకు సహాయపడతారు. విపరీతమైన ఖర్చులు ఉంటాయి.


ఆగస్టు :ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. నూతన గృహ ప్రయత్నములు ఫలిస్తాయి. ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి. సంఘంలో గౌరవ గౌరవం పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు పలిస్తాయి. తలపెట్టిన పనులు పూర్తగును. ధనయోగం ఉన్నది.


సెప్టెంబర్ :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులందు కార్యములు ఫలించును. చిన్నపాటి కలహములు తప్పవు. తొందరపాటు నిర్ణయాలు వలన నష్టములు తప్పవు. నూతన రుణాలు చెయ్యవలసి రావచ్చు.


అక్టోబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. అధిక ధన వ్యయము కలుగును. బందు మిత్రులతో విరోధములు, ఉద్యోగమున అపవాదులు అధికం. ఇతరుల వ్యవహారములలో కలగచేసుకొని ఇబ్బదులు పడతారు. నూతన వ్యాపారం గూర్చి ఆలోచనలు చేస్తారు.


నవంబర్ :ఈ మాసం మిశ్రమ ఫలితాలున్నాయి. అనుకోని ఖర్చులుంటాయి. సోదర సఖ్యత. నూతన వస్త్ర లాభముంటుంది. భూ కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రుల సహకారముంటుంది. వాహన ప్రమాద సూచనలున్నాయి. వృధా ఖర్చులుంటాయి. గృహ నిర్మాణమునకు ఆటంకములు కలుగుతాయి.


డిసెంబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ కలహాలుంటాయి. శుభకార్య ఆటంకములు కలుగును. స్నేహితులతో కలహాములు కలుగుతాయి, దూర ప్రయాణములు వలన అనారోగ్య సమస్యలు వస్తాయి.


*పరిహారం:-దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చెయ్యాలి. గురువారం శివాలయంలో అభిషేకం చేయించాలి ప్రతి నెల శనగలను ఆవుకు గురువారం దాణాగా పెట్టాలి.*


*కర్కాటక రాశి*

ఈ రాశి వారికి అష్టమ స్థానం శని వలన ఖర్చులు అధికమగును. వ్యక్తిగత కుటుంబ కలహాములు దూరప్రయాణ మూలక ఖర్చులు. కొన్ని వ్యవహారములలో తొందరపాటు నిర్ణయాలు, గొడవలు అధికమగును. ఆరోగ్య విషయాల యందు శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనుల యందు చికాకులు అధికమగును. ఇంట బయట శాంతముగా వ్యవహరించడం మంచిది. విద్యార్థులకు మిశ్రమ ఫలితములున్నవి. వ్యాపారస్తులకు ఖర్చులు అధికమగును. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములు కష్టం మీద కలసివచ్చును. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు, చికాకులు పెరుగును. వ్యవసాయదారులకు సామాన్య ఫలితములు. అన్ని రంగాల వారికి కష్టం మీద కానీ పనులు పూర్తి కావు. రాజకీయ నాయకులకు కష్టకాలం. కోర్టు వ్యవహారాలయందు జాగ్రత్త అవసరం. స్త్రీలు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. 


జనవరి :ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గతంలో నిలిచిన పనులు అప్రయత్నంగా పూర్తగును. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. గృహమున శుభకార్య ఆటంకములు కలుగును. నూతన పరిచయములు, ఉద్యోగమున అధికారులతో విరోధాలు, పని ఒత్తిడి పెరుగును. 


ఫిబ్రవరి :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. నూతన వ్యాపార ఉద్యోగ ప్రయత్నములు ఫలించును. కొన్ని వ్యవహారములో ఊహించని లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహాయం ఫలించును. నూతన వాహన లాభం కలుగును. కొన్ని వ్యవహారములు కష్టం మీద ఫలించును. 


మార్చి :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. నూతన పరిచయములు పెరుగుతాయి. గృహమున శుభాకార్యములు. కొన్ని వివాదములు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగములలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. తీర్థ యాత్రలు చేస్తారు. వ్యాపారంలో లాభాలుంటాయి.


ఏప్రిల్ :ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. శుభకార్య అనుకూలత కలుగును. కుటుంబ సభ్యులతో కలసి వినోద కార్యక్రమములలో పాల్గొంటారు. సంతానం గూర్చి ఆలోచనలు కొంత చికాకు పరుస్తాయి. మానసిక సమస్యలు భాదిస్తాయి.


మే :-ఈ మాసం అనుకూలంగా లేదు ఉద్యోగస్తులకు పై అధికారులతో ఇబ్బందులు తప్పవు. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు బందు వర్గంతో స్వల్ప సమస్యలు. ధన ఋణ భయము కలుగును. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.


జూన్ :ఈ మాసం అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో విరోధములు ఏర్పడు సూచనలున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్న ఆటంకాలు ఏర్పడును. కుటుంబ కలహాములు వ్యాపార వ్యవహారములలో నష్టములు కలుగును. తీర్థయాత్రలు చేస్తారు. కొన్ని పనులలో అధికముగా నష్టములు తప్పవు.


జూలై :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. శుభాకార్యములు వలన ధనము ఖర్చు చేయుదురు. కోర్టు వ్యవహారములు కలసివచ్చును. వృత్తి వ్యాపారమున ప్రయత్నించిన కార్యములు ఫలించును. మాసం చివరన బంధుమిత్రులతో అభిప్రాయ బేధములు వచ్చును. అనారోగ్య సమస్యలుంటాయి.


ఆగస్టు :ఈ మాసం అంత అనుకూలంగా లేదు. బంధువులతో విరోధాలు తప్పవు. వ్యాపారస్తులకు కష్టం అధికం లాభం తక్కువ. దేవాలయ సందర్శన చేస్తారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ప్రయాణమున జాగ్రత్త అవసరం. 


సెప్టెంబర్ :ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నూతన వస్త్రములు కొంటారు. ఆకస్మిక ధన లాభం ఉండును. గౌరవ మర్యాదలు పెరుగును. జాయింట్ వ్యాపారాలలో కలసివచ్చును మాసం చివరన మానసిక ఆందోళనలు. ధన వ్యయము కలుగును.


అక్టోబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. వ్యాపారములో నష్ట సూచనలు ఉన్నాయి. అనవసర ఖర్చులు పెరుగును. కుటుంబ సభ్యులతో వైరములు ఉండును. ఉద్యోగమున అధికారుల వలన స్థానమార్పులు. చేపట్టిన పనులలో ఆటంకములు ఏర్పడును. మిత్రులతో మాటపట్టింపులు వస్తాయి.


నవంబర్ :ఈ మాసంలో అనుకూలంగా లేదు. నూతన వ్యాపార ప్రారంభ మూలక నష్టములు కలుగును. అనారోగ్య సమస్యలు ఉంటాయి. కొన్ని వ్యవహారములలో మధ్యవర్తిత్వము వ్యవహరించుట మంచిది కాదు. కోర్టు విషయములలో జాప్యం కలుగును. వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. 


డిసెంబర్ :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. నూతన భూమి, గృహ క్రయ లాభం. నూతన పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపార మూలక లాభం వస్తుంది. మాట విషయంలో తొందరపాటు మంచిది కాదు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు.


*పరిహారం:-శనిశ్వరునికి తైలాభిషేకం చేయించాలి. నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యాలి. ప్రతి మంగళవారం వినాయకునికి సిందూరం గరికి గడ్డి సమర్పించాలి.*


*సింహ రాశి*


జన్మ స్థాన కేతు, అష్టమ శని దోషం వలన ఈ సంవత్సరం కష్ట కాలంగా ఉంటుంది. కానీ లాభం స్థానం గురుని వలన సమస్యలు అదిగమించి ముందుకు సాగుతారు. విద్యార్థులు మరింత కష్టపడవలసి రావచ్చు. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగించును. కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యహరించడం మంచిది. రాజకీయ నాయకులకు తొందరపాటు నిర్ణయాలు వలన నష్టం తప్పదు. కోర్టు వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. వ్యవసాయా రంగం వారికి కష్టం తప్ప లాభం ఉండదు. అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. రాహు కేతువుల ప్రభావం చేత కుటుంబ సమస్యలు, ఆందోళనలు, ఒత్తిడులు అధికమగును. కీలక వ్యవహారముల నందు ఆచితూచి ముందుకు సాగడం మంచిది. 


జనవరి :ఈ మాసం అనుకూలంగా లేదు. మానసిక ఆందోళనలు. వ్యాపార మూలక ధన నష్టాలు ఉంటాయి. వృధా ప్రయాణ ఖర్చులు. నూతన ఋణ ప్రయత్నములు చేస్తారు. కుటుంబ కలహాములు కలవు. స్థానమార్పులు ఉంటాయి.


ఫిబ్రవరి:ఈ మాసం అనుకూలంగా లేదు. బంధు వర్గంతో వివాదములు. మనో ధైర్యంతో కొన్ని పనులు. సంతాన విద్యా విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి. పాత మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.


మార్చి :ఈ మాసం అనుకూలంగా లేదు. దేవాలయ దర్శనములు చేస్తారు. కుటుంబ సభ్యుల వలన ఇబ్బందులు ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఒక వార్త విచారం కలిగిస్తుంది. ఆదాయం అంతగా ఉండదు.


ఏప్రిల్ :ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారములు కొంత కలసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల సమయం. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేస్తారు. మానశికానందము లభిస్తుంది. 


మే :ఈ మాసం మిశ్రమంగా ఉన్నది. గృహమున శుభకార్యాల నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలాభములు ఉంటాయి. కుటుంబ సభ్యుల వలన సౌఖ్యం. ఉద్యోగమున అధికారులతో ఇబ్బందులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఖర్చులు చేదాటుతాయి.


జూన్ :ఈ మాసం అనుకూలంగా లేదు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ముఖ్యమైన పనులు అధికష్టం మీద గాని పూర్తి అవుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ధన వ్యవహారాలలో కొంత శ్రద్ధ వహించాలి.


జూలై :ఈ మాసం అనుకూలంగా లేదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలసి తీర్థయాత్రలు చేస్తారు. ఇతరుల నుండి ఊహించిన విమర్శలు ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనులు ఆలస్యంగా పూర్తి అవుతాయి. శుభకార్య ఆటంకములు కలుగుతాయి. 


ఆగస్టు :ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. నూతన పరిచయాలు కలసి వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. చిన్నపాటి వివాదాలు తప్పవు. 


సెప్టెంబర్ :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. బంధుమిత్రులతో గృహమును ఆనందంగా గడుపుతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. నూతన వ్యాపార ప్రయత్నాలు కొంత లాభసాటుగా సాగుతాయి.


అక్టోబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. బంధు వర్గం నుండి విమర్శలు పలితాలు ఉంటాయి. అకారణ ఖర్చులు పెరుగుతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిగా ఇబ్బంది పడతారు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.


నవంబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. క్రయ విక్రయ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు సామాన్యంగా సాగుతాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.


డిసెంబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. కుటుంబ కలహములు. శుభకార్య ఆటంకాలు వస్తాయి. బంధు వర్గ వివాదములు ఉంటాయి. వృత్తివ్యాపారాలలో ఊహించని నష్టాలు కలుగుతాయి. కోర్టు వ్యవహారాలలో జాప్యం తప్పదు.


*పరిహారం:-శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేయించాలి. నల్ల నువ్వులు 1 ¼ kg దానంగా ఇవ్వాలి. నిత్యం గణపతి స్తోత్రం, అర్జున దుర్గా స్తోత్రం పారాయణం చేయ్యాలి.*


*కన్యా రాశి*


 ఈ రాశివారికి ఉద్యోగస్తులకు ఉన్నతి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి పొందుతారు. ఆదాయ వృద్ధి. గృహమున శుభకార్యమూలక లాభము. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. ఋణ బాధలు నివృత్తి పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విదేశీ ప్రయాణాలు కలసివస్తాయి. విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అన్ని రంగాలవారికి కలసివచ్చును. వ్యాపారస్తులకు విశేషమైన లాభములు కలుగును. వ్యవసాయ రంగం వారికి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. శత్రు సమస్యలు కొంత సర్దుమణుగుతాయి. స్త్రీలకు కుటుంబ సౌఖ్యం ఆనందము ఆరోగ్య లాభము కలుగుతుంది. క్రయవిక్రయాలు కలిసి వస్తాయి.


జనవరి :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాట్టుగా సాగుతాయి. మాసం మధ్యలో కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.


ఫిబ్రవరి :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. కోర్టు వ్యవహారములు అనుకూలిస్తాయి. గృహ సంబంధ వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.


మార్చి :ఈ మాసం అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపార ఉద్యోగాలు లాభసటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యవసాయ సంబంధిత పనులలో అనుకోని లాభాలు అందుకుంటారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.


ఏప్రిల్ :ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నవి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ధన వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. సమయానికి నిద్రాహారాలు ఉండకపోవచ్చు. వ్యాపారాలలో నష్టాలు తప్పవు.


మే :-ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు కలసి వస్తాయి. ఒక కీలక విషయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.


జూన్ :ఈ మాసం అనుకూలంగా లేదు. ధనమును ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల విషయాలలో జాగ్రత్త అవసరం. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ పనులు మందకోడిగా సాగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.


జూలై:- ఈ మాసం అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. దూరపు బంధువుల నుండి అందిన ఒక వార్త ఆందోళన కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో బేదాభిప్రాయాలు కలుగుతాయి. ధన రుణ సమస్యలు బాధిస్తాయి 


ఆగస్టు :ఈ మాసం అనుకూలంగా లేదు. పనులందు కార్యాటంకములు. కోర్టు సంబంధిత వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. రుణ ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.


సెప్టెంబర్ :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యవసాయాలలో ఊహించిన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన పనులలో ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు.


అక్టోబర్ :ఈ మాసంలో అనుకూలంగా లేదు. ఇతరులతో అకారణ విభేదాలు. శుభకార్య మూలక ఆటంకములు జ్వరాది అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధు వర్గ వివాదములు ఉంటాయి. దూర ప్రయాణంలో జాగ్రత్త అవసరం.


నవంబర్ :ఈ మాసం మిశ్రమంగా ఉన్నది. స్త్రీ మూలక ధన వ్యయము. ఇంట బయట విమర్శలు తప్పవు. ఉద్యోగ వ్యాపార మూలక నష్టములు కలవు. వృధా ప్రయాణములు జ్వరాది అనారోగ్యములు. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త అవసరం.


డిసెంబర్ :-ఈ మాసం అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు. వ్యాపార మూలక నష్టములు ఉంటాయి. అనారోగ్య సమస్యలు స్థానచలనములు ఉన్నాయి. ధన నష్టములు విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.


*పరిహారం:-ఆదిత్య హృదయ స్తోత్రం నిత్యం పారాయణం చేయడం.ఆదివారం శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవాలి.నిత్యం గృహమున లక్ష్మీ ఆరాధన చేసుకోవడం వలన శుభ ఫలితాలను పొందుతారు.*


*తుల రాశి ఆదాయం*


 బాగుంటుంది ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రయత్నములు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు. ఆరోగ్య లాభము కుటుంబమున శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులు కష్టానికి తగిన ప్రతిఫలాలు పొందుతారు. నూతన వ్యాపార ప్రారంభములు చేస్తరు. పెట్టుబడులు కలిసి వస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు ఒక కొలిక్కి తెచ్చుకుంటారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ సౌఖ్యం, కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ వర్గాల వారు పదోన్నతులు పొందుతారు.


జనవరి :ఈ మాసం అనుకూలంగా లేదు. శుభకార్యాలకు ఖర్చులు పెరుగుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు.


ఫిబ్రవరి :ఈ మాసం అనుకూలంగా లేదు. ధన వ్యయము కుటుంబ కలహములు. కోర్టు వ్యవహారాలలో జాప్యము. వృధా ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన వస్త్రభరణాలు కొనుగోలు చేస్తారు.


మార్చి :ఈ మాసం మిశ్రమంగా ఉన్నది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. అధికారులు సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. వాహన ప్రయాణమును జాగ్రత్త అవసరం.


ఏప్రిల్ :ఈమాసం అనుకూలంగా లేదు. ఉద్యోగము స్థానచలనములు. వృధా ఖర్చులు. క్రయ విక్రయాల విషయంలో తొందరపాటు మంచిది కాదు. దూరపు బంధాల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం.


మే :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు చక్కగా సాగుతాయి. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.


జూన్ :ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు. సంతాన విద్య విషయాలు సానుకూలంగా సాగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. స్వల్పన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.


జూలై :ఈ మాసంలో మిశ్రమంగా ఉన్నది. పాత మిత్రులతో ఆనందముగా గడుపుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు. ఆదాయమునకు మించిన ఖర్చులు పెరుగుతాయి. పుణ్య క్షేత్ర సందర్శనం చేసుకుంటారు.


ఆగస్టు :ఈ మాసం అన్ని విధాలుగా కలసివచ్చును. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధనాదాయం బాగుంటుంది. కీలక వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు కలసి వస్తాయి. శుభకార్య మూలక లాభములు పొందుతారు.


సెప్టెంబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు కలుగుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. స్వల్పన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.


అక్టోబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. ఉంటా బయట వివాదాలు చికాకు పరుస్తాయి. అధికారుల వలన ఉద్యోగం ఉన్న స్థానచలానాలు కలుగుతాయి. పాత మిత్రుల నుండి కీలక విషయాలు తెలుసుకుంటారు.


నవంబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులు మందకోడిగా సాగుతాయి. వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ధనపరంగా స్వల్ప ఇబ్బందులు తప్పవు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.


డిసెంబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. సోదరులతో అకారణం కలహములు జ్వరాది అనారోగ్యములు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ఒప్పందాలు వాయిదా వేయడం మంచిది.


*పరిహారం:-నిత్యం ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయాలి. గురువారం శివాలయంలో ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం చేయించుకోవాలి. గురువారం 1 ¼ kg శనగలు దానంగా ఇవ్వాలి.*


*వృశ్చిక రాశి*


వృధా ఖర్చులు అధికమగును. వృశ్చిక రాశికి పంచమ స్థానములో. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. మానసిక సమస్యలు అధికమయ్యే అవకాశం ఉన్నది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. కాని పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలసివచ్చును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. స్త్రీలకు కుటుంబ సౌఖ్యము, ఆనందము కలుగును. పని ఒత్తిడి ఉన్న అధికమించి ముందుకు సాగుతారు. ఆరోగ్య విషయాలయందు శ్రద్ధ వహించాలి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. రాజకీయ నాయకులకు మిశ్రమంగా ఉన్నది. రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులు లావు సాటిగా ఉన్నప్పటికీ నూతన పెట్టుబదుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గురుబలం తక్కువగా ఉండటం వల్ల అన్ని వ్యవహారలలో జాగ్రత్తగా ఉండటం మంచిది.


జనవరి :ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆదాయం సమానంగా ఉన్నాయి. పాత మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. దూరపు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించడం మంచిది.


ఫిబ్రవరి :ఈ మాసం అనుకూలంగా లేదు. వ్యాపార వ్యవహారములలో జాగ్రత్త అవసరం. శుభకార్యాలలో ఆటంకాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. పాత రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు.


మార్చి :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. నూతన ఉద్యోగం అవకాశములు లభిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన లాభమున్నది. విలువైన వస్త్ర ఆభరణాలు పొందుతారు. కీలక విషయాలలో కుటుంబ పెద్దలతో సంప్రదింపులు చేయుట ఉత్తమం.


ఏప్రిల్ : ఈ మాసం అనుకూలంగా లేదు. ఖర్చులు అధికామౌతాయి. మైఖ్యమైన పనులందు కార్య ఆటంకములు కలుగును. శారీరక శ్రమ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి.


మే :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. భూ క్రయ విక్రయాలు కలసివస్తాయి. పనులందు కార్య లాభం. ప్రయాణాలు కలసివచ్చును. చేపట్టిన వ్యవహారములు విజయవంతంగా పూర్తవుతాయి. కోర్టు పనులు అనుకూలించును. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.


జూన్ : ఈ మాసం అంత అనుకూలంగా లేదు. చిన్ననాటి మిత్రులతో విరోధములు. పుణ్యక్షేత్ర సందర్శనలు చేసుకుంటారు. శత్రు సమస్యలు బాధిస్తాయి. పనులలో ఆటంకములు నిరుత్సాహపరుస్తాయి. క్రయ విక్రయాలు వాయిదా వెయ్యడం మంచిది.


జూలై :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. చిన్ననాటి మిత్రులను కలసుకుంటారు. శుభాకార్య విషయమై చర్చలు జరుగుతాయి. కుటుంబ సౌఖ్యం పెద్దవారితో సంప్రదింపులు కలసివస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకములు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు.


ఆగస్టు :ఈ మాసం అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారపరంగా ఆటంకాలు. ధన నష్టములు, విమర్శలు. స్థానమార్పులు జ్వరాది అనారోగ్యములు. స్త్రీ మూలక కలహాములు స్నేహితుల సహాయ సహకారములతో చాలా పనులు పూర్తి చేస్తారు.


సెప్టెంబర్ :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. పనులందు కార్యజయములు. ఉద్యోగమున అధికార మూలక లాభములు కలుగును. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొన్ని వ్యవహారలలో అందరి సహకారం ఉంటుంది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.


అక్టోబర్ :ఈ మాసం మిశ్రమంగా ఉన్నది. చిన్నపాటి శ్రమతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంనందు తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. విద్యార్థులు మరింత కష్టపడాలి. కోర్టు వ్యవహారములు మందగిస్తాయి.


నవంబర్ : ఈ మాసం అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. శత్రుభయము. వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉద్యోగమున పదోన్నతుల విషయంలో శుభవార్తలు అందుకుంటారు.


డిసెంబర్:ఈ మాసం అనుకూలంగా లేదు. కుటుంబ సమస్యలు వేదిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వృథా ప్రయాణాలు తప్పవు. కోర్టు వ్యవహార సమస్యలు బాధిస్తాయి. వివాహ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. అనారోగ్య సూచనలున్నవి.


*పరిహారం:-శనివారం 1 ¼ kg నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. శనీశ్వరునికి తైలాభిషేకం చేయించాలి. నిత్యం దక్షిణా మూర్తి స్తోత్రం పారాయణం చెయ్యాలి.*


*ధనుస్సు రాశి* 


నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములో ఆటంకములు ఎదురగును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అధికారుల ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఆరోగ్య విషయాలయందు జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు మరింత శ్రద్ధ వహించాలి. స్త్రీలకు కుటుంబములో వాదనలు మరియు ఘర్షణ వాతావరణం వంటివి ఉండవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారంలో మిశ్రమ ఫలితములు ఉండును కుటుంబ సంబంధమైన చికాకులు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆచి తూచి వ్యవహరించండి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహించడం మంచిది. అన్ని రంగాల వారికి ఒత్తిళ్ళు అధికము. వ్యవసాయ రంగం వారికి శుభ ఫలితాలు ఉండును.


జనవరి :-ఈ మాసం అనుకూలంగా ఉన్నది. చేపట్టిన పనులు కలిసి వచ్చును. బంధుమిత్రులతో వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహన యోగం ఉన్నది. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం మంచిది.


ఫిబ్రవరి:-ఈ మాసం అనుకూలంగా లేదు. గౌరవ మర్యాదల విషయంలో లోటుపాట్లు ఉంటాయి.జ్వరాది అనారోగ్య సమస్యలు కొంత భాగిస్తాయి. కొన్ని వ్యవహారాలు మానసిక ఆందోళనలు కలిగిస్తాయి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది.


మార్చి :-ఈ మాసం అనుకూలంగా లేదు. వృధా ఖర్చులు చేదాటుతాయి. గృహమున ఆకస్మిక మార్పులు తప్పవు. పుణ్యక్షేత్ర సందర్శనలు చేసుకుంటారు. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యులతో ఊహించని కలహ సూచనలు ఉన్నవి. 


ఏప్రిల్ :-ఈ మాసం అంత అనుకూలంగా లేదు. సంతాన విద్య విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కలహాలకు దూరంగా ఉండటం మంచిది.


మే :-ఈ మాసం అనుకూలంగా ఉన్నది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చాలాకాలంగా వేధిస్తున్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. దైవారాధన చేయటం మంచిది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.


జూన్ :-ఈ మాసం అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులలో జాప్యం తప్పదు. మానసిక ఆందోళనలు కొంత బాధిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. శుభకార్య సంబంధిత ఖర్చులు పెరుగుతాయి.


జూలై :-ఈ మాసం అనుకూలంగా ఉన్నది. రాస్తే కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూల ఫలితాలు వస్తాయి. గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.


ఆగస్టు :-ఈ మాసం అనుకూలంగా లేదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. శత్రు సంబంధ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. అనారోగ్య సమస్యలు కొంత భాదిస్తాయి.


సెప్టెంబర్ :-ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నవి. వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కుటుంబ సభ్యులతో అకారణ కలహములు. అనారోగ్య సమస్యలు కొంత భాదిస్తాయి. మాసం చివరన ధనాధాయం పెరుగుతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు.


అక్టోబర్ :-ఈ మాసం అనుకూలంగా ఉన్నది. ఉత్సాహంతో అన్ని పనులను పూర్తిచేస్తారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ఖర్చుల విషయంలో తొందరపాటు మంచిది కాదు. నూతన పరిచయాలు కొంత కలసి వస్తాయి. కుటుంబ పెద్దలతో కీలక విషయాలు చర్చిస్తారు.


నవంబర్ :-ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నవి. దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. ఆదాయం వృద్ధి అగును. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తు ఉద్యోగాలలో ఒత్తిళ్లు అధికం.


డిసెంబర్ :-ఈ మాసం అనుకూలంగా లేదు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే తొందరపాటు వలన వివాదాలు తప్పవు. గౌరవ మర్యాదలు కొంత క్షీనత కలుగుతుంది. సంతాన విద్య విషయాలలో మరింత జాగ్రత్త వహించాలి.


*పరిహారం:-శనికి తైలాభిషేకం చేసుకోవటం మంచిది. శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చెయ్యాలి. 1 ¼ kg నల్ల నువ్వులను దానం ఇవ్వండి. గురు శివాలయంలో ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం చేయించాలి. నిత్యం పంచాంక్షారీ జపం చెయ్యాలి.*


*మకరరాశి*


ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములు ఫలించును. ఉద్యోగస్తులకు అధిక ప్రయత్నం మీద పదోన్నతలు పొందుతారు. అధికారులు సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో విశేషమైన మార్పులు చేస్తారు. శత్రు సమస్యలు మరింత బాధిస్తాయి. అయినప్పటికీ కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ధన సంబంధిత వ్యవహారాలలో కొంత శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు ఈ సంవత్సరం మరింత కష్టపడాల్సి రావచ్చు. స్త్రీలు ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించాలి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు తప్పవు. రాజకీయ వర్గం వారికి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యవసాయపరంగా ఈ సంవత్సరం కొంత అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించాలి.


జనవరి :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. చేపట్టిన పనులు కలిసి వస్తాయి. విందు వినోదాధి కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణ సూచనలున్నవి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఇంట బయట మీ మాటకి గౌరవ మర్యాదలు పెరుగుతాయి.


ఫిబ్రవరి :ఈ మాసం అంత అనుకూలంగా లేదు. ఇతరులు మాటను నమ్మి మోసపోవడం జరగవచ్చు. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. నూతన రుణ ప్రయత్నాలు చేసి విసుగు చెందుతారు. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. జ్వరాది అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.


మార్చి :ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. కొన్ని విషయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.


ఏప్రిల్ :- ఈ మాసం అనుకూలంగా లేదు. ఉంటా బయట ఊహించిన సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. వృత్తి, ఉద్యోగాల విషయంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. సంతాన విద్యా విషయాలను నిరుత్సాహపరుస్తాయి.


మే :ఈ మాసం అనుకూల ఫలితాలు ఉన్నాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి. నూతన వ్యాపార ప్రారంభ ప్రయత్నాలు కలసివస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.


జూన్ :ఈ మాసం అనుకూలంగా లేదు. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహా తీసుకుని ముందుకు సాగడం మంచిది. మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి.


జూలై :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు పలిస్తాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రు సంబంధమైన సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.


ఆగస్టు :ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. దైవారాధన చేయటం మంచిది.


సెప్టెంబర్ :ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నవి. ధనధాన్య నష్టములు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ కలహ సూచనలు. వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. భూ గృహ క్రయ విక్రయాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగమున అధికారులతో సమస్యలు కలుగుతాయి.


అక్టోబర్ :ఈ మాసం మీకు మిశ్రమంగా ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో స్థాన చలనాలు. ముఖ్యమైన పనులు మరింత కష్టపడితే గాని పూర్తిగావు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. నూతన పరిచయాలు కొంత అనుకూల ఫలితాలు ఇస్తాయి.


నవంబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యుల మధ్య అకారణ కలహాలు కలుగుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల వలన ఊహించని సమస్యలు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించడం మంచిది. 


డిసెంబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. ఇంటా బయట గౌరవ మర్యాదలు తగ్గుతాయి . రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ధనధాన్య నష్ట సూచనలు. మానసిక ఒత్తిడిలు పెరుగుతాయి . సంతాన విద్యా విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరూత్సాహపరుస్తాయి.


*పరిహారం:-నిత్యం అర్జునకృత దుర్గాస్తోత్రం, గణపతి అష్టకం పారాయణం చెయ్యాలి. శనివారం 1 1/4 kg నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. శనీశ్వరునికి తైలాభిషేకం చేయించాలి.*


*కుంభరాశి*


ఈ సంవత్సరం మిశ్రమంగా ఉన్నది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఇంట బయట సమస్యలు అధికముగా ఉండును. శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్ళు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నము నందు ఆటంకములు ఎదురగును. ఉద్యోగస్తులకు సమస్యలు తప్పవు. రాజకీయ రంగం వారికి ఒత్తిడి అధికం. విద్యార్థుల ఫలితాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలున్నాయి. నూతన రుణాలు చెయ్యకపోవడం మంచిది. వ్యవసాయ రంగం వారికి అధిక కష్టం అల్ప ఫలితం పొందుతారు.


జనవరి :ఈ మాసం మిశ్రమంగా ఉన్నది. నూతన వ్యాపారములు కలసివచ్చును. గృహమున శుభాకార్యములు నిర్వహిస్తారు. నూతన రుణాలు చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి.


ఫిబ్రవరి :ఈ మాసం మిశ్రమంగా ఉన్నది. ఆదాయం పెరుగుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగమున అధికారుల ఒత్తిడి ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. గృహమున శుభాకార్యములు నిర్వహిస్తారు.


మార్చి :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన పరిచయములు పెరుగుతాయి. ముఖ్యమైన విషయాలలో దైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారముల లాభసాటిగా సాగుతాయి. కోర్టు వ్యవహారలలో విజయం సాధిస్తారు.


ఏప్రిల్ :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. ఉద్యోగకాశములు పెరుగుతాయి. గృహమున దైవకార్యములు చేస్తారు. కీలక సమయంలో స్నేహితుల సహాయ సహకారములు అందిస్తారు. దూర ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. క్రయ విక్రయాలు వాయిదా వెయ్యడం మంచిది.


మే :ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున స్థానమార్పులు ఉంటాయి.


జూన్ :ఈ మాసం అనుకూలత లేదు. మానసిక ఆందోళనలనుగా ఉంటుంది. స్త్రీ మూలక కలహాములు. పనులందు ఆటంకములు కలుగును. ధన వ్యయము శుభాకార్య ఆటంకములు ఉండును. ఇతరుల వలన సమస్యలు తప్పవు. వృత్తి ఉద్యోగములలో ఆందోళనలు కలుగుతాయి.


జులై :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.


ఆగస్టు :ఈ మాసం అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగమున ఆకస్మిక స్థానచలనాలు ఉన్నయి. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారపరంగా మందకోడిగా సాగుతాయి.


సెప్టెంబర్ : ఈ మాసం అనుకూలంగా లేదు. స్నేహితుల వలన ధనుసమస్యలు ఉన్నాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. మానసిక ఆందోళనలు చికాకు పరుస్తాయి.


అక్టోబర్ :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. వృత్తి వ్యాపారపరంగా కలసివచ్చును. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులున్నప్పటికి అదిగమించి ముందుకు సాగుతారు. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.


నవంబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. క్రయ విక్రయాలకు ఆటంకాలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేయుదురు. విద్యార్థులకు మరింత శ్రద్ద అవసరం. ఉద్యోగమున స్థాన మార్పులు. అకారణ కలహములు ఉంటాయి. ఇంట బయట ఒత్తిడి అధికమగును.


డిసెంబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. వివాహ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. నూతన పరిచయాల వలన సమస్యలు తప్పవు. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి రావచ్చు. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాల వలన సమస్యలు.


*పరిహారం:-నిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యాలి. శనివారం 1 1/4 kg నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. శనీశ్వరునికి తైలాభిషేకం చేయించాలి.గురువారం శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం చేయించాలి.*


*మీన రాశి*


ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమంగా ఉన్నది. ఆరోగ్య విషయాలయందు కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు అవసరం. ముఖ్యమైన వ్యవహారములందు సమస్యలు తప్పవు. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ఆకస్మిక ధన వ్యయము. ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలున్నవి. విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నవి. విద్యా విషయంలో జాగ్రత్త అవసరం. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సభ్యులతో వివాదాలు బాధిస్తాయి. అన్ని విషయాలలో ప్రశాంతంగా ఉండటం మంచిది. వ్యవసాయ రంగం ఉన్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులు నూతన పెట్టుబదుల విషయంలో జాగ్రత్త అవసరం. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. కోర్టు వ్యవహారాలు అనుకూలం. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అన్ని రంగాల వారు జాగ్రత్తగా ఉండాలి. శత్రు సంభంద సమస్యలు కొంత బాధిస్తాయి.


జనవరి :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.నూతన వాహన యోగం ఉన్నది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. సోదరులతో చిన్నపాటి కలహా సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. 


ఫిబ్రవరి :ఈ మాసం మిశ్రమంగా ఉన్నది. వృధా ప్రయాణ సూచనలు ఉన్నాయి. కొన్ని పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిన్న నాటి మిత్రులను కలుసుకుంటారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.


మార్చి :ఈ మాసం అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో వివాదములు కలుగుతాయి. వ్యాపార పరంగా కొంత జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మిత్రులు కూడా శత్రువులుగా మారతారు. ధన వ్యయ సూచనలున్నవి ఉన్నాయి. చేపట్టిన పనులలో ఆటంకములు కలుగుతాయి.


ఏప్రిల్ :ఈ మాసం అనుకూలంగా లేదు. ధన వ్యయము, శారీరక అనారోగ్యములు. పనులందు ఆలస్యము కలుగును. వ్యవసాయ మూలక నష్టములు. అకారణ కలహాములు కలుగును. కుటుంబ కలహాములు బాదించును. 


మే :ఈ మాసం అనుకూలంగా లేదు. మానసిక ఆందోళనలు, బందు మూలక సమస్యలు. ఇంట బయట మాట పట్టింపులు వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సంతాన విద్యా విషయాలలో శ్రద్ద వహించాలి. ఉద్యోగమున స్థాన చలనములు ఉన్నాయి.


జూన్ :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. గృహమున బంధుమిత్రులతో ఆనందముగా ఉంటారు. ధనాదాయము బాగుండును. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని పనులు వాయిదా వెయ్యడం మంచిది. 


జూలై :ఈ మాసం అనుకూలంగా లేదు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపార వ్యవహారముల నష్టములు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్త అవసరం.


ఆగస్టు :ఈ మాసం అనుకూలంగా లేదు. కుటుంబం సభ్యులతో వివాదములు, శుభాకార్యములకు ఖర్చులు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. ప్రయాణముల యందు జాగ్రత్త అవసరం.


సెప్టెంబర్ :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మానసికంగా ప్రశాంతంగా ఉండటం మంచిది.


అక్టోబర్ :ఈ మాసం మీకు మిశ్రమంగా ఉన్నది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణములు వాయిదా వెయ్యడం మంచిది . అధికారుల విషయంలో జాగ్రత్తగా వ్యవహారించాలి.


నవంబర్ :ఈ మాసం మిశ్రమంగా ఉన్నది. వృధా ఖర్చులు పెరుగుతాయి . ఉద్యోగస్తులకు ఊహించని స్థాన చలనాలు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి.


డిసెంబర్ :- ఈ మాసం అనుకూలంగా ఉన్నది. వ్యాపారపరంగా ఊహించని లాభాలు అందుకుంటారు. బంధుమిత్రుల సహాయ సహకారములు అందుతాయి. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.


*పరిహారం:-దశరథప్రోక్త శని స్తోత్రం నిత్యం పారాయణం చెయ్యాలి, శనీశ్వరునికి తైలాభిషేకం చేయించాలి. 1 ¼ kg నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి.*

కామెంట్‌లు లేవు: