17, అక్టోబర్ 2023, మంగళవారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


నారదా! పైకి రా. ఎంతసేపు నీ స్నానం? ఇంకా ఏం చేస్తున్నావ్ ఆ నీళ్ళల్లో నిలబడి?

అంటున్నాడు గట్టుమీద నిలబడ్డ శ్రీహరి.

(అధ్యాయం - 29, శ్లోకాలు 66)

నారదుడుగా మారిపోయిన నన్ను చూసి తాళధ్వజమహారాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. నా

భార్య ఏమయ్యింది? ఎటు మాయమయ్యింది? ఈ మునిసత్తముడెవరు? ఎలా ఊడిపడ్డాడు? మమ్మల్ని

ఇక్కడికి తెచ్చిన వృద్ధవిపుడు ఏడి? హాప్రియా! నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు? ఎలా వెళ్ళగలిగావు?

పుత్రశోకంతో పరితపిస్తున్న నన్ను ఒంటరిగా విడిచివెళ్ళడానికి నీకు మనసెలా ఒప్పింది? నువ్వు లేనిదే

నేను జీవించలేను. నా జీవితం వ్యర్థం. నా రాజ్యమూ సంపదలూ వృధా. ఏమి చేసుకోను? ఎలా

జీవించను? నీతోపాటే నా ప్రాణాలను కూడా తీసుకుపోకపోయావా? నాకు బ్రతకాలని లేదు. ప్రాణాలపై

తీపి చచ్చిపోయింది. ప్రియా! ఎక్కడ ఉన్నావో! దయచేసి ఒక్కసారి పలుకు. ఈ దీనుడికి బదులు చెప్పు.

రవ్వంత ఓదార్చు. ఇంతలోనే ఇంత కఠినురాలివి ఎలా కాగలిగావు? ఆ ప్రేమా అనురాగమూ ఏమైపోయాయి?

ఈ నీళ్ళల్లో మునిగిపోయావా? జలచరాలు భక్షించేశాయా? వరుణదేవుడు అపహరించాడా? ఎంత

దురదృష్టవంతుణ్ణి! పుత్రుల్లో కలిసిపోయిన అదృష్టవంతురాలివి నువ్వు. అవును నీ పుత్రప్రేమ అంతటిదే.నేనెరుగుదును. కాకపోతే, నన్నుకూడా తీసుకువెళ్ళుంటే సంతోషించేవాడిని. ఒంటరిని చేసి వెళ్ళిపోయావా?

ఇదేమి అన్యాయం చెప్పు. ఇది నీకు భావ్యమా? నేను చేసిన అపరాధం ఏమిటి? ఎందుకు నాకు ఈ శిక్ష

విధించావు? నేను దీన్ని భరించలేను. అటు పుత్రులను కోల్పోయాను, ఇటు నిన్ను పొగొట్టుకున్నాను.

అయినా ఇంకా బతికే ఉన్నాను. పాడుప్రాణాలు వదిలిపోవు ఇదేమిటి! ఇప్పుడింక నాకు ఏది దారి?

ఎక్కడికి పోను? ఏమి చెయ్యను? భార్యావియోగ దుఃఖాన్ని తట్టుకుని నిలబడడానికి నేనేమన్నా

రఘురాముడినా ? అనురక్తులూ సమచిత్తులూ అయిన దంపతులకు విడివిడిగా మరణం ప్రాప్తించడం

కన్నా భరించరాని దుఃఖం మరొకటి ఉంటుందా ఈ సృష్టిలో అయినా అలాగే జరుగుతోంది. ఆడవాళ్ళు

ఎంత అదృష్టవంతులు, ధర్మశాస్త్రాలు సహగమనం చెప్పాయి. ఇటువంటి దుఃఖాన్ని దిగమింగుకోవలసిన

దుఃస్థితిని స్త్రీలకు తప్పించారుగదా ధర్మశాస్త్రకర్తలయిన మహర్షులు.

ఉపకారస్తు నారీణాం మునిఖిర్విహితః కిల

యదుక్తం ధర్మశాస్త్రేషు జ్వలనం పతినా సహ

కామెంట్‌లు లేవు: