*
*జీవితము* నాలుగు *అక్షరాలే* కానీ అందులో *ప్రయాణం* అంతు చిక్కని *అన్వేషణ* ప్రతి మనిషి చూడడానికి బాగానే కనిపించినా *మనసులో* ఎన్నో *బాధలు* కావాలన్నది *దొరకదు* దొరికినది మనతో *ఉండదు* ఒక్క సారి ఎవరికైనా మన *హృదయంలో* స్థానం ఇచ్చామంటే *మన గుండె* చప్పుడు *ఆగే* వరకు ఆ *స్థానం* వారికి మాత్రమే *సొంతం* .
ప్రతి క్షణం *సంతోషంగా* ఉండాలని *తపనే* కానీ సంతోషం *మనిషి* జీవితంలో కొన్ని నిమిషాలు మాత్రమే *కష్టానికి* అలవాటు పడిన వారికి *ప్రతి క్షణం* సంతోషమే కాబట్టి ఉన్నదానితో *సంతృప్తి* పడటమే *జీవితము* .
మనం ఎంత *ఎత్తుకు* ఎదిగినా *గడిపిన* సాధారణ *జీవితాన్ని* మరిచిపోకూడదు గతంలో మనతో కలిసి *బతికిన* వారిని మనకు *సహాయం* చేసిన వారిని మనకు *తోడుగా* ఉన్న వారిని ఎన్నడు *మరచిపోకూడదు*
సృష్టిలో అన్ని *సంపదల* కన్నా ఆరోగ్యంగా *జీవించడమే* అసలైన *సంపద* ఆర్థికంగా మనం ఎంత ఉన్నత *స్థితిలో* ఉన్నా *ఆరోగ్యం* సరిగా లేనప్పుడు ఆ *సంపద* ఉన్నా లేనట్లే ఉన్నవారికి లేనివారికి కావాల్సిన ఏకైక *సంపద* మంచి *ఆరోగ్యం* అందువలన *ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం* చేయకూడదు ఎందుకంటే *ఆరోగ్యమే మహాభాగ్యం*
మనకు ఎన్నో *పండుగలు* వస్తుంటాయి పోతుంటాయి కానీ *మనసుకు* నచ్చిన వారు *మనసారా* మాట్లాడితే *ప్రతిరోజు పండుగలాగే* ఉంటుంది .
*మీ ... గోల్కొండ యదయ్య*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి