17, అక్టోబర్ 2023, మంగళవారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 56*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 56*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*తవాపర్ణే కర్ణే జపనయన పైశున్య చకితాః*

*నిలీయంతే తోయే నియత మనిమేషా శ్శఫరికాః |*

 *ఇయం చ శ్రీ ర్బద్ధచ్ఛదపుట కవాటం కువలయం*

 *జహాతి ప్రత్యూషే నిశి చ విఘటయ్య ప్రవిశతి‖*


ఓ అపర్ణా, పార్వతీ! అమ్మవారు హిమవంతుని కుమార్తెగా, శివుని కోరి తీవ్రమైన తపస్సు చేసినప్పుడు ఆహారము,నీరు తీసుకోకపోవటమే కాక అట్టి తపస్సులు చేయు మహర్షులు తిన్నట్లుగా ఎండిపోయి నేలవ్రాలిన పర్ణములను ఆకులను కూడా తీసుకొనేది కాదట.అందువలన అపర్ణ.


అమ్మా, నీ చెవుల సమీపాన సదా వుండే నీ విశాల నేత్రాలను చూసి సిగ్గుపడి, తమపై అమ్మవారి చెవులలో కొండెములు చెప్పుతాయనే భయంతో శఫరికలు (ఒక విధమైన చేపలు) నీటిలో దాక్కొని అట్టడుగున ఈదుతాయట. నీ రెప్పవేయని నేత్రాలు (రెప్ప మూస్తే లోకాలు లయమవుతాయని) ఆ విధంగా నీటిలో దాగున్న మీన నేత్రాల వలె వున్నాయమ్మా! చేపలు కూడా రెప్ప వేయవు కదా!   


అదే విధంగా కలువలు (కువలయములు) కూడా తమ అందాన్ని మించిన నీ నేత్రాల సౌందర్యాన్ని చూసి సిగ్గుపడి పగటి వేళల ముడుచుకొని ఉంటాయట. కలువలు రాత్రి సమయంలో విచ్చుకుంటాయి కదా. నీ నేత్ర లక్ష్మి పగలంతా నీ కన్నులలో వుండి రాత్రి వేళ కలువ దళాలను తెరచి అందులో వుంటుందట. ఉదయం కాగానే ఆ దళాలను మూసి వచ్చి మళ్ళీ నీ నేత్రాలయందు ఉంటుందట. 

అమ్మవారు మీనాక్షి అనీ, ఆమె నేత్రాలు పూర్తిగా విచ్చుకున్న కలువలను పోలి ఉంటాయనీ భావం.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: