ఉ.కళ్ళెము వేయ దుర్మతుల ఘాతుకముల్ నశియింపవెప్పుడున్
గుళ్ళను గోపురమ్ములను కోరికతో చరియింప పాపముల్
త్రెళ్ళునె కర్మజాలములు? తీవ్రములౌ ఫలమీయ కున్న నా
కుళ్ళు నశింపజాల దిల క్రూరపు మత్త కృతఘ్నతాళికిన్౹౹ 109
ఉ.కావుము కావు కావుమని కాలునికిన్ మొర పెట్టుకున్నచో
పోవునె పాపకర్మముల పూర్ణ ఫలమ్ములు జీవితమ్మునం
దేవిధి జేసినన్ ఫలము లెప్పుడు ధర్ముఁడె నిర్ణయించెడున్
గావున విజ్ఞతన్ మదిని గల్గి చరించిన మేల్మి నొందనౌ! ౹౹ 110
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి