1, జనవరి 2025, బుధవారం

విష్ణు సహస్రనామ స్తోత్రము*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *విష్ణు సహస్రనామ స్తోత్రము*

           *రోజూ ఒక శ్లోకం*

*అర్థం, తాత్పర్యం, ఆడియోతో*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్లోకం (6)*


*అప్రమేయో హృషీకేశః*

*పద్మనాభోఽమరప్రభుః ।*


*విశ్వకర్మా మనుస్త్వష్టా*

 *స్థవిష్ఠః స్థవిరో ధ్రువః ॥*


*ప్రతిపదార్థం :~*


*46) అప్రమేయః -- ఏ విధమైన ప్రమాణములచేత తెలియరానివాడు; కొలతలకు అందనివాడు*


*47) హృషీకేశః - ఇంద్రియములకు (హృషీకములకు) అధిపతి;*


*48) పద్మనాభః -- నాభియందు పద్మము గలవాడు, భగవంతుడు.*


*49) అమరప్రభుః --‌ దేవతలకు ప్రభువైనవాడు*


*50) విశ్వకర్మా --- విశ్వమును సృష్టించిన వాడు*


*51) మనుః - మననము చేయు మహిమాన్వితుడు; సంకల్పము చేతనే సమస్తమును సృష్టించిన వాడు.*


*52) త్వష్టా --- ప్రళయకాలమున సమస్త భూతములను కృశింపజేసి నశింపజేయువాడు.*


*53) స్థవిష్ఠః -- బ్రహ్మాండమును తనయందు ఇముడ్చుకొన్న బృహద్రూప మూర్తి;*


*54) స్థవిరః --- సనాతనుడు; సదా ఉండెడివాడు*


*55) ధ్రువః --- కాలముతో మార్పు చెందక, ఒకే తీరున, స్థిరముగా ఉండెడివాడు*


*స్థవిరో ధ్రువః (ఆది శంకరాచార్యులు ఒకే నామముగా పరిగణించిరి) --- స్థిరుడై, నిత్యుడై, కాలాతీతుడైన వాడు.*


*తాత్పర్యము:~*


*ఏ విధమైన ప్రమాణములచేత తెలియరానివాడును; ఎటువంటి కొలతలకు అందనివాడును, ఇంద్రియములకు అధిపతియును, నాభియందు పద్మము గలవాడును, దేవతలకు ప్రభువైనవాడును, విశ్వమును సృష్టించిన వాడును, మననము చేయు మహిమాన్వితుడును; సంకల్పము చేతనే సమస్తమును సృష్టించిన వాడును, ప్రళయకాలమున సమస్త భూతములను కృశింపజేసి నశింపజేయువాడును, బ్రహ్మాండమును తనయందు ఇముడ్చుకున్న బృహద్రూప మూర్తియును, సదా ఉండెడివాడును, అగు శ్రీమన్నారాయణుడికి శిరస్సు వంచి వందనం మొనర్చుచున్నాను*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*(ఏరోజుకా రోజు ఇచ్చిన శ్లోకాన్ని కంఠస్థం వచ్చేదాకా మననం చేద్దాం)*


*సూచన: భరణి నక్షత్రం రెండవ పాదం జాతకులు పై 6వ శ్లోకమును నిత్యం కనీసం 11 పర్యాయములు పఠించడం ద్వారా వారు సకల శుభాలను పొందగలరు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఓం నమో నారాయణాయ!*

*ఓం నమః శివాయ!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

కామెంట్‌లు లేవు: