మత్స్యావతార చరితము
శ్రీభాగవతమును చెవులార వినుచు
నాధ్యాత్మికానంద మనుభవించేటి
శౌనికాదిగగల్గు సంయమివరులు
పలికిరీరీతిగా ప్రార్థించిసూతు
"విమలాత్మ ! వినమాకు వేడుకయయ్యె
వింతగా పరమాత్మవిష్ణుండు దొల్లి
మత్స్యరూపము దాల్చె మహిమాన్వితముగ.
కర్మబద్ధునిభంగి ఘనుడీశ్వరుండు
నిఖిలనిందిత తమోనిలయమైనట్టి
మీనరూపమునేల మేలనిదాల్చె ?
ఎక్కడ వర్తించె ? నేమియున్ జేసె ?
ఆద్యమై వెలయు నయ్యవతారమునకు
కారణంబెయ్యది ? కార్యంశమేమి ?
నీవేను కర్తవు నిఖిలంబుదెలుప
దేవాదిదేవు డాదివ్యుని చరిత
వివరించి దెల్పుడీ వీనులుపండ "
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి