*రామో విగ్రహవాన్ ధర్మః*
వేదాలలో నిక్షిప్తమైన ధర్మం సాకారంగా భౌతిక నేత్రాలకు దర్శనీయం కాదు. అందుకే ఆచరణయోగ్యమైన ధర్మం ఆకారం దాల్చి శ్రీరామునిగా అవనీతలంపై అవతరించింది.
ధర్మసంరక్షణార్థం భగవంతుడు దాల్చిన అవతారాలలో రామావతారం పూర్ణావతారము.
రామస్య ఆయనం - రామాయణం
ఆయనం అంటే గమనం లేదా కదలిక. రామాయణం అంటే రామగమనం అదే ధర్మం యొక్క కదలిక.
రాముడిని కొలవటం అంటే ధర్మాచరణ చెయ్యటమే.
రాముల వారు తిరిగి వారి జన్మభూమికి సపరివారం గా ఈ సంవత్సరం విచ్చేశారు, అంతకన్నా పెద్ద పండగ మనకి ఏముంటుంది.
*కోదండపాణి: కులదైవతం నః*
అయోధ్య లో రామాలయం ఆవిష్కరణ కి మన తరం అందరం సాక్షీభూతులయ్యాం. ఒకరోజు *కొన్ని గంటలు చేసుకునే వేడుకతో సంబంధం ఏముంది, మనకి నిత్యం పండగనే, వేడుకనే*
వందల సంవత్సరాల నందీశ్వరుడి తన స్వామి రాక కై చూస్తున్న ఎదురుచూపులకి సమాధానం, బాలకృష్ణుడి పునరాగమానికి మార్గం త్వరలో సుగమం కావాలని సంకల్పం చేద్దాం.
రాములవారు సూచించిన మార్గం లో అందరం నడిచేలా ఆయన్నే శక్తి ఇమ్మని కోరుకుందాం.
ఇష్టం మనిషాణ| అముం మనిషాణ| సర్వం మనిషాణ|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి