12, ఆగస్టు 2024, సోమవారం

దుఃఖానికి కారణం

 *మానవుని దుఃఖానికి కారణం ఏమిటి???*


"అపోహయే దుఃఖ హేతువు" అని శాస్త్ర వచనం...!!


ఒక సింహపు పిల్ల తప్పిపోయి, గొఱ్ఱెలు మేపు వారికి దొరికింది...

వారు దానిని తన గొఱ్ఱెల మందలతో పాటు పెంచగా, కొంచెం అది పెద్దదైంది. 

అది గొఱ్ఱెలలో తాను ఒక గొఱ్ఱెను అనే అనుకునేది...అలాగే ప్రవర్తించేది...

ఒకసారి అవన్నీ అడవిలో మేస్తుండగా, వేరే సింహం వచ్చి, ఈమందపై పడింది...


గొఱ్ఱెలన్నీ పారిపోయాయి, సింహం పిల్ల కూడ, వాటితో పాటు పారిపోసాగింది. 


అడవి సింహం దీనిని చూసి, ఆశ్చర్యపడి, ఎలాగో పరుగెత్తి దానిని ఆపింది.

"చిన్న గొఱ్ఱె ను నన్ను చంపకయ్యా"అంది వణికిపోతూ సింహం పిల్ల...


అడివి సింహం నవ్వి, దానిని ఓ కొలను వద్దకు తీసుకెళ్ళి నీటిలో తమ ప్రతి బింబాలను చూపింది. 

మూతి పై మీసాలు చూపింది, పిల్ల సింహం గొఱ్ఱె ను కానని తెలుసుకుంది. 

తాను కూడా సింహమేనని, తలచి సింహంలా గర్జిస్తూ అలాగే సంచరించ సాగింది...


ఐతే ఇక్కడ సింహా నికి కొత్తగా వచ్చినది, స్వరూప జ్ఞానమేకాని, స్వరూపం కాదు..ఆదిత్యయోగీ.


అందుకే మానవుని, దైవ స్వరూపులుగా భావిస్తారు, సంబోధిస్తారు, 

కాని మనం ప్రాకృతమైన జీవితానికి అలవాటు పడి, మనలో ఉన్న పరమాత్మను, విస్మరిస్తున్నాము...


జీవుడు,దేవుడు ఒకటే , మన స్వస్వరూపం , ఆత్మయే... అని తెలుసుకోవాలి ...

ఏదీ శాశ్వతం కాదు, అన్నీ నిమిత్త మాత్రమే అని భావించాలి, అశాశ్వతమైన వాటిపై ఆశ వదలాలి ... 

.


*"కష్టాలనేవి భగవంతుని వరాలు. వాటిలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. కష్టాలను అనుభవించడం ద్వారా అంతరంగంలో అనేక అనుభూతులను పొందవచ్చు"* *"జెరిమీ టేలర్"* అనే మహాశయుని అభిప్రాయం ప్రకారం. మతంలో దాగి ఉన్న అనేక నిగూఢ రహస్యాలు, అనుభవపూర్వకంగానే తప్ప, అవగాహనకు రావు. ఏదైనా గొప్ప ఆపద సంభవించినప్పుడే అవి అనుభవంలోకి వస్తాయి. *"మిలేట్"* అభిప్రాయం ప్రకారం. విపత్తు అనగా ఓరిమి, *చక్కని వినమ్ర భావము, స్థిమితమైన స్థైర్యము, ప్రతిష్ట - ఇవన్నీ లోతుగా వేళ్ళూనుకుని దృఢంగా వర్ధిల్లడానికి సహాయపడే సారవంతమైన నేల వంటిది.*

.

హనుమంతుడు సూర్యుడి దగ్గర విద్యను నేర్చుకోవాలనుకున్నాడు. వెంటనే వెళ్లి సూర్యనారాయణుడికి నమస్కరించి విద్యలు నేర్పమని వినయంగా అడిగాడు. అందుకాయన ‘‘నేను ఒకచోట కూర్చుని పాఠం చెప్పలేనని’’ చెప్పాడు.


ఎందుకంటే ఒకేచోట కూర్చునుంటే లోకానికి ఇబ్బంది. ఉదయాన్నే బయల్దేరతాడు. అదేవేగంతో వెళ్ళిపోతుంటాడు. వెళ్లిపోవడమంటే ఏ విజయవాడో వెళ్ళి రావడం కాదు. బ్రహ్మాండాలన్నీ చుట్టివస్తాడు.అంతవేగంతో వెడుతున్నవాడు చెబుతున్న మాటలు వినడం కష్టం. పైగా ఎప్పుడూ ఒకేలా ఉండడు. ఉదయం బయల్దేరినప్పుడు దగ్గరగా వెళ్ళి వినవచ్చు. మధ్యాహ్న సాయంకాలాలు అలా కుదరదు. మార్తాండుడై ఉంటాడు. భరించడం కష్టం.సాధారణంగా ఎదురుగా కూర్చుని ముఖం కనబడేటట్లుగా ఉండి చెపుతుంటే మాటలను పట్టుకోవడం తేలిక. కానీ ఇక్కడలా కుదరదు. అలాగని గురువుగారి పక్కన పరుగెడుతూ నేర్చుకుందామా అంటే... రెండు చెవులతో స్పష్టంగా వినడం కుదరదు. గురువుగారికి పృష్ఠభాగం చూపకూడదనే నియమం వల్ల ముందుండడానికి వీల్లేదు. ఇక ఏమిటి మార్గం– గురువుగారి ఎదురుగా నిలబడి, వెనకకు పరుగెడుతూ అదీ సూర్యుడితో సమానంగా, ఒక్క మాట విడిచిపెట్టకుండా నాలుగు వేదాలు, 9 వ్యాకరణాలు నేర్చుకున్నాడు. 


ఇదీ హనుమ వైభవం. అలా నేర్చుకోగలగాలంటే ఆయనకు ఎంత శ్రద్ధ, భక్తి ఉన్నాయో ఆలోచించండి. 


లోకంలో ఎన్నో అవతారాలున్నాయి. హనుమ అవతారం మాత్రమే అంత వైశిష్ట్యం పొందడానికి కారణం – అంత శ్రమకోర్చి గురువుగారి దగ్గర పాఠం నేర్చుకోవడమే.


 హనుమ జీవితం ఒకసారి గమనించండి. 


ఆయన పుట్టీపుట్టగానే సూర్యుడిని చూసి పండనుకొని ఆకాశానికెగిరిపోయాడు. ఇంద్రుడు వజ్రాయుధం పెట్టికొడితే ఎడమ దవడ విరిగి అక్కడినుంచి కిందపడ్డాడు. ఆ తరువాత దేవతలందరూ వచ్చి ఎన్నో శక్తులు ధారపోశారు.ఆదిత్యయోగీ.


 అన్ని శక్తులు పొందిన హనుమ తన జీవితంలో ఓ గంట విశ్రాంతి తీసుకున్నట్లు మీరెప్పుడయినా విన్నారా! లోకంలో ఎవ్వరూ ఎప్పుడూ చేయడానికి సాహసించని కార్యాలను ఆయనొక్కడే సంకల్పించాడు.


నూరుయోజనాల సముద్రాన్ని ఎవరు దాటగలరు? అటువంటిది దాటడమే కాకుండా తానొక్కడే రామభక్తుడిగా ఉండి చుట్టూ రాక్షసులున్నా నిర్భయంగా రావణాసురుడితో మాట్లాడి అంతే వేగంతో తిరిగి వస్తాడు.


అంతటి బలవంతుడు, శక్తిమంతుడు, అంతటి పండితుడు, వ్యాకరణవేత్త, తనగురించి చేసుకున్న పని ఒక్కదాన్ని చూపగలరా! ఎన్ని గ్రంథాలు వెతికినా ఒక్కటీ కనిపించదు. కార్యదీక్షాపరుడు అలా ఉండాలి...

.

మానవ రక్తం లోనే ఉంది దేవుడు భావం .తరాల వారసత్వం తిరుగులేని బానిసత్వం తిరుగులేని అలసత్వం సత్యేమే భ్రమతత్వం .


  ఆత్మగా దేవుడు అన్ని జీవులలో ఉంటే - సాధమా మనిషికి - దుష్కర్మలు చేయ ? తనవారూ - పరవారూ తగునా దేవునికి ?.


  ప్రేమికులు ఎందరో - ప్రేమ కొందరికే - ధనవంతులు ఎందరో - ధర్మాత్ములు కొందరే , మానవులు ఎందరో - మానవత కొందరికే .ఆదిత్యయోగీ.


  అసాధ్యతను ఆలోచన చేయకు ; సాధ్యతను అన్వేషించు మనసు మించిన ' ఇంత్యుసన్ ' , మనిషిలో ఉంది .


  మానవత్వం మనిషి తత్వం అయితే - మానవ జాతి మాననీయమవుతుంది - మహనీయమవుతుంది మనిషిని ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది"..

.

*నా మీద మనసు లగ్నం చేసినవారు భౌతికంగాగాని, ఆధ్యాత్మికంగా గాని భయపడనక్కరలేదు. నన్ను మాత్రమే చూస్తూ నా గూర్చి మాత్రమే వింటూ, నన్నే ఆరాధించేవానికి తప్పకుండా శుద్ధచైతన్య (భగవంతుని) దర్శనభాగ్యం కలుగుతుంది. ఎవరైతే నన్ను నిత్యునిగ శుద్ధునిగ, బుద్ధునిగా ఆరాధిస్తారో వారు నన్ను పొందుతారు....*

.

కామెంట్‌లు లేవు: